చనిపోయిన మూడేళ్లకు తండ్రి అయ్యాడు.. అతని భార్య ఏం చేసిందో తెలుసా

554

భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.ఒకరికి ఒకరు పరిచయం లేకున్నా పెళ్లి అనే ఒక సంప్రదాయం ప్రకారం కలిసి జీవితాంతం ఒకరి కోసం ఒకరు బతుకుతారు.కష్టం వచ్చిన సుఖం వచ్చినా కలిసే పంచుకుంటారు.ఆ బంధం ఎంత గొప్పదో తెలిపే ఎన్నో సంఘటనల గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం.భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో తెలిపే సంఘటన ఇప్పుడు మరొకటి జరిగింది.భర్త చనిపోయిన మూడేళ్ళ తర్వాత అతనిని తండ్రి చేసింది ఒక మహా ఇల్లాలు.మరి ఎలా చేసింది.ఆ విషయాలు పూర్తీగా తెలుసుకుందామా.

Image result for pregnancy

సుప్రియ జైన్ ఉద్యోగం కోసం చాలా ఏళ్ల క్రితమే జైపూర్ నుంచి బెంగళూరు వచ్చేసింది. ఆమెకు గౌరవ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. వివాహమై రెండేళ్లు కావొస్తున్న వారికి పిల్లలు కలగలేదు. దీంతో ఐవీఎఫ్‌ను ఆశ్రయించారు.ఐవిఎఫ్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కొద్దిరోజులకు యాక్సిడెంట్‌లో గౌరవ్ ప్రాణాలు కోల్పోయాడు.అప్పటివరకు సంతోషంగా సాగిన జీవితంలో భర్త మరణంతో సుప్రియ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది.కొన్ని నెలల తర్వాత మెల్లగా కోలుకున్న ఆమె భర్త వీర్యంతో గర్భం దాల్చాలని నిర్ణయం తీసుకుంది తెలిసిన వారి సలహాపై ముంబైలోని డాక్టర్ ఫిరుజా పరిఖ్‌ను కలిసింది. ఈ ప్రక్రియ ప్రారంభించే ముందే ఆమె మానసికంగా తనను తాను సన్నద్ధం చేసుకుంది.

Image result for pregnancy

ఇక అంతా సిద్ధం అనుకున్నాక బెంగళూరు నుంచి గౌరవ్ వీర్యాన్ని తెప్పించారు. దాంతో సరిపడా అండాలను పొదిగించారు. కానీ ఐవీఎఫ్ ప్రక్రియ ఫలించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా సరగోసీని ఆశ్రయించారు. వేరే మహిళ గర్భంలోకి గౌరవ్ వీర్యాన్ని ప్రవేశపెట్టారు.భర్త వర్ధంతి రోజున ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లడం సుప్రియకు అలవాటు.అలా ఈసారి ఆమె బాలిలో ఉండగా అబ్బాయి పుట్టాడని ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఫ్లైట్ ఎక్కిన ఆమె తన భర్తతో మూడేళ్ల క్రితం చివరిసారి మాట్లాడిన సమయానికి బిడ్డను ఒళ్లోకి తీసుకుని ఆనంద భాష్పాలు రాల్చింది.నాకు బిడ్డ కావాలని అనుకోలేదు. గౌరవ్ బిడ్డ ఈ భూమ్మీదకు రావాలనుకున్నా. మేం ఎప్పుడూ ఒకరికి జన్మనివ్వాలని, మరొకరిని దత్తత తీసుకోవాలని అనుకునే వాళ్లం. ఇక నుంచి గౌరవ్ వర్ధంతి రోజు నేనెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని సుప్రియ ఉద్వేగంగా చెప్పింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ బిడ్డ ముసి ముసి నవ్వులు నవ్వుతుంటే సుప్రియ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.మా ఆయన రూపం నా దగ్గర ఉంది నాకు అది చాలు అంటూ తన ఆనందాన్ని తెలియజేస్తుంది.విన్నారుగా భర్త చనిపోయిన కూడా అతని ప్రతిరూపాన్ని ఎలా పొందిందో.భర్త చనిపోయిన మూడేళ్ళ తర్వాత అతనిని తండ్రి ఎలా చేసిందో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఈ మహిళ తన భర్తను తండ్రి చేసిన పద్ధతి గురించి అలాగే ఈ ఆమధ్య ఎక్కువగా వినియోగిస్తున్న ఈ సరోగాసి పద్ధతి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.