25 వేలకే బులెట్ ఇంతకీ దీని వెనుక ఉన్న మతలబు తెలిస్తే ఆశ్చర్యపోతారు

60

చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న సామెత ఎంత నిజమో దొంగిలించిన సరుకు అమ్ముకుంటే ఎంతో కొంత వస్తుంది అనేది కూడా నిజమే. సగం వచ్చినా సంతోషమేగా అని పట్టుకొచ్చిన వెహికల్స్ అన్నీ తక్కువ రేటుకు అమ్మేస్తోంది ఓ ముఠా. పాపం ఈ విషయం తెలియక బోర్లాపడ్డారు కొందరు యువత, పైగా బులెట్ బైక్ అంటే అందరికి ఇష్టం, ఇంత చీప్ గా వస్తుంది అంటే కొనడానికి ఎగబడ్డారు, కానీ సీన్ మొత్తం పోలీసుల దగ్గరకు వచ్చేసరికి దీని వెనుక ఉన్న మోసం బయటపడింది. మార్కెట్ లో లక్షన్నర ఉన్న బైక్ కేవలం 25 వేలకు ఇస్తున్నారు అంటే, అసలు ఎలా కొన్నారు అని పోలీసులు ప్రశ్నించేసరికి కుర్రోల్లు డీలాపడ్డారు. మరి ఈ ఘరానా మోసం వెనుక ఉన్న నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for bullet bike

కడప జిల్లా నందలూరులో దాదాపు లక్షన్నర ఖరీదు చేసే బుల్లెట్ వాహనం మీద కుర్రకారు షికార్లు కొడుతోంది. నిన్న నడుస్తూ కనిపించావ్. ఇవ్వాళేంట్రా బుల్లెట్ మీద రయ్‌ మంటూ దూసుకుపోతున్నావ్.. ఏంటి సంగతి అని ఆరా తీస్తే.. దీని వెనుక పెద్ద రాకెట్ ఉంది అని తేలింది..కర్నాటక నుంచి కడప జిల్లాలోని నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్, పల్సర్ లాంటి బైకులు భారీగా దిగుమతి చేస్తోంది ఓ ముఠా. వాళ్లు తీసుకువచ్చిన ఆ బైకులను అతి తక్కువ ధరకు అంటే రూ.25 వేల నుండి 50 వేల లోపు రేటుకు అమ్మేస్తున్నారు. ఖరీదైన వాహనం కారు, బండి చౌకగా వస్తుంటే ఎంగ్ జనరేషన్ ఎగబడి కొనేస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బుల్లెట్ బండికి బ్రేకులు వేశారు. పక్క రాష్ట్రం నుంచి బుల్లెట్ వాహనాలను అక్రమంగా తరలించి ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. యువకుల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్న నందలూరు పోలీసులు.. వీటి వెనుక ఉన్న సూత్రధారి ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఇవి దొంగతనం చేసినవా లేదా ఎక్కడైనా షోరూం నుంచి వీటిని మిస్ లీడ్ చేసి తీసుకువస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తానికి పోలీసులు ఈ కథలో ట్విస్టులు తెలుసుకుంటున్నారు..అసలు రూ 1.50 లక్షలు ఉన్న బైకు కేవలం 25 వేలకు వస్తుంది అంటే ఎలా కొంటారు, అవి సెకండ్ హ్యాండ్ బైక్స్ లా కూడా లేవు మరి వాటిని కొనేముందు అసలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని కూడా చూడరా అంటూ యువతను ప్రశ్నించారు పోలీసులు.. ఈ బైక్ ఓనర్స్ కంప్లైంట్ ఇస్తే అవి వారికి ఇచ్చేస్తామని , మీరు ఇచ్చిన డబ్బులు ఆ మోసగాడు దొరికితే వస్తాయి అని చెప్పారట. దీంతో బులెట్ పై రయ్యమని తిరిగిన ఆ యువకులు దిగాలుగా ఇంటికి వెళ్లారు, చూశారుగా మరీ తక్కువకి వస్తుంది అని ఆశపడితే ఇలాంటి లిటిగేషన్ ఏదో ఒకటి అందులో ఉంటుంది. మోసపోయే వారు ఉన్నంత వరకూ మోసం చేసేవారు పుడుతూనే ఉంటారు, బీకేర్ ఫుల్.