ఒక్కసారి నాతో పడుకో..నీకు నచ్చిన దగ్గర పోస్టింగ్ ఇస్తా అన్న పోలీసుని లేడి హోంగార్డు ఏం చేసిందో తెలిస్తే శభాస్ అంటారు

428

కొంద‌రు ఖాకీలు ప్ర‌జా సేవ చేయ‌డంలో దారుణంగా విఫ‌లం అవుతారు.. అలాగే స‌మాజసేవ చేయ‌డం మాట ప‌క్క‌న పెడితే, కొంద‌రు ఆశాఖ‌లోనే దారుణాలు చేస్తున్నారు.. ఇక మ‌హిళ‌ల‌కు రక్షణ క‌ల్పించాల్సిన ర‌క్ష‌క ద‌ళం ఆ మ‌హిళ‌ల‌పైనే దారుణాల‌కు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ పోలీస్ గ్యాంగ్ ప‌రువు బ‌జారున పెట్టారు మ‌హిళా పోలీసులు మ‌రి ఆ విష‌యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుజరాత్ రాష్ట్ర పోలీసు శాఖలో పని చేసే మహిళా ఉద్యోగినుల పట్ల పైస్థాయిలో ఉండే పోలీసు ఉన్నతాధికారుల లైంగిక వేధింపులు శృతిమించిపోయాయి. బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంటే తమ కోర్కె తీర్చితేగానీ బదిలీ ఆర్డర్‌పై సంతకం చేయబోమని నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. దీంతో ఆ మహిళా ఉద్యోగినులు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళారు. ఇది చివరకు ముఖ్యమంత్రికి చేరింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,నిజానికి గత కొంత కాలంగా గుజరాత్ పోలీస్ శాఖలో లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. నచ్చిన చోటుకు బదిలీ కావాలంటే తమ కోరిక తీర్చాలని సీనియర్ అధికారులు వేధిస్తున్నారంటూ 25 మంది మహిళా హోంగార్డులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు వీరు సూరత్ పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కమిషనర్ సతీశ్‌కు 4 పేజీల లేఖను అందజేశారు. బదిలీ కావాలంటే కోరిక తీర్చాలనీ, లేదంటే భారీగా నగదు ముట్టజెప్పాలని ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మరో సీనియర్ అధికారి అయితే ‘యూనిఫాం సరిచేసుకో’ అంటూ తాకరాని చోట తాకారని ఓ హోంగార్డు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
దీంతో ఈ విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లామనీ, ఈ ఘటనపై జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ విచారణ జరుపుతోందని కమిషనర్ సతీశ్ శర్మ వెల్లడించారు. ఈ ఫిర్యాదు కాపీని ముఖ్యమంత్రి రూపానీతో పాటు హోంమంత్రికి కూడా పంపినట్లు తెలిపారు. విచారణలో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చేశారుగా ఎలాంటి దారుణ‌మైన ప‌ద్ద‌తి ఈ పోలీసులు ప్ర‌వ‌ర్తించారో.