దేశ రాజధాని లో మరో ఘోరం స్కూల్ టాయిలెట్ లో ప్రసవించిన పదో తరగతి స్టూడెంట్

502

మాన‌వ‌త్వం మ‌రిచిన కొంద‌రు మూర్ఖులు అమ్మాయి క‌నిపిస్తే వ‌ద‌ల‌ని క‌సాయిలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు.. ఇంకా ఒంట‌రిగా మ‌హిళ‌లు వెళ్లాలి అంటే చాలా ఇబ్బందులు మ‌న దేశంలో ఉన్నాయి, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంది అనే చెప్పాలి… దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో ఘోరం జరిగింది. పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై, ఇంటి పక్కనే ఉండే 51 ఏళ్ల వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేయగా, గర్భం దాల్చిన బాలిక, స్కూలు మరుగుదొడ్డిలో మృత శిశువును ప్రసవించింది. ముఖర్జీ నగర్ లో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, బాలికకు డబ్బు ఆశ చూపిన ఆ ప్రబుద్ధుడు లొంగదీసుకున్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించే ప్రయత్నం చేశాడు. అది విఫలం కాగా, పాఠశాలకు పరీక్షల నిమిత్తం వచ్చిన బాలిక, తీవ్రమైన కడుపునొప్పితో బాత్ రూముకు వెళ్లి, అక్కడే ప్రసవించింది. తమ కుమార్తె గర్భవతన్న సంగతి బాధితురాలి తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న పాఠశాల అధికారులు, ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదుపై నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, నిర్భయ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఇక అత‌ను ఆమెకు డ‌బ్బులు ఇచ్చి లొంగ‌దీసుకున్నాడు అని ఆమె విచార‌ణ‌లో తెలియ‌చేసింది… అంతేకాదు ఆమెని అనేక ర‌కాలుగా ఇబ్బందులు పెట్టాడు అని, క‌డుపు నొప్పిగా ఉంది అన్న స‌మ‌యంలో ఆమెకు ప్రెగ్నెన్సీ రాకుండా ట్యాబ్లెట్స్ వేసేవాడు అని తెలియ‌చేసింది… ఇలాంటి వ్య‌క్తిని వ‌ద‌ల‌కూడ‌దు అని స్ధానికులు ధ‌ర్నాకూడా చేశారు, చూశారుగా ప‌క్క వారిపై అలాగే ఎక్కువ‌గా త‌మ పిల్ల‌ల ద‌గ్గ‌ర ఎవ‌రు సాన్నిహిత్యంగా ఉంటున్నారో, వారి గురించి తెలుసుకోవ‌డం మీ బాధ్య‌త అనేది మ‌రిచిపోకండి.