హిజ్రా అని తెలిసికూడా సహాయం చేసాడు..కొన్ని రోజుల తర్వాత జరిగింది తెలిస్తే షాక్

67

జెనరేషన్ మారుతోంది అందుకే గతంలో ఎవరికి తెలియకుండా ఉన్నా ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ మాత్రం ఎలాంటి భయం లేకుండా మేము ట్రాన్స్ జెండర్స్ అని చెప్పుకుంటున్నారు, మాకు గుర్తింపు ఇవ్వాలి అని కోరుతున్నారు. అంతేకాదు సొసైటీలో డాక్టర్లు లాయర్లుగా ఎందరో గొప్ప స్ధానాలకు కూడా వెళ్లిన వారు ఉన్నారు, జెండర్ సమస్య కాదు ఇక్కడ సమానత్వం ముఖ్యం అనేది వారు చెప్పే మాట, అన్నీరంగాల్లో కూడా మహిళలు పురుషులతో సమానంగా వారు ముందుకు వస్తున్నారు. అంతేకాదు సినిమాల్లో హీరోయిన్లుగా యాంకర్లుగా కూడా చాలా మంది వస్తున్నారు.. కొన్ని చోట్ల వార్తలు చెప్పే న్యూస్ ప్రజంటర్ గా ఉన్నారు. పెద్దపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీల్లో మేనేజర్ లెవల్ ఉద్యోగాలు చేస్తున్నారు.

Image result for hijra

కాని కొన్ని చోట్ల మాత్రం వారు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సమాజంలో చూసే చిన్నచూపు కొందరికి బాధను కలిగిస్తోందనే చెప్పాలి. ఈ సమయంలో ఓ హిజ్రా స్టోరీ తెలుసుకోవాల్సిందే, అంతేకాదు అతను ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత అతనికి సాయం చేసిన వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి.రమేష్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో నివశిస్తున్నాడు, అతనికి చిన్న తనం నుంచి వయసు పెరిగే కొద్ది ఆడవారిగా హర్మోన్ల ప్రభావంతో మారాడు, అయితే తనకు ఇలా ఉండటమే ఇష్టం అని తన ఫ్రెండ్స్ తో చెప్పేవాడు, అంతేకాదు ఈ విషయం ఇంట్లో తెలియడంతో రమేష్ ని ఇంట్లో వారు ఇలా ఉండద్దు అని చెప్పారు. అయినా తాను మారను అన్నాడు , దీంతో అతను రష్మిక అనే పేరు పెట్టుకున్నాడు.

తల్లిదండ్రులు కోపంతో అతనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు, ఇక బయట వారు కూడా చీదరించుకోవడం సమాజం ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ ఊరు నుంచి దూరంగా వెళ్లిపోయాడు రమేష్.. అంతేకాదు ఆరోజు నుంచి తన పేరుని రష్మిక అనే అందరికి చెప్పుకున్నాడు, ఈ సమయంలో రోడ్లపై బస్టాఫ్ రైల్వే స్టేషన్లో పడుకునేది రష్మిక ..ఆమె బాధని గమనించిన భువనేశ్వర్ అనే వ్యక్తి ఆమెని చేరదీశాడు. తనకు జీవితంలో జరిగిన బాధలు అన్నీ చెప్పుకుంది. ఆమె కోద్ది రోజులుగా భోజనం చేయలేదు అని గమనించిన భువనేశ్వర్, ఆమెని ఇంటికి తీసుకువెళ్లి ఆమెకి భోజనం పెట్టాడు. ఆరోజు నుంచి ఆమెని అతనే చూసుకుంటున్నాడు. ఆమె కాళ్లమీద ఆమె నిలబడాలి అనే ఆలోచనతో ఆమెకు టైలరింగ్ నేర్పించాడు. అంతేకాదు తన దగ్గరకు వచ్చిన రష్మిక గురించి ఫేస్ బుక్ లో అందరికి చెప్పేవాడు. ఆమె రోజూ ఎంత డవలప్ అవుతోంది ఇలాంటి అన్ని విషయాలు సోషల్ మీడియాలో పంచుకునేవాడు. అతను నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని, నాకు దేవుడు లాంటి వ్యక్తి అని రష్మిక చెబుతుంది. మరి భువనేశ్వర్ లాంటి వ్యక్తులు మన సమాజంలో చాలా మంది ఉన్నారు ఒకసారి వారందరికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.