ట్రంప్ కారు ప్ర‌తీ పార్టు ఒక ఆయుధ‌మే ఇది కారుకాదు దీని గురించి తెలిస్తే మ‌తిపోవ‌డం ఖాయం

275

ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్ పరంగా అమెరికా ఎంత ముందంజలో వుంటుందో అందరికీ తెలిసిందే. ప్రపంచదేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉంటారు. దీనికి ఆయన ఉపయోగించే కారే మంచి నిదర్శనం. ప్ర‌పంచ దేశాల‌కు భ‌ద్ర‌త అంటే ఏమిటో చెప్పేది అమెరికా అందుకే వారి భ‌ద్ర‌త‌కు ఏ దేశం పేరు పెట్ట‌దు. ఆ సెక్యూరిటీ ఎవ‌రిమీదైనా ఫోక‌స్ పెడితే అది మిస్ అవ్వ‌దు వారి టార్గెట్ కూడా ఎప్పుడూ మిస్ అవ్వ‌దు. ఇక ఇలాంటి అమెరికా దేశానికి అధ్య‌క్షుడు వాడే కారు ఇంకెంత ప్ర‌త్యేక‌మో చెప్ప‌క్క‌ర్లేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సింగపూర్‌లో గ‌తంలో భేటీ అయిన విష‌యంత తెలిసిందే ఈ స‌మ‌యంలో కిమ్ కు నేరుగా ట్రంప్ త‌న కారుని చూపించి అందులో స్పెషాల్టీస్ తెలియ‌చేశారు.భద్రతాదళాలు సమకూర్చే ఈ కారు కదిలే మినీ వైట్ హౌజ్ అంటే అతిశయోక్తి కాదు. ఆఫీస్‌లో డీల్ చేయాల్సిన అఫీషియల్ ఫైల్స్ సహా అమెరికా నలుమూలల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా సకల సౌకర్యాలు అందులోనే వుంటాయి. బాంబు దాడులను సైతం తట్టుకునే ఈ హైటెక్ వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ ద బీస్ట్ గా వ్యవహరిస్తుంది.

శత్రుదుర్బేధ్యమైన అనేక ప్రత్యేకతలు బీస్ట్ సొంతం. బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీతో అత్యంత లావైన మెటీరియల్, గ్లాస్‌తో ఈ కారు రూపొందించబడింది. అమెరికా కేంద్ర నిఘా సంస్థ అయిన సీఐఏ రిక్రూట్ చేసుకున్న సీక్రెట్ ఏజెంట్ మాత్రమే ఈ కారుని నడిపిస్తారు. ఏదైనా ప్రమాదం వల్ల కానీ లేదా దాడి కారణంగా కానీ టైర్లు పేలినప్పటికీ కారుకి ఏమీ కాదు. అధినేత ట్రంప్ వినియోగిస్తున్న కారును క్యాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అనే పేర్లతోనూ పిలుస్తారు. ట్రంప్ సెక్యూర్డ్ కార్ 1.2ఎం క్యాడికాల్ రకానికి చెందినది. తలుపుల మందం 8 అంగుళాలు ఉండడంతో శక్తివంతమైన బాంబులు దాని పక్కనే పేలినా లోపలి వాళ్లకు ఏమీ జరగదు. రసాయ ఆయుధ దాడినీ తట్టుకోగల సామర్ధ్యం దీని సొంతం.

జనరల్ మోటార్స్ సంస్థ బీస్ట్ ను త‌యారు చేస్తుంది. ఇలాంటివి మొత్తం 12 కార్లు అధినేత కోసం ఉంటాయి. వీటి ఖరీదు వంద కోట్ల రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లు ఇవేనని చెబుతారు. ఒక్కో కారు బరువు 8 టన్నులు ఉంటుంది. బోయింగ్-757 విమానానికి ఉండేలాంటి తలుపులు ఉంటాయి. ఇవి జీవ, రసాయన దాడులను సైతం తట్టుకోగలవు. ఐదు అంగుళాల మందం ఉన్న కారు అద్దాలు బుల్లెట్లను ఆపగలవు. కారు కింది భాగం కూడా అత్యంత పటిష్ఠంగా ఉండటంతో.. అడుగు భాగాన బాంబు పేలినా కిందిభాగం గానీ, ఇంధన ట్యాంకు గానీ ఏమాత్రం చెక్కుచెదరవు. డ్రైవర్‌కు పక్కసీటు పక్కనే తలుపు వద్ద అత్యాధునిక ఆయుధాలు, ట్రంప్ గ్రూప్ రక్తం ప్యాకెట్లు సిద్ధంగా ఉంటాయి. అత్యవసరంగా ఆయనకు రక్తం ఎక్కించాల్సి వచ్చినా ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు.

కారు ముందుభాగంలోని బంపర్ల వద్ద టియర్ గ్యాస్ గ్రెనేడ్ లాంచర్లు ఉంటాయి. ఎవరైనా గుంపుగా వచ్చి కారు ఆపినా, వెంటనే కారులోంచే బాష్పవాయు గోళాలు ప్రయోగించవచ్చు. హెడ్‌లైట్ల పక్కనే నైట్ విజన్ కెమెరాలు ఉంటాయి. వెనుక భాగంలో అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంటాయి. ఇక కారు డ్రైవర్‌కు ప్రత్యేకంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు శిక్షణ ఇస్తారు. క్లిష్టపరిస్థితులు తలెత్తినప్పుడు 180 డిగ్రీల జె టర్న్‌తో కారును తప్పించగల సామర్థ్యం కూడా ఉంటుంది. అతడి వద్ద ఉండే డాష్ బోర్డులో కమ్యూనికేషన్ సెంటర్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటాయి. కారులోనే చిన్నపాటి సెల్ టవర్ కూడా ఉంటుంది.అమెరికా అధ్యక్షుడికి భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం నుంచి పయనించే వాహనం వరకు ప్రతి విషయంలో నిఘా ఉంటుంది. అధికారులు అత్యంత కట్టుదిట్టుమైన చర్యలు తీసుకుంటారు.