81 ఏళ్ల బామ్మను 24 ఏళ్ల కుర్రాడు పెళ్లాడాడు త‌ర్వాత ఏం జ‌రిగిందంటే

379

ఈరోజుల్లో లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ‌లు మ‌నం చాలా చూస్తూనే ఉన్నాం… ఇటీవ‌ల అమెరికాలో 56 ఏళ్ల ఫ్రొఫెస‌ర్ 21 ఏళ్ల లూసీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, అంతేకాదు ఆమెతో జాలీగా హ‌నీమూన్ కు కూడా వెళ్లాడు, అయితే ప‌దేళ్లు ఐదేళ్లు గ్యాప్ కాదు ఇప్పుడు ప్రేమ‌కి పెళ్లికి అంత‌రం మారిపోతోంది… 30 కాదు ఏకంగా 50 ఏళ్ల డిఫ‌రెన్స్ కూడా ఉంటోంది. అయితే ఈ మార్పు ఎందుకు వ‌స్తోంది? యువ‌త ఆలోచ‌న అలా మార‌డానికి కార‌ణాలు ఉన్నాయా అంటే? వారు కోరుకున్న ల‌క్ష‌ణాలు వారు జీవితంలో పైకి రావ‌డానికి వారు సాయం చేస్తారు అనే ఈ రెండు కార‌ణాలు ఇలా ముదురుప్రేమ‌ల‌కు దారితీస్తున్నాయ‌ట‌.

తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి వైర‌ల్ అవుతోంది…ఉక్రెయిన్ కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు 81 ఏళ్ల బామ్మను పెళ్లాడిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకిలా చేశాడు? దీనికి కారణం ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. ఊహించని రీతిలో భిన్నమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తనకు బంధువైన ఆమెపై తనకున్న ప్రేమ కారణంగానే పెళ్లాడినట్లు ఆ కుర్రాడు చెబుతుంటే.. అక్కడి వారు మాత్రం అదంతా ఉత్త అబద్ధమని.. అసలు కారణం వేరేనని చెబుతున్నారు.విషయం మరింత బాగా అర్థం కావాలంటే కొన్ని వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఉక్రెయిన్ లో నిర్బంద సైనిక శిక్షణ తప్పనిసరి. అంటే.. ఒక వయసులోకి రాగానే సైనిక శిక్షణలో పాల్గొనాల్సిందే. ఇందుకు మినహాయింపులు ఉండవు. అయితే.. అనుకోని కారణాలకు మాత్రం శిక్షణ నుంచి మినహాయింపు ఇస్తారు. ఒక వయసు రాగానే పెళ్లి జరగటం.. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండి.. ఆమెను చూసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉంటే మాత్రం నిర్బంద సైనిక శిక్షణ నుంచి మినహాయింపు ఇస్తారు.

ఈ క్రింద వీడియో చూడండి

సరిగ్గా ఇదే పాయింట్ ను తనకు అనుకూలంగా సదరు కుర్రాడు మార్చుకున్నాడన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే అక్కడి స్థానికులు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకుడు విడి రోజుల్లో ఆమెతో కనిపించడని.. ఆమె ఒంటరిగా నివసిస్తూ ఉంటుందని చెబుతారు. అధికారులు సైన్యంలో యువకుల్ని రిక్రూట్ చేసుకునేందుకు వచ్చినప్పుడు మాత్రం.. ఆమెతో అతడు కనిపిస్తాడని.. ఆమెకు తన అవసరాన్ని చెబుతూ వైద్య పత్రాల్ని చూపిస్తాడని చెబుతున్నారు.మరి.. 81 ఏళ్ల బామ్మను ఇదే విషయం మీద అడిగితే.. తన భర్త తనను చాలా ప్రేమగా.. బాధ్యతగా చూసుకుంటాడని చెప్పటంతో అతడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక తల పట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అర్దం అయిందిగా సైన్యంలో చేరేందుకు ఇష్టం లేక ఇలా దోబూచులాడుతున్నాడు, కాని ఇత‌ని పై ఓకింత దృష్టిపెట్టాల‌ని అక్క‌డ ఆర్మీ రెండు రోజుల క్రితం ఫోక‌స్ చేసింద‌ట‌, నెక్ట్స్ రిక్రూట్ మెంట్ కి క‌చ్చితంగా అత‌న్నీ తీసుకువెళ‌తాం అంటున్నారు సైనికాధికారులు, మ‌రి అత‌ని చాతుర్యం చూశారుగా దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.