ఈ పురుగుల వల్లే 18 రోజుల్లో 21 సింహాలు చ‌నిపోయాయి.!

227

అడ‌వుల‌కి రారాజుగా చెప్పే సింహాల‌కు ఓ పెద్ద బాధ వ‌చ్చింది.. ముఖ్యంగా ఆహారం లేక నీరు లేక సింహాలు చ‌నిపోతాయి. అంతేకాని అవి చాలా త‌క్కువ‌గా జ‌బ్బులు వ‌చ్చి ప్రాణాలు కోల్పోతాయి. తాజాగా ఇలాంటి దారుణాలు ఇటీవ‌ల జ‌రుగ‌డం లేదు, ముఖ్యంగా అడ‌వుల్లో ఉండే సింహాల‌కు ప‌లు వ్యాక్సిన్లు కూడా ఇస్తూ ఉంటారు సిబ్బంది. వాటికి మ‌త్తు మందు ఇచ్చి వ్యాక్సిన్లు ఇస్తారు. వాటి సంర‌క్ష‌ణ చూసి తిరిగి అడవుల్లో వ‌దిలేస్తారు. ఇలాగే జూ సిబ్బంది కూడా ఒక‌వేళ అవి జూలో ఉంటే వాటి సంర‌క్ష‌ణ చూస్తారు, తాజాగా సింహాలు వ‌రుస పెట్టి ప్రాణాలు కోల్పోవ‌డం ఇక్క‌డ పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

గుజరాత్‌లోని గిర్ అడవిలో గత 18 రోజుల నుంచి 21 సింహాలు మరణించాయి. అందుకు కారణం గుర్తుతెలియని వైరస్, ఇన్‌ఫెక్షన్‌తో అవి మృతి చెందాయని గుర్తించారు అధికారులు… వాటిలో 6 సింహాలు ప్రొటోజోవా ఇన్‌ఫెక్షన్‌తో మరణించినట్టు అధికారులు తెలిపారు. పురుగుల ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తోందని నిర్ధారించిన అధికారులు, దల్ఖానియా రేంజ్ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ ప్రభావం అధికంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
పలు సింహాలు అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించామని, వాటిని రెస్క్యూ కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.

మరణించిన సింహాల కళేబరాల్లో తమకు కనిపించిన వైరస్ ఏంటన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. మిగతా సింహాలకు వైరస్ సోకకుండా యూఎస్ నుంచి వాక్సిన్‌ను తెప్పిస్తున్నామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. 2015 లెక్కల ప్రకారం గిర్ అడవుల్లో 520 సింహాలు ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి పెను ప్ర‌మాదాలు వ‌స్తే వాటి ఉనికికి దెబ్బ త‌గులుతుంది అని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు సిబ్బంది. ఇక ఈ విషపురుగుల వ‌ల్ల వాటి శ‌రీరంలోకి ఓ ర‌క‌మైనవైర‌స్ వెళ్లింది అని వాటి వ‌ల్ల అవి కోలుకోలేని విధంగా దెబ్బ‌తిన్నాయి అని చెబుతున్నారు అధికారులు. వీటి వ‌ల్లే వాటి శ‌రీరం బ‌రువు కోల్పోయి తిరిగి సాధార‌ణ స్దితికి రాలేక‌పోయాయి అని చెబుతున్నారు వైద్యులు, ఇక ఇలాంటి వైర‌స్ కూడా కొన్ని సింహాల్లో గుర్తించామ‌ని వాటికి కూడా స్పెష‌ల్ ట్రీట్మెంట్ అందిస్తున్నామ‌ని మ‌రో సింహాం కూడాచ‌నిపోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు, మ‌రి చూశారుగా అడ‌వుల్లో ఉండే రారాజుల‌కు ఎటువంటి క‌ష్టం వ‌చ్చిందో. దీనిపై ప్ర‌భుత్వం కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని చెప్పింది. ఇక జంతుప్రేమికులు కూడా ఈ విషాదంతో క‌న్నీరుమున్నీరు అయ్యారు.