10 ఏళ్ల తర్వాత వ్యభిచారిణిగా ఎదురుపడ్డ ప్రియురాలు.. కన్నీరు పెట్టించే ఒక IPS ఆఫీసర్ ప్రేమకథ..

407

ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి ఒక్కరికి ఒక ప్రేమకథ ఉంటుంది. కొన్ని సక్సెస్ అయితే కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎన్నో గొప్ప ప్రేమకథలు గురించి విని ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రేమకథ గురించి మాత్రం విని ఉండరు. ప్రేమించుకుని విడిపోయి 10 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఒక IPS ఆఫీసర్ ప్రేమకథ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.అయితే అతను తన ప్రియురాలిని ఒక బ్రోతలు హౌస్ లో చూశాడు.మరి ఈ జంట అసలు కథ ఏమిటో తెలియాలంటే మనం గతంలోకి వెళ్ళాలి. మరి ఏమైందో తెలుసుకుందామా.

Related image

ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న పట్టణంలో ఉండే ధీరజ్ అనే అబ్బాయి అనిషా అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. అనిషా ఒక అనాధ .ఆమెను తన మేనమామ చిన్నప్పటినుంచి పెంచడం జరిగింది.ఇంటర్ లో వీరి ప్రేమకథ మొదలయ్యింది. ఇద్దరు ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతలా ప్రేమలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన అనిషా మేనమామ కోపంతో రగిలిపోయాడు. అనీషాను కొట్టి బెదిరించి ముంబైకి చెందిన ఫరూక్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి పంపించాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడంతో ధీరజ్ పిచ్చివాడిలా అయ్యాడు. అనిషా గురించే ఆలోచిస్తూ చదువును నిర్లక్ష్యం చేశాడు. ధీరజ్ అలా తయారయ్యాడని తెలిసి అనిషా అతనికి ఒకసారి ఒక ఉత్తరం పంపిస్తుంది. ధీరజ్ నీ విషయంలో నేను తప్పు చేశాను. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడు. కానీ నా గురించి ఆలోచిస్తూ నువ్వు నీ కెరీర్ ను నాశనం చేసుకోవడం నాకు బాధగా ఉంది. నా మీద నీకు ప్రేమ ఉంటె మళ్ళి నువ్వు నీ లైఫ్ ను స్టార్ట్ చెయ్. కెరీర్ లో సక్సెస్ అవ్వు అని ఆ లెటర్ లో రాసి ఉంది. ధీరజ్ కు అనిశా అంటే ప్రేమ కాదు పిచ్చి. తన ప్రేయసి చెప్పేసరికి మళ్ళి కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశాడు.

Image result for indian prostitute

డిగ్రీ కంప్లీట్ చేశాడు. గ్రూప్స్ ను ప్రిపేర్ అయ్యాడు. IPS ఆఫీసర్ అయ్యాడు.జాబ్ తెచ్చుకుని సక్సెస్ అయ్యాడు. అందరి చేత ప్రశంసలు వచ్చాయి. ఇలా 10 ఏళ్ళు గడిచిపోయాయి. అన్నిట్లో సక్సెస్ అయ్యాడు. ఒక్క పెళ్లి విషయంలో తప్పా. అనీషాను గుండెల్లో పెట్టుకుని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. ఉత్తరప్రదేశ్ లో ఒక లాడ్జిలో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో ధీరజ్ బృందం అక్కడ దాడులు చేసింది.ఆ రాకెట్ నుంచి మొత్తం 45 మంది అమ్మాయిలకు ధీరజ్ విముక్తి కలిగించాడు. ఆ స్త్రీలలో ఒక అమ్మాయిని గుర్తుపట్టిన ధీరజ్ గుండె ఆగిపోయినంత పని అయ్యింది.ఆస్త్రీఎవరో కాదు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ గుండెల్లో గుడి కట్టుకున్న అనిషా. దూరం నుంచి ధీరజ్ ను గుర్తుపట్టి తనలో తానే కుమిలికుమిలి ఏడుస్తుంది. ధీరజ్ అనిషా దగ్గరకు వెళ్లి.. నువ్వెంటి ఇక్కడ,నీ భర్త ఎక్కడ, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ధీరజ్ నా పెళ్లి ఒక అబద్దం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పెళ్లి అని చెప్పి నన్ను ఒక వ్యభిచార ముఠాకు అమ్మేశాడు మా మామయ్య. అక్కడి నుంచి నన్ను మూడేళ్లు దుబాయ్ కు తీసుకెళ్లి నరకం చూపించారు. తర్వాత ఇండియాకు వచ్చాకా నీ పరిస్థితి తెలిసింది. నా జీవితం ఎలాగో నాశనం అయ్యింది. నీ జీవితం అయినా మంచిగా ఉండాలని నీకు లెటర్ రాశాను. అప్పటికే నాకు ఈ జీవితం అలవాటైపోయింది.నిన్ను చేరుకునే అదృష్టం నాకు లేదు అందుకే ఈ నరకంలో జీవిస్తున్నా అని అనిషా బోరున ఏడ్చింది.ఈ 10 ఏళ్లలో అనిషా పడ్డ కష్టం గురించి తెలిసి ధీరజ్ గుండె ఆగిపోయినంత పనైంది. వెంటనే ధీరజ్ అనీషాను అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆమెను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ ప్రేమికులకు ఇప్పుడు ఒక పండంటి బిడ్డ. చూశారు కదా ధీరజ్ ప్రేమ ఎంత గొప్పదో. మరి ధీరజ్ అనిషా ప్రేమకథ గురించి అలాగే ఇలాంటి ఎన్నో గొప్ప నిజ జీవిత ప్రేమకథల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.