13 ఏళ్ల కుర్రాడు వంద‌కోట్ల వ్యాపారం పెట్టాడు పెద్ద పెద్ద కంపెనీలు అత‌న్ని చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నాయి

712

మ‌నకు ఏదైనా క‌సి, ప‌ట్టుద‌ల, శ్ర‌మ, ఉంటే ఏదైనా సాధించ‌వ‌చ్చు అనేది మ‌న‌కు చెప్పే ఓ పాఠం…. కాని అన్ని అంశాలు దీనికి క‌లిసి రావాలి కూడా.. ముఖ్యంగా చిన్న‌త‌నం నుంచే క‌ష్ట‌ప‌డే త‌త్వం అలవాటుచేస్తే, పెద్ద అయిన త‌ర్వాత కూడా స్వ‌త‌హాగా వారి ప‌నులు వారు చేసుకుంటారు.. అలాగే మంచి మ‌నిషిగా సొసైటీలో గుర్తింపు పొందుతారు.. ఇక కొంద‌రికి వార‌స‌త్వంగా ఆస్తులు ఎలా వ‌స్తాయో, త‌ల్లి దండ్రుల నుంచి తెలివితేట‌లు వారి అల‌వాట్లు కూడా వ‌స్తాయి. వారు త‌మ పేరెంట్స్ లా బిజినెస్ లేదా, మంచి ఉద్యోగంలో స్దిర‌ప‌డాలి అని కోరుకుంటారు.

అయితే ఇప్పుడు13 ఏళ్ల కుర్రాడు గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి.. ఇంకా చ‌దువుకోవ‌ల‌సిన ఆ కుర్రాడు ఓ అద్బుతం సృష్టించాడు.. ఓసారి అత‌ను చేసిన అద్బుత‌మైన చర్య ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… తిల‌క్ మెహాతా వ‌య‌సు 13 ఏళ్లు, అత‌న్ని చూడగానే బిజినెస్ మ్యాన్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి అంటారు.. ఇంత‌కీ తిల‌క్ కు ఉన్నా తెలివితేట‌ల‌కు అబ్బుర‌ప‌డిపోయిన ఓ బ్యాంకు ఉద్యోగి, త‌న బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి తిల‌క్ పెట్టిన కంపెనీలో సీఈవోగా చేరిపోయాడు.. అవును 13 ఏళ్ల‌కే తిల‌క్ ఓ కంపెనీ స్ధాపించాడు..

ఇప్పుడు ఈ కంపెనీ వంద కోట్ల ట‌ర్నోవ‌ర్ ల‌క్ష్యాన్ని పెట్టుకుంది… ఈ కంపెనీ చిన్న చిన్న పార్సిల్స్ ని డెలివ‌రీ చేస్తుంది.. ముఖ్యంగా ఈ స్టార్ట‌ప్ కంపెనీ చిన్న చిన్న పార్సిల్స్ ని నిర్ధిష్ట‌మైన ప్రాంతంలో డెలివ‌రీ చేయ‌డ‌మే ప‌నిగా ప్రారంభం అయింది… ఈ కంపెనీ పేరు పేప‌ర్స్ అండ్ పార్శిల్స్.. ఈ కంపెనీ ప్రారంభించ‌డానికి రీజ‌న్ కూడా చెప్పాడు తిల‌క్.. త‌న‌కు ఓరోజు మా నాన్న పుస్త‌కాల పార్సిల్ డెలివ‌రీ తీసుకురావాలి.. కాని ఆయ‌న‌కు ప‌ని ఉండి ఆరోజు డెలివ‌రీ మిస్ చేసుకున్నాం.

ఇలాంటి స‌మ‌స్య రాకూడ‌దు అని తాను ఈ కొత్త వ్యాపారానికి నాంధి ప‌లికాను అని చెపుతున్నాడు తిలక్…. అయితే పెద్ద పెద్ద పార్శిల్స్ బిజినెస్ లో ఉన్న కంపెనీలు, చిన్న చిన్న పార్శిల్స్ ని అశ్ర‌ద్ద చేస్తుంటారు… అందుకే ఈ స్టార్ట‌ప్ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఈ కంపెనీ విలువ కూడా మార్కెట్లో పెరుగుతోంది. ఇక ఈ పార్శిల్స్ ఇవ్వ‌డానికి డ‌బ్బావాలాల సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నాడు తిలక్ .. చూశారుగా అతి చిన్న వ‌య‌సులోనే ఎటువంటి వ్యాపార మెల‌కువ‌లు ఈ అబ్బాయి నేర్చుకున్నాడో… ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.