14 రోజుల తర్వాత విక్రమ్ పనిచేస్తుంది ఇస్రో చైర్మన్ సంచలన ప్రకటన

559

చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి మెట్టుపై ఆగిపోయిన విషయం తెలిసిందే. ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్ విక్రమ్ చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా సాంకేతిక లోపం తలెత్తి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ చెందారు. అయితే, ఈ సమయంలో యావత్తు భారతావని వారికి అండగా నిలిచింది. వారు సాధించిన విజయం తక్కువేం కాదని, భవిష్యత్తులో మంచి విజయాలను అందుకుంటారని భరోసా ఇచ్చింది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను దగ్గరకు తీసుకుని ఓదార్చిన తీరుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Image result for 14 రోజుల తర్వాత విక్రమ్ పనిచేస్తుంది ఇస్రో చైర్మన్

ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ మాట్లాడుతూ.. విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ కనుగొనే విషయంలో తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, వాటిని ఆపేయలేదని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. ల్యాండర్‌తో తిరిగి అనుసంధానం కోసం 14 రోజుల పాటు ప్రయత్నాలు చేస్తామని ఆయన వివరించారు. చంద్రయాన్-2 యాత్ర చివర్లో నిర్వహించిన ‘పవర్‌ డిసెంట్‌’ అంచెలో నాలుగు దశలు ఉన్నాయని, మొదటి మూడు అద్భుతంగా సాగాయన్నారు. చివరిది మాత్రం సాఫీగా జరగకపోవడం వల్లే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయని శివన్ వివరించారు.

Image result for 14 రోజుల తర్వాత విక్రమ్ పనిచేస్తుంది ఇస్రో చైర్మన్

అంతేకాదు 2022లో చేపట్టబోయే తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ సహా మిగతా ఏ ప్రయోగంపైనా దీని ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. ల్యాండర్‌, రోవర్‌లను సాంకేతిక సామర్ధ్యాన్ని ప్రదర్శించేందుకు మాత్రమే ప్రయోగించినట్లు ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. ఆర్బిటర్‌లోని డ్యూయెల్‌ బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడర్‌ (సార్‌)కు చంద్రుడి ఉపరితలానికి దిగువన 10 కిలోమీటర్ల లోతులోని అంశాలనూ పరిశోధించే సామర్థ్యం ఉందని తెలిపారు. దాని సాయంతో చంద్రుడి ఉపరితలం కింద ఘనమంచు రూపంలో ఉన్న నీటి వనరులను గుర్తించవచ్చని తెలియజేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఆర్బిటర్‌లోని హై రిజల్యూషన్‌ కెమెరాకు 30 సెంటీమీటర్ల వరకూ జూమ్‌ అయ్యే సామర్థ్యం ఉందని, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదని ఆయన వివరించారు. ఆర్బిటర్ జీవితకాలం ఏడాది కాలం ఉండేలా రూపొందించినా ఆ వ్యోమనౌకలోని ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌ కూడా శక్తిమంతమైందని, దీనిలో ఇంధనం పుష్కలంగా ఉండటం వల్ల అది ఏడున్నరేళ్ల పాటు పనిచేయగలదని చెప్పారు. దీంతో అందరికి ఆశలు మళ్లీ చిగురించాయి.. సైంటిస్టులు కాస్త నిరాసని వదిలి ముందుకు సాగాలి అని అందరూ కోరుతున్నారు, మనం చాలా కష్టపడ్డాం ఆ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అని చెబుతున్నారు సెలబ్రెటీలు. కచ్చితంగా 14 రోజుల ప్రయత్నాల తర్వాత అది పనిచేస్తుంది అనే నమ్మకం ఉంది అని చెబుతున్నారు శాస్ర్తవేత్తలు. మనం కూడా మన దేశం అన్ని దేశాల మధ్య గర్వంగా నిలవాలి అని కోరుకుందాం, అంతరిక్ష చరిత్రలో భారత్ మువ్వెన్నల జెండా ఎగురవేయాలి అని మనసారా కోరుకుందాం.