ఇంతకంటే నీచమైన అమ్మాయిలను మీరు చూసి ఉండరు.. 16 కుక్క పిల్లలతో..

569

సమాజంలో కొందరిని చూస్తుంటే ఒళ్ళు మండిపోయేంత కోపం వస్తుంది. వారిని ఏం చేసినా కూడా పాపం అనిపించదు. తాజాగా వెలుగు చూసిన విషయం సభ్య సమాజం తల దించుకునే విధంగా ధారుణంగా ఉంది. మనం పెంచుకునే జంతువులలో కుక్క ముఖ్యమైనది.కుక్కకు చాలా విశ్వాసం ఉంటుంది.మనల్ని మన ఇంటిని జాగ్రత్తగా కాపాడుతుంది.ఎవరైనా శత్రువులు వస్తే వారిని ఒక ఆటాడుకుంటుంది.అంతేనా కుక్క పోలీసులకు కూడా పలురకాలుగా ఉపయోగపడుతుంది. వాసన చూసి నేరస్థులను పట్టిస్తుంది.ఇన్ని రకాలుగా కుక్క వలన మనకు ఉపయోగాలు ఉన్నాయి.అలాంటి కుక్కను ఎవరైనా చంపాలనుకుంటారా చెప్పండి. లేదు కదా. కానీ ఇద్దరు అమ్మాయిలు ఏకంగా 16 కుక్కలను చంపారు. మరి ఆ దారుణ ఘటన గురించి తెలుసుకుందామా.

Image result for 16 కుక్క పిల్లలతో

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇటీవల ప్లాస్టిక్ సంచుల్లో చనిపోయిన 16 కుక్క పిల్లలు లభించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే, ఈ అమానవీయ చర్యకు ఎవరు పాల్పడ్డారనేది తెలియరాలేదు. ఈ ఘటన వెలుగు చూసిన ఒక రోజు తర్వాత.. ఇద్దరు మహిళలు కుక్క పిల్లలను కర్రలతో కొట్టి చంపుతున్న వీడియో బయటకు వచ్చింది. కోల్‌కతాలోని ఎన్.ఆర్.ఎస్. మెడికల్ కాలేజ్, ఆస్పత్రి సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆ కుక్క పిల్లలను చంపింది వారేననే అనుమానాలు నెలకొన్నాయి. పైగా, ఈ వీడియోలో ఉన్న ప్రాంతం, కుక్క పిల్లలు దొరికిన ప్రాంతం ఒకటే కావడం గమనార్హం. ఇద్దరు మహిళలు కర్రలతో కుక్కలను దారుణంగా కొడుతుండగా ఆసుపత్రి సమీపంలోని లేడీస్ హాస్టల్ విద్యార్థులు ఈ వీడియో తీశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వీడియో తీస్తున్న యువతి ‘‘అక్కా.. వాటిని చంపొద్దు’’ అని చెప్పడం వినిపించింది. ఇందుకు వారు సమాధానం ఇస్తూ.. ‘‘రాత్రి వేళల్లో మేము నడుచుకు వస్తున్నప్పుడు అవి కరిస్తే ఏం చేస్తావు? అంత బాధగా ఉంటే నువ్వే వాటిని తీసుకెళ్లు’’ అని చెప్పడం వినిపించింది. నిందితులు ఇద్దరూ నర్శింగ్ విద్యార్థులని తెలిసింది. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి చీఫ్ జ్యుడిషియల్ కోర్టుకు తరలించారు. ఆ కుక్క పిల్లలను చంపినట్లుగా వీడియో సాక్ష్యం ఉండటం తో వారు తప్పించుకోలేక పోయారు. ఇలాంటి నీచానికి పాల్పడ్డ వీరికి ఎలాంటి శిక్ష పడుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే, కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.16 కుక్క పిల్లలను చంపిన వీరిని సమాజం నుండి బహిస్కరించాలంటు సోషల్ మీడియాలో జనాలు డిమాండ్ చేస్తున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. 16 కుక్కలను చంపినా ఈ ఇద్దరు అమ్మాయిల గురించి అలాగే ఇలా మూగ జీవాలను హింసించే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.