దారుణం… 300 మంది ప్రేమికులను నిర్ధాక్షిణంగా చంపేశారు

330

పరువు హత్య..ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళను చంపే వారు పెట్టిన పేరు.ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అందుకే మా పరువు పోయింది.అందుకే పరువు కోసం చంపేశాం అని పెద్దలు చెప్తున్నారు.పెళ్లి చేసుకుంటేనే పరువు పోతుందా..చంపేస్తే పరువు పోదా అని యువత పెద్దలను అడుగుతున్నారు.ఎవరి వాదన ఎలా ఉన్నా కానీ ఈ మధ్య ఇలాంటి దారుణమైన హత్యలు చాలా జరుగుతున్నాయి.అయితే గత మూడేళ్ళలో ఎన్ని పరువు హత్యలు జరిగాయో మీకు తెలుసా..ఆ విషయాల గురించి ఇప్పుడు చెబుతా వినండి.

పిల్లల ‘ప్రేమ’ను అర్థం చేసుకుని, వారికి నచ్చిన వ్యక్తితో పెళ్లి జరపాల్సిన పెద్దలు.. పరువు పేరుతో వారి గొంతులు కోసి పైశాచికానికి పాల్పడుతున్నారు. ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ హత్య, హైదరాబాద్‌లో కూతురిపై తండ్రి కత్తితో దాడి ఘటనలు ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేశాయి.తక్కువ కులస్థుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని పిల్లల మీద దాడులు చేశారు వీరు.హైదరాబాద్ ఘటనలో ఎవరు చనిపోలేదు కానీ మిర్యాలగూడ ఘటనలో మామ మారుతీరావు పన్నిన కుట్రకు అల్లుడు ప్రణయ్ చనిపోయాడు.ఏ కూతురి కోసం అయితే అల్లుడిని చంపేశాడో ఆ కూతురి జీవితం ఇప్పుడు నాశనము అయ్యింది.ఇప్పుడు మారుతీరావు కూతురు ప్రెగ్నెంట్.ఆమె వేరే వివాహం చేసుకుంటా అని కూడా అనడం లేదు.ఏ కూతురి కోసం అయితే చేశాడో ఇప్పుడు ఆ కూతురి జీవితమే నాశనము అయ్యింది.ఈ ఘటన ఒక్కటే కాదు ప్రతి పరువు హత్యలో ఇలాగే జరుగుతుంది.మిర్యాలగూడ ఘటన కులాంతర వివాహాలు చేసుకున్న జంటలను వణికించాయి.ఇంతకముందు ‘పరువు హత్య’ అనేది కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమయ్యేది. కానీ, దక్షిణాది రాష్టాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సైతం క్రమేనా వీటి సంఖ్య పెరుగుతోంది. కులం, పరువు పేరుతో దేశంలో గత మూడేళ్లలో సుమారు 300 మంది పైగా ప్రేమికులను చంపేశారు.ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ.కానీ అందరు బలి అయ్యింది మాత్రం ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు.

కొందరిని దారుణంగా కొట్టి చంపగా, మరికొందరిని అపహరించి, చిత్రహింసలకు గురిచేసి శవాలను మాయం చేశారు. దేశంలో చోటుచేసుకున్న పరువు హత్యల పూర్తి వివరాల గురించి ఈ చిత్రంలో మీరు చూడవచ్చు.ఇక్కడ తల్లిదండ్రులు ఒక విషయం గుర్తుంచుకోవాలి.తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల భవిష్యత్ కోసమే.వాళ్ళ సంతోషం కన్నా మీకు కులం ముఖ్యమా.అలాగే పిల్లలు కూడా ఒక విషయం తెలుసుకోవాలి.మిమ్మల్ని కని పెంచి ఆశలన్నీ మీ మీదనే పెట్టుకుంటారు.అలాంటి మీరు వారిని మోసం చేసి నిన్నకాక మొన్న పరిచయం అయినా వాడు ముఖ్యం అంటే వాళ్ళ హృదయాలు తట్టుకోగలవా..ఒక్కసారి ఆలోచించండి.ఆలోచించి ఇక మీద అయినా తల్లిదండ్రుల గురించి పిల్లలు అలాగే పిల్లలు తప్పు చేసిన వారిని క్షమించడం పెద్దలు అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాం.