మాది టెన్త్ క్లాస్ ప్రేమ… అయిష్టంగా భర్తతో కాపురం చేస్తున్నా.. ప్రియుడే ముఖ్యమంటూ సూసైడ్ నోటు

333

ప్రేమ… ఈ పదం ఈ మధ్య బాగా వినిపిస్తుంది.ప్రేమికులు ఈ మధ్యన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.మొన్న మిర్యాలగూడలో జరిగిన ఘటన గానీ ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన ఘటన గానీ ప్రేమికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి బాగానే చెప్పాయి.కులాలు వేరని మతాలు వేరని అంతస్తులు వేరని..ఇలా రకరకాల కారణాలు చెప్పి ప్రేమికులను విడదీస్తున్న వాళ్ళే ఉన్నారు.కొందరు ఆ బాధను తట్టుకుని జీవిస్తుంటే కొందరేమో ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే ఉన్నారు.ఇప్పుడు మరొక ప్రేమ జంట అదే పని చేసింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన సింగతి విష్ణువర్ధన్‌ (26), బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన రాచర్ల మౌనిక (26) పదో తరగతిలోనే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉందామనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమెకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇదంతా ఏడేళ్ల క్రితం నాటిమాట. ఇటీవల భర్తతో విభేదాలు రావడంతో పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే చిన్ననాటి ప్రేమికుడు మళ్లీ కనిపించాడు. మరోసారి ప్రేమ చిగురించింది.మౌనిక, విష్ణువర్ధన్‌ కలిసి శనివారం వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చారు. బద్దిపోచమ్మ వీధిలో ఉన్న ఓప్రైవేట్‌ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నారు. ఒకరోజు కోసం రూమ్‌ తీసుకున్న ఇద్దరు మరుసటిరోజు ఆదివారం అద్దెను పొడగించుకుని ఆ రూమ్‌లోనే గడిపారు. సోమవారం రూం ఖాళీ చేయాలని లాడ్జీ నిర్వాహకులు ఆదేశించారు. మంగళవారం మొక్కులు చెల్లించుకునేది ఉందని చెప్పి మళ్లీ అద్దె పొడగించుకున్నారు.

రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి వచ్చిన వారు, నిన్న ఎంతసేపటికీ గది దాటి బయటకు రాలేదు. దీంతో లాడ్జి నిర్వాహకులు తలుపులు పగులగొట్టి చూడగా, ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, గదిలో తనిఖీ చేయగా, మొత్తం విషయాన్ని బయటపెడుతూ సూసైడ్ నోట్ లభించింది. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.పెళ్ళైన కూడా తమ ప్రేమను చంపుకోలేక ఇప్పుడు ఇలా విగతజీవులుగా మారారు.ఇదేనేమో పిచ్చి ప్రేమ అంటే.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.