6నెలల్లో 150 కోట్లు సంపాదించిన తెలంగాణ టీచర్.. ఎలానో తెలిసి పోలీసులే షాక్

524

విద్యార్థులకు చదువు చెప్పి వారిని ఒక దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పారు. సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న ఉపాధ్యాయ వృత్తికి మచ్చగా మారారు. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తున్న మన దేశంలో వారు చేస్తున్న దారుణాల వలన టీచర్ అనే వాళ్ళకే మాయానిమచ్చగా మారుతున్నారు.ఇప్పుడు ఒక టీచర్ చెడు బాటపట్టాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని భారీ ప్లాన్ వేశాడు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 14 వేల మంది ప్రజల నుంచి 150 కోట్ల రూపాయలు వసూలు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.మరి ఈ టీచర్ అంతలా ఎలా కొల్లగొట్టాడో తెలుసుకుందామా.

ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు మెతుకు రవీందర్, తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా రేవల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడు. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఇతగాడు వచ్చే జీతం డబ్బులు సరిపోక భారీ స్కాంకు తెరలేపాడు. ప్లాన్ ప్రకారం ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి కంపెనీలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అందుకు డబ్బుకోసం స్థానికంగా ఉన్న ప్రజలకు భారీ వడ్డీ ఆశతో నమ్మించాడు. అందుకు అనేక మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్క ప్రాంతాల్లో హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి అతని స్కీం ను వివరించాడు. అంతే అతని మాటలు నమ్మిన అనేక మంది లక్షల రూపాయలు అతనికి అప్పగించారు.వచ్చే డబ్బులకు హామీ పత్రాలు ఇవ్వడంతో పాటు లక్షకు నెలకు ఆరు వేల రూపాయల వడ్డీని 25 నెలల పాటు ఇస్తానని, ఆ తరువాత లక్ష రూపాయలు కూడా తిరిగి ఇస్తానని నమ్మించాడు. ఈ స్కీంను నమ్మిన 14 వేల మంది 150 కోట్ల రూపాయలను అతనికి అప్పగించారు. అయితే ముందు డబ్బులు ఇచ్చిన వారికి వడ్డీ సరిగా చెల్లించకపోవడంతో ఓ వ్యక్తి శామిర్ పేట్ పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ కేసుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మెతుకు రవీందర్ ఈ స్కీంలో ఎక్కడా చిక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. అతని పేరు ఎక్కడా లేకుండా జాగ్రత్త పడ్డ ఆయన అతని కుటుంబ సభ్యులు, బావలు, బామ్మార్దులు, ఇతర చుట్టాలను డైరక్టర్లుగా పెట్టి వ్యవహారం నడిపించాడని పోలీసులు గుర్తించారు. వచ్చిన డబ్బును శ్రీ చక్ర వెంచర్స్‌కు దారిమల్లించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీ చక్ర కంపెనీ సిబ్బందిని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. రవీందర్‌కు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లలో 14 కోట్ల రూపాయల ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు.ఈ విషయంపై ఎవరైనా పోలీసులకు పిర్యాదు చేస్తే వారికి డబ్బులు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకోవడం, మరికొంత మందిని ఏజెంట్ల ద్వారా బెదిరించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఏదేమైనా ఇలాంటి మోసపూరిత స్కీం లను నమ్మి ప్రజలు మోసాలకు గురికావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్కీంలు ఎక్కడ జరుగుతున్నా స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.కాబట్టి చిట్టీల పేరుతో డబ్బులు దాచేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. కోట్లు కొల్లగొట్టిన ఈ టీచర్ గురించి అలాగే ఇలా చీటీల పేరుతో మోసం చేసే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.