Rx 100 మించిన ’24 కిసెస్‌ సినిమా దయచేసి పెద్దల మాత్రమే ఈ వీడియో చూడండి.

352

సినిమా అనేది ప్రేక్షకులకు మంచి వినోదాన్ని ఇచ్చేది.100 ఏళ్లుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి.ఏ చిత్రం తీసుకున్నా కూడా ఏదో ఒక సందేశం లేదా కామెడీ లేదా ఫామిలీ ఎమోషన్స్ ఉంటాయి.కానీ ఈ మధ్య కొత్తరకం సినిమాలు వస్తున్నాయి.అవే ముద్దు సినిమాలు.అర్థం కాలేదా..అదేనండి ముద్దులు ఎక్కువగా ఉండే సినిమాలు.ఒకప్పుడు సినిమాలలో శృంగారం చూపించాలంటే చాలా సున్నితంగా చూపించేవారు.కానీ ఇప్పుడు నేరుగా ముద్దులు పెట్టుకోవడమే చూపిస్తున్నారు.ఇప్పుడు ఈ కోవలోకే మరొక సినిమా వస్తుంది.అదే 24 కిస్సెస్.మరి ఆ సినిమా గురించి తెలుసుకుందామా.

Image result for 24kisses

టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్ హెబ్బా పటేల్ అదిత్ అరుణ్ జంటగా నటిస్తున్న చిత్రం “24 కిసెస్”.ఈ చిత్రాన్ని సంజయ్‌రెడ్డి, అనిల్‌ పల్లాలతో కలిసి అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి నిర్మించారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ను అదిత్ అరుణ్ ముద్దుల వర్షంలో తడిపేశాడట. ఈ ముద్దులు ఇక చాలుబాబోయ్ అనేంత వరకు హెబ్బా పటేల్‌కు ముద్దులు పెట్టాడట. అందుకే.. ఈ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు ఏ కంగా “ఏ” సర్టిఫికేట్‌ను జారీచేసింది. అంటే ఈ చిత్రం పెద్దల కేటగిరీలో చేరింది. ఈ చిత్రాన్ని తిలకించేందుకు చిన్నపిల్లలకు అనుమతిలేదు.ఈ చిత్రంలో కథలో భాగంగా హీరోహీరోయిన్ల మధ్య 24 ముద్దులు వస్తాయని, అందుకే ఈ చిత్రానికి 24 కిసెస్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు నిర్మాతలు తెలిపారు. పైగా, ఇందులో హెబ్బా పటేల్ నటన హైలెట్‌గా నిలుస్తుందని, ఈ చిత్రాన్ని ఈనెల 26వ తేదీన విడుదల చేస్తామని తెలిపారు.ఈ సినిమా విషయం పక్కన పెడితే ఈ మధ్య ఇలాంటి చిత్రాలు మరీ ఎక్కువవుతున్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఈ ట్రెండ్ మరీ ఎక్కువవుతుంది.ఆ సినిమాలో మెయిన్ హైలెట్ పాయింట్ అంటే ముద్దు సీన్స్.సినిమా కథ అంతా బాగున్నా దానిని తెరమీద మంచిగా చూపించడానికి దర్శకుడు ముద్దు సీన్స్ ను ఎక్కువగా వాడుకున్నాడు.ఆ తర్వాత వచ్చిన RX 100 కూడా కథ బాగుంది.సినిమాను ఎలా తీసిన హిట్ అవుతుంది.కానీ ఆ కథను కూడా బాగా పండించడానికి ముద్దు సీన్స్ ను ఎక్కువగా వాడుకున్నాడు.అందుకే దర్శకులు మంచి కథ ఒక్కటే సరిపోదు ఇలాంటి ఘాటు సీన్స్ కూడా ఉండాలనుకుంటున్నారు.అందుకే కథను ముద్దు సీన్స్ తోనే నడిపిస్తున్నారు.ఇప్పుడు రాబోయే 24 కిస్సెస్ సినిమా కూడా ఇదే కోవకు వస్తుంది.కథ బాగున్నా ప్రేక్షకులను అట్రాక్ చెయ్యడానికి ముద్దు సీన్స్ తప్పనిసరి అని పెట్టారు.చూడాలి మరి ఈ సినిమా జనాలను ఎలా అట్రాక్ చేస్తుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సినిమాలలో అశ్లీలత పెరగడం గురించి అలాగే హెబ్బా నటించిన ఈ 24 కిస్సెస్ సినిమా గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.