10 నిమిషాలు కోతి బస్సు నడిపితే ఏం జరుగుతుందో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి

540

మనిషి అనేవాడు కోతీ జాతి నుంచే వచ్చాడని మన అందరికి తెలుసు.కోతులు అంటే మనకు కొంచెం భయంగానే ఉంటుంది.ఎందుకంటే అవి మన మీదికి వచ్చి ఎక్కడ కరుస్తాయో అని.అయితే మనం సాధారణంగా రోడు మీద పోతుంటే కోతులు వచ్చి మన చేతుల్లో ఉన్న బ్యాగ్ లను తీసుకెళ్తు ఉంటాయి. అందులో ఏమైనా తినే ఆహార పదార్థాలు ఉన్నాయేమో అని అవి తీసుకువెళ్తాయి.అయితే కొన్ని కోతులు గమ్మత్తైన పనులు కూడా చేస్తూ ఉంటాయి.అవి కొన్ని సార్లు నవ్వు తెప్పించిన కొన్నిసార్లు మనకు చాలా భయాన్ని కలిగిస్తాయి.ఎంతలా అంటే అవి చేసే పనుల వలన మన ప్రాణాలే పోతాయేమో అన్నంత భయం కలిగిస్తాయి.ఇలాంటి పనే ఒక కోతీ చేసింది.మరి ఆ కోతీ చేసిన పని గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for monkey driving a bus

కోతీ అనేది మనిషిలాగే ఉండి అది అప్పుడప్పుడు చేసే పనులు మనిషి చేసే పనులు లాగే ఉంటాయి.ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూశాం.ఈ మద్యనే స్విట్జర్లాండ్ లోని ఒక రెస్టారెంట్ లో మనుషులకు బదులు కోతులను సర్వెంట్స్ గా ఉపయోగిస్తున్నారని మనం విన్నాం.ఈ మద్య కోతులు బాగా డెవలప్ అయ్యాయి.ఎందుకలా చెప్తున్నా అంటే కోతులు ఏకంగా డ్రైవింగ్ కూడా చేస్తున్నాయి.అది కూడా ఒక RTC బస్సు ను డ్రైవ్ చేస్తుంది.ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.మన ఇండియాలోనే.ఉత్తర ప్రదేశ్ లోని బరేలి అనే ఒక గ్రామంలోని ఒక RTC బస్సు డ్రైవర్ ప్రయాణికులంత దిగిపోయాక బస్సు ను ఒక దగ్గర పార్కింగ్ చేశాడు.

Image result for monkey driving a bus

నిద్ర రావడంతో చివరి సీట్ లోకి వెళ్లి నిద్రపోయాడు.అయితే అతను చేసిన పొరపాటు ఏమిటి అంటే..అతను బస్సు కు కీస్ అలాగే పెట్టేశాడు.కొంతసేపటి తర్వాత బస్సు డ్రైవర్ సీట్ లోకి ఒక కోతీ వచ్చి కూర్చుంది.అది కూర్చోవడమే కాకుండా కీస్ ఉన్నాయి కదా అని బస్సును స్టార్ట్ చేసింది.అయితే బస్సు స్టార్ట్ అవ్వడంతో నిద్రలో ఉన్న ఆ బస్సు డ్రైవర్ కు ఒక్కసారిగా మెలుకువ వచ్చింది.ఎందుకు స్టార్ట్ అయ్యింది ఎవరు స్టార్ట్ చేశారో చూద్దామని ఆ బస్సు డ్రైవర్ ముందుకు వచ్చి చూడగా డ్రైవర్ సీట్ లో ఒక కోతీ కనపడింది.ఆ కోతీ గేర్ కూడా మార్చి బస్సు ను ముందుకు కదిలించింది.ఆ బస్సు డ్రైవర్ ఆ కోతీని ఏమి అనకుండ అల చూస్తూ ఉండిపోయాడు.డ్రైవర్ లేకుండా ముందుకు వెళ్తున్న ఆ బస్సు ను చూసి చుట్టుపక్కల వాళ్ళు అందరు ఆశ్చర్యపోయారు.ఎదురుగ వస్తున్న బస్సు ను చూసి డ్రైవర్ సీట్ లో కోతీని చూసి అది వచ్చి తమను ఎక్కడ గుద్దేస్తదో అనే భయంతో ఎవరికీ ఎక్కడికి వెళ్ళాలి అనిపిస్తే అక్కడికి వెళ్లి దాక్కున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఏమౌతదో అనే భయంతో ఆ బస్సు డ్రైవర్ కొంచెం దైర్యం చేసుకుని ఆ కోతీని డ్రైవర్ సీట్ నుంచి తరిమేశాడు.కోతీని తరిమేయడానికి డ్రైవర్ నానా బాధలు పడ్డాడు.కానీ ఎలాగోలా కష్టపడి చివరికి జనాలకు ఏం కాకుండా కాపాడాడు.విన్నారుగా ఈ కోతీ చేసిన పని గురించి.ఒకవేళ డ్రైవర్ లోపల లేకుండా బయట ఉనింటే జనాల ప్రాణాలు కూడా ఆ కోతీ తీసేసేదేమో కదా.మరి ఈ సంఘటన గురించి మీరేమంటారు.ఈ కోతీ చేసిన ఈ పని గురించి అలాగే కోతులు అప్పుడప్పుడు చేసే విచిత్రమైన పనులు హాస్యాస్పద పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.