సైన్స్ వద్ద సమాధానం లేని 3 అద్భుత ప్రకృతి ఘటనలు

505

మన ప్రకృతిలో కొన్ని ఘటనలు జరగడం మానవ జీవితానికి చాలా అవసరం.అంటే పగలు రాత్రిళ్లు ఏర్పడటం కాలాలు మారడం లాంటివి.ఈ ఘటనలు జరగడానికి గల కారణాల గురించి మన అందరికి తెలుసు.ఈ పకృతి చాలా పెద్దది.మానవ మేధస్సుకు అంతుపట్టనంత ప్రత్యేకమైనది.ఇందులోకొన్ని ఘటనలు ఎంత విచిత్రంగా జరుగుతాయంటే అవి జరగడానికి గల కారణాలను తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేశారు.కానీ అర్థం చేసుకోలేకపోయారు. అలాంటి కొన్ని ఘటనల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Related image

1.మార్నింగ్ గ్లోరీ…. ఈ మార్నింగ్ గ్లోరీ అనేవి Q ఆకారంలో ఉన్న మేఘాలు.ఇవి అప్పుడపుడు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తాయి.ఇవి ఎక్కువ ఆస్ట్రేలియాలోని సముద్ర మీద కనిపిస్తాయి.ఈ మేఘాలు ఆకాశంలో అద్భుతంగా కన్నుల విందుగా కనిపిస్తాయి. ఇవి ఆకాశంలో హైవే లాగా కనిపిస్తాయని పైలెట్స్ చెబుతారు.ఈ మేఘాలు కొంత దూరం ఉండక వేల కిమీ ఉంటాయి.ఇవి ఉదయం పూట ఏర్పడతాయి.అందుకే వీటికి మార్నింగ్ గ్లోరీ అనే పేరుపెట్టారు.సముద్రాలలో వచ్చే సుడిగాలిలా వలనే ఇవి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.అయితే ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే..గాలి వేగంలో అది వీచే మార్గంలో మార్పు వస్తుంది.అలాంటప్పుడు గాలుల వలన మేఘాలకు ఇలా రౌండ్ షేప్ లో రావడం అనేది రహస్యంగానే ఉండిపోయింది.శాస్తవేత్తలు చెప్పిన కారణం ప్రకారం సముద్రం ఉన్న అన్ని చోట్ల ఇలాంటి మేఘాలు ఏర్పడాలి కానీ అలా అన్నిచోట్లా ఎందుకు జరగడం లేదు.ఈ ప్రశ్నకు ఎవరి వద్ద సరైన సమాధానం లేదు.

Image result for Moving Rocks

2.మూవింగ్ రాక్స్…. అమెరికాలోని కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ పార్క్ లో ఒక అద్భుతమైన ఘటన జరుగుతుంది.దీని గురించి వింటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.ఇక్కడ చాలా రాళ్లు వాటంతట అవే జారుతూ పాకుతూ ఉంటాయి.ఈ రాళ్లు పాకేటప్పుడు ఎవరు చూడలేదు.కానీ ఈ రాళ్ల వెనుక పాకినట్టు గుర్తులు ఉన్నాయి. అవే దీనికి ఆధారాలు.కొన్ని రాళ్ల దగ్గర అయితే కొన్ని కిమీ మేర పాకిన గుర్తులు ఉన్నాయి.ఇవి పాకడం వెనుక మనుషుల జంతువుల హస్తం ఉందనే విషయం వ్యతిరేకించడం జరుగుతుంది.ఈ రాళ్ళ దగ్గర కేవలం రాళ్ళూ పాకిన గుర్తులే ఉన్నాయి తప్ప మరే ఇతర గుర్తులు లేవు.ఈ రాళ్లు ఎలా పాకుతున్నాయనే ప్రశ్న జనాలను కొన్ని ఏళ్ల నుంచి వేధిస్తూనే ఉంది.2013లో కొంతమంది శాస్త్రవేత్తలు gprs ద్వారా లైవ్ కెమెరాలను పెట్టి పరీక్షించాలని చూశారు.ఈ పరిశోధనలో వాళ్లకు తెలిసింది ఏమిటంటే..చలికాలంలో వర్షాకాలంలో ఇక్కడ కురిసే మంచు వలన భూమి మీద సన్నని పల్చని మంచు పొర ఏర్పడుతుంది.అయితే అక్కడ వేగంగా వచ్చే గాలుల వలన మంచు పొర మీద రాళ్ళూ జరుగుతున్నాయంట.అయితే ఈ ప్రయోగంలో వాళ్ళు చిన్న చిన్న రాళ్లను వాడారు.అయితే పెద్ద పెద్ద రాళ్ళూ కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కు జారుతున్నాయి.అయితే ఆ పెద్ద రాళ్ళూ ఎందుకు కదులుతున్నాయో ఎవరు చెప్పలేకపోయారు.

Image result for Colorful Mountain

3. కలర్ ఫుల్ మౌంటెన్….. చైనా జంగ్యా నేషనల్ పార్క్ లో కొన్ని కొండలు ఎంత అందంగా ఉన్నాయంటే వాటిని చూస్తే వాటి మీద ఎవరో అద్భుతంగా పెయింటింగ్ వేశారని అనిపిస్తుంది.కానీ వీటికి ఈ రంగు పకృతి ప్రసాదించింది.రోజు కొన్ని వేల మంది టూరిస్టులు వీటిని చూడటానికి వస్తారు.కొన్ని వేల ఏళ్ల క్రితం ఎన్నో రకాల ఖనిజాలు ఒకేచోట చేరడం వలన వీటికి ఈ రంగు వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.అయితే ఆ ఖనిజాలు ఏవి.అవి ఈ కొండలకు ఈ రంగును ఎలా ఇచ్చి ఉంటాయనే దానికి శాస్త్రవేత్తల దగ్గర సమాధానమే లేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇవేనండి పకృతి ద్వారా ఏర్పడిన కొన్ని అద్భుతాలకు శాస్త్రవేత్తల దగ్గర సమాధానం లేని ఘటనలు.మరి వీటి వెనుక రహస్యం గురించి మీకేమైనా తెలుసా..ఈ మూడు అద్భుతాల గురించి దాని వెనుక కారణం ఏమి ఉండి ఉంటుంది అనుకుంటున్నారు.మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.