రోజుకి 20 లక్షలు సంపాదిస్తుంది.. ఏం చేస్తుందో చూసి పోలీసులే షాక్!

696

సమాజంలో ఎక్కడ చుసిన మోసాలే కనపడుతున్నాయి.ఎవరు బకరా దొరుకుతాడు ఎలా మోసం చేద్దాం అని ఆలోచించేవాళ్లే ఉన్నారు.చాలా తెలివిగా బురిడీ కొట్టించి అక్రమాలకు పాల్పడుతున్నారు.ఇప్పుడు ఒక మోసం చేసే గ్యాంగ్ దొరికింది.వాళ్ళు చేసిన మోసాల గురించి తెలిస్తే షాక్ అవ్వడం పక్క.అమ్మాయిల మోజు ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళు ఎన్నెన్ని మోసాలకు పాల్పడ్డారో చూద్దామా.

Image result for red light area

పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన దేబాశిష్‌ ముఖర్జీ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన స్నేహితులు, కోల్‌కతాకు చెందిన ఫెయిజుల్‌ హక్‌, సందీప్‌ మిత్రా, హౌరాకు చెందిన అనితా డే, సిలిగురికి చెందిన నీతా శంకర్‌తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. రెండేళ్ల కిందట అమ్మాయిలను సరఫరా చేస్తామంటూ వరల్డ్‌డేటింగ్‌.కామ్‌, గెట్‌యూత్‌లేడీ.కామ్‌, మైలవ్‌18.ఇన్‌ వెబ్‌సైట్లను ప్రారంభించాడు. వాటిలో అందమైన, ఆకర్షణీయమైన అమ్మాయిలు, సెక్సీ ఫొటోలను అప్‌లోడ్‌ చేశాడు. ఇవన్నీ వేర్వేరు గూగుల్‌ సైట్లలోంచి తీసినవే. వాటితోపాటు తాము అందించే సర్వీస్‌ వివరాలను పేర్కొన్నాడు. వెబ్‌సైట్లోనే ఒక ఫామ్‌ ఉంటుంది.

Image result for red light area

కస్టమర్లు తమ వివరాలను అందులో పొందుపరచాలి. అందులోనే ఎటువంటి అమ్మాయి కావాలో ఎంపిక చేసుకోవాలి.వెబ్‌సైట్లో వివరాలు నమోదు కాగానే వారికి ఓ ఫోన్‌ వస్తుంది. అవతలి నుంచి ఓ అమ్మాయి ఆకర్షించే మాటలతో కవ్విస్తుంది. తియ్యటి మాటలతో మాయ చేస్తుంది. కవ్వింపు మాటలతో కస్టమర్లను బుట్టలో వేసుకొని డబ్బులు గుంజే కార్యక్రమం మొదలుపెడతారు. తొలుత రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1080తో మొదలుపెడతారు. తమ వద్ద సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినం సర్వీసులు ఉన్నాయంటారు. అప్పటికే అమ్మాయిల కోసం ఉవ్విళ్లూరుతున్న యువత వాళ్లకు నచ్చిన సర్వీసును ఎంచుకుంటారు. ఇక అక్కడి నుంచి వివిధ సర్వీసుల పేరిట విడతలవారీగా అందినకాడికి దోచుకుంటారు. హై ప్రొఫైల్‌ కస్టమర్లతో ప్రధాన నిందితురాలు అనితా డేనే మాట్లాడుతుంది. సంపన్న వర్గాల కస్టమర్లతో అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతుంది.అప్పటి వరకు వాళ్లు చెప్పినట్లు డబ్బులు చెల్లించిన కస్టమర్లు.. తమ వద్దకు వచ్చే అమ్మాయిని ఊహించుకుంటూ ఊహల్లో విహరిస్తారు.

Image result for red light area

ఎంతకీ అమ్మాయి రాకపోవడంతో అంతకుముందు తనతో మాట్లాడిన అమ్మాయికి ఫోన్‌ చేస్తారు. అది కాస్తా స్విచ్ఛాఫ్‌ చేసి ఉంటుంది.ఇలా యువకులను కవ్వించి, మాటలతో బురిడీ కొట్టించడానికి డార్జిలింగ్‌ జిల్లా సిలిగురిలో 12, కోల్‌కతాలో 8 మొత్తంగా 20 కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటిలో 400 మందిని నియమించారు. కోల్‌కతాలో ఓ ఎరువుల దుకాణం పేరిట లైసెన్స్‌ తీసుకున్నారు. దాని మాటున కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు.మోసపోయానని గ్రహించిన ఒక యువకుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు డీసీపీ జానకీ షర్మిల, ఏసీపీ శ్రీనివాసకుమార్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్సై విజయ్‌వర్థన్‌ రంగంలోకి దిగారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బాధితుడు ఇచ్చిన వెబ్‌సైట్‌, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముఠాగా గుర్తించారు. ఈ అక్రమాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.ఈ కాల్‌ సెంటర్లు ఒక్కో దాని నుంచి రోజుకు సుమారు లక్ష ఆదాయం వస్తోందని, మొత్తంగా నిందితుల ఆదాయం రోజుకు రూ.20 లక్షలని పోలీసులు గుర్తించారు. ఎనిమిది బ్యాంకు ఖాతాల ద్వారా వీరు తమ లావాదేవీలు నడుపుతున్నారు. ఈ రెండేళ్లలో సుమారు రూ.150 కోట్లను వీళ్లు కొల్లగొట్టారని పోలీసులు అంచనా వేస్తున్నారు.చూశారుగా ఈ ముఠా ఎంతటి పెద్ద మోసాలు చేసిందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఇలాంటి వెబ్ సైట్లను నమ్మి మోసపోతున్న యువత గురించి అలాగే ఈ వెబ్ సైట్లను నడుపుతూ 150 కోట్ల రూపాయలను సంపాదించినా ఆ గ్యాంగ్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.