స్నేహమేరా జీవితం.. ముస్లింలు బక్రీద్ పండగ రోజు హిందువులుతో కలిసి ఏమి చేసారో తెలిస్తే శాబాష్ అంటారు

48

మతఘర్షణలను, విద్వేషాలను రెచ్చగొట్టే అన్ని మతాల పెద్దలను, రాజకీయ నాయకులను కాసేపు మర్చిపోండి. అసత్యాలను ప్రచారం చేసే ఫేక్ మీడియాను పక్కన పెట్టండి. బక్రీద్ సందర్భంగా మూడు ఊళ్లలో జరిగిందేమిటో తెలుసుకోండి. దేశంలోని జనం మీడియా, సోషల్ మీడియా చూపుతున్న అసహనంగా ఏమీ లేరని అర్థమవుతుంది. మతం పేరుతో కక్షలు, కార్పణ్యాలు కొంతమంది స్వార్థప్రయోజనాల కోసమే తప్పిస్తే.. సామాన్యం జనం సామరస్యంగానే జీవిస్తున్నారని తెలుస్తుంది. హిందువులకు ముస్లింలు, ముస్లింలకు హిందువులు చేదోడువాదోడుగా ఉంటూ లౌకికత్వాన్ని కాపాడుతున్నారని తెలుస్తుంది.

Religious harmony in india 

పరమత సహనానికి అద్దం పట్టే సంఘన ఇది. తమ పొరుగునే గుడి ఉండడంతో ముస్లిం సోదరులుగా ఏకంగా తమకు ముఖ్యమైన బక్రీద్‌ను వాయిదా వేసుకన్నారు. ఈ రోజు బక్రీద్, శ్రావణ సోమవారం కలసి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముజఫర్ పూర్‌లోని గరీబ్ నాథ్ మందిర్ వద్ద కొన్ని ముస్లిం కుటుంబాలు ఉన్నాయి.  శ్రావణ సోమవారం కావడంతో అక్కడ హిందువులు ‘కావడి’ యాత్ర నిర్వహిస్తున్నారు. జంతుబలులుతో వారికి ఇబ్బంది కలిగించకూడదని ముస్లింలు తమ కుర్బానీని రేపటికి వాయిదా వేసుకున్నారు. దీనిపై హిందూ సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Image result for hindu and muslims

కేరళ వరదల్లో ఇళ్లతోపాటు పలు ఆలయాలు, మసీదులు కూడా  నీట మునిగాయి. సుల్తాన్ బాతెరీ వేనాడ్ ప్రాంతంలోని రామాలయం కూడా మునిగిపోయింది. అక్కడ రెండు రోజుల పాటు నీళ్లు నిలిచాయి. వరదలు కాస్త తెరిపి ఇవ్వడంతో జనం తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. గుడిలో బురదను తర్వాత తీద్దాంలే అనుకున్నారు. అయితే ముస్లిం యూగ్ లీగ్ తాము గుడిని శుభ్రం చేస్తామని ముందుకొచ్చింది. ముస్లిం కుర్రాళ్లు ఆదివారం గుడిని మొత్తం శుభ్రం చేశారు. మరోపక్క.. కన్నూర్‌లోని  కేరళలో సంతోష్, కుమార్ అనే ఇద్దరు హిందువులు తోటి ముస్లిం స్నేహితులతో కలసి నీటిలో మునిగి బురదగొట్టుకునిపోయిన కరుమత్తుర్ మసీదును శుభ్రం చేశారు.   

వారణాసికి చెందిన పేద హిందువుల విషాద గాథ ఇది. హోరీలాల్‌ విశ్వకర్మ పక్షవాతం, ఆయన భార్య గుండె జబ్బుతో బాధపడుతున్నారు. వారి కుమార్తె సోని మలేరియాతో ఆదివారం చనిపోయిది. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకోలేని దీనస్థితిలో ఉండిపోయింది కుటుంబం. దీంతో ఇరుగుపొరుగు ముస్లింలు అండగా నిలిచారు. తలా ఓ చెయ్యి వేసి సోని అంత్యక్రియలను దగ్గరుండి హిందూ సంప్రదాయాల ప్రకారం జరిపించారు. ఆమె భౌతికకాయాలన్ని కూడా మోస్తూ, హిందూ దేవుళ్ల పేర్లతను కూడా పఠించారు.