సైనికుల మధ్య ఉంటూ విధులు నిర్వహిస్తున్న ఆత్మ జీతం ప్రమోషన్లు ఇస్తున్న భారత ఆర్మీ

94

ఆత్మ పేరు చెబితే మనం సిల్లీగా తీసిపారేస్తాం, సైన్స్ ఇంత అభివ్రద్ది చెందిన తర్వాత కూడా ఇంకా ఆత్మ దెయ్యాలు అనేవి నమ్ముతారా అంటూ కొట్టిపారేస్తాం, కాని ఆత్మలు ఉన్నాయి అని ఏకంగా ఆర్మీనే చెబుతోంది. ఇది ఒకదేశం కాదు రెండు దేశాలు నమ్మతున్న మాట. అంతేకాదు మాకు కనిపిస్తోందని కొందరు చెబుతుంటే, రాత్రి సమయాల్లో గుర్రం పై ఆత్మ వెళుతొందని ఇంకొందరు చెబుతున్నారు.. ఆర్మీ కూడా దీనిని నమ్ముతోంది. చరిత్రలో మనిషి కలిసిపోయినా అతని చరిష్మా మాత్రం నిలిచే ఉంటుంది అనడానికి ఓ గొప్ప నిదర్శనం, పైగా ఆత్మగా మారి తన దేశానికి సేవ చేస్తున్నఓ జవానుగా చరిత్రలో నిలిచిన వ్యక్తి హర్భజన్ సింగ్.. మరి ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

ఎముకలు కొరికే చలి సైనికులు మైనస్ 20 డిగ్రీలో కూడా రక్షణ చేసే ప్రాంతం కాని అక్కడ సరిహద్దులో ఒక ఆత్మ దాదాపు 50 సంవత్సరాలుగా కాపాల కాస్తుంది….మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం.మీ ఆత్మను మీరు తీసుకెళ్లండి అంటూ చైనా ఆర్మీ గగ్గోలు పెడుతుంది…అంతేకాదు సైనికుని ఆత్మకు మనఆర్మీ జీతం, సెలవులు, ప్రమోషన్లను ఇస్తోంది… . ఒకసైనికుడు1967లో మరణించాడు, చనిపోయిన తర్వాతకూడా అతడు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు…. భారత్ – చైనా సరిహద్దుల్లో ఇప్పటికీ కాపాలాగా ఉన్నాడు…ఆ సైనికుడే హర్భజన్_సింగ్.. ఆ దేశ భక్తుడి ఆత్మ కథ ఇది.

Image result for బాబా హర్భజన్ సింగ్

భారత్ – చైనా సరాహద్దుల్లో కథూవా మార్గంలో ఎతైన పర్వతాలలో సైనికులు కాపాల కాయడం చాలా కష్టమైన పని…. చైనా సైనికులు ఆక్రమణలకు ప్రయత్నిస్తుండడంతో మన సైనికులు రాత్రిపగలు కాపలా కాస్తుంటారు….మన సైనికుల సామర్ధ్యాన్ని ఎవరు శంకించరు కానీ ఈ సైనికుల మధ్యనే కనిపించని ఓ సైనికుడు కూడా విధులు నిర్వహిస్తున్నాడు.. ఇక్కడ భయంకరమైన
మంచులో ఎక్కువ సమయం డ్యూటీ చేయడం వల్ల ఏ జవానుకు కంటి మీద కునుకు రాదు. ఒకవేళ పొరపాటున వస్తే వెంటనే చెంప చెల్లుమనిపిస్తాడు, నిద్ర లేపుతాడు…చైనా సైనికులు ఆక్రమనలకు ప్రయత్నిస్తే గుర్రపు స్వారీ చేస్తూ వచ్చి వెంటనే హెచ్చరిస్తాడు…. ఆయనే మన భారత సైనికుడు బాబాహర్భజన్ సింగ్….

Image result for బాబా హర్భజన్ సింగ్

1965లో ఆర్మీలో చేరిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం…పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం గుజర్వాలా.జిల్లా సంద్రాణాలో జన్మించారు, కానీ ఫోస్టింగ్ మాత్రం సిక్కింలో వచ్చింది. భారత్ -చైనా సరిహద్దుల్లో ఉన్ననాథూలాలో విధులు నిర్వర్తిస్తున్నపుడు హర్భజన్ అనుకోకుండా మంచు తుఫాన్ లో చిక్కుకున్నాడు. సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాలనుంచి కాలుజారి లోయలో పడ్డాడు..1967 సెప్టెంబర్ 11న మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలు మాత్రమే. అతన్ని వెతకడానికి సైనికులు చాలా ప్రత్నించారు, కానీ ఎక్కడా అతని జాడ దొరకలేదు. ఒకరోజు రాత్రి తన సహచరుడి కలలో కనిపించాడు, ఆ తర్వాత అద్భుతం జరిగింది. ఎందుకంటే అంతవరకు ఎంత వెతికినా దొరకని అతడి ఆచూకి సహచరుడికి కలలో
కనిపించిన చోటున వెతికారు. ఆశ్చర్యంగా అతడు చెప్పిన చోటునే పార్ధివ దేహం దొరికింది, శవం పక్కనే రైఫిల్ కూడా లభించింది. ఖననం చేసిన తర్వాత అంతా ఆయన గురించి మరచి పోయారు.

Related image

కొన్ని రోజుల తర్వాత మరో సహచరుడి కలలో కనిపించాడు. నా శరీరం కాలి పోయింది కానీ నా ఆత్మ ఎప్పటికి డ్యూటీలోనే ఉంటుందని చెప్పారు. మొదట దాన్ని అందరు లైట్ తీసుకున్నారు.కానీ ఆతర్వాత తోటి సైనికులు అద్భుతం జరగడం చూశారు. ఏదైనా ఆపద రాబోతున్నా, శత్రువులు చొర బాటుకు ప్రయత్నించినా ముందుగానే తన సహచరుల కలలో కనిపించి హెచ్చరించేవాడు. చైనా_ఆపరేషన్ చేపట్టబోయే విషయాన్ని ముందుగానే హర్భజన్ సింగ్ కలలో కనిపించి చెప్పేవారు. ఆయన చెప్పింది తర్వాత అలాగే జరిగేది. ఈవిషయం క్రమంగా అధికారుల చెవిన పడింది, కానీ మొదట వాళ్లు దీన్ని నమ్మలేదు, పరిక్షించి చూసి ఆశ్చర్యపోయారు….

Image result for బాబా హర్భజన్ సింగ్

మీసైనికుడు తెల్లటి దుస్తులు ధరించి గుర్రంపై స్వారీ చేస్తున్నాడని అతన్ని వెనక్కి పిలిపించుకోండి అని చైనా సైనికులు మన ఆర్మీకి చాలా సార్లు చెప్పారట. ఇక చైనా అధికారులు ఈవిషయంలో మన సైనిక అధికారులకు లేఖ కూడా రాశారట. దీని గురించి బాబా హర్భజన్ సింగ్ మన సైనిక అధికారులకు ముందే కళలో కనిపించి చెప్పాడట. దీంతో అధికారులు కూడా హర్భజన్ ఆత్మపై విశ్వాసం ఏర్పడింది. మంచు తుఫానులో సైనికులు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ల మధ్యలో అదృశ్య రూపంలో హర్భజన్ సింగ్ ఉంటాడని భావిస్తారు మన సైనికులు….

ఈ క్రింద వీడియో చూడండి

హర్భజన్ సింగ్ పేరుపై ఒక మందిరం కూడాకట్టించారు మన సైనికులు…నాథూలా మార్గంలో 13వేల అడుగుల ఎత్తులో ఉంది ఈమందిరం. ఇక్కడ బాబా హర్భజన్ సింగే దైవం…ఆయనఫోటో,, యూనిఫాం, షూతో పాటు పరుపు మరన్ని వస్తువులను ఇక్కడే ఉంచి పూజలు నిర్వహిస్తారు….ఆమందిరం ఆలనా పాలనా ఆర్మీనే చూస్తొంది….ఉదయం టిఫిన్ నుంచి రాత్రి బోజన వరకు ఈమందిరంలో హర్భజన్ సింగ్ కు పెడతారు. చీకటి పడినవెంటనే మందిరం తలుపులు మూసివేస్తారు. ఎందుకంటే బాబా రాత్రివేళ డ్యూటి పై వెళతారు అనేది
వారి విశ్వాసం , బాబా హర్భజన్ సింగ్ డ్యూటిలో ఉన్న సైనికుడిగా భావిస్తారు. అందుకే ఒక సైనికుడికి వర్తించే నియమాలన్నీంటిని హర్భజన్ సింగ్ కు వర్తింప జేస్తారు.వేతనం నుంచి సెలవులు, ప్రమోషన్ల వరకు ఆయనకు వర్తింప జేస్తారు, అదికూడా మరణాంతరం వర్తించడమే ఇక్కడ విశేషం.

Image result for బాబా హర్భజన్ సింగ్

బాబా హర్భజన్ సింగ్ సరిహద్దుల్లో గుర్రంపై స్వారీ చేస్తూ మనదేశాన్ని కాపాడుతున్నాడు అనేది సైనికులతో పాటు ప్రజల విశ్వాసం. అందుకే భారత్-చైనా సరిహద్దుల్లో జరిగే ప్రతి సమావేశానికి ఆయన్ను కూడా భాగస్వామిని చేస్తారు మన సైనిక అధికారులు. ఆయన గౌరవార్ధం ఒక ఖాళీ కూర్చీలో ఫోటో పెడతారు, ఇలా చేయడం అనేది సైనికుల మూఢనమ్మకం కాదు, నియమాలను పాటించడం అంటారు అధికారులు. హర్భజన్ సింగ్..బాబా కష్ట కాలంలో ఆదుకుంటారన్నది సైనికుల నమ్మకం. అది క్రమంగా జనాల్లోకి వెళ్లింది. దీంతో సామాన్య జనంకూడా ఆయన దర్శనానికి బారులు తీరుతున్నారు. సందర్శకుల సంఖ్య పెరగడంతో మందిరాన్ని మరింతగా విస్తరించి అద్భుతమైన మందిరాన్ని నిర్మించింది ఆర్మీ.

Image result for బాబా హర్భజన్ సింగ్

ఈమందిరాన్ని సందర్శించే వారు లోపల నోట్ పుస్తకాన్నిఉంచుతారు, అందులో సందర్శకులు తమ కోర్కెలను,రాస్తారు, బాబా హర్భజన్ సింగ్ డ్యూటి నుంచి తిరిగి వచ్చి రాసి ఉన్న కొర్కెలను చదువుతారని తర్వాత,వాటిని తీరుస్తాడని వారి నమ్మకం. ఇక్కడ ప్రజలు,నీటి బాటిల్స్ ని కూడా సమర్పిస్తారు, ఎవరికైనా అనారో గ్యంగా ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా మూడు,రోజుల తర్వాత ఆబాటిల్స్ ని తీసుకుని వెళతారు.,అందులోని నీటిని 21 రోజుల పాటు కొంచెం కొంచెం త్రాగితే సమస్యలన్నీ మటుమాయం అవుతాయనేది ప్రజల నమ్మకం,ఇంకా సైనికులకు ఈమందిరం శక్తి స్వరూపంతో సమానం.కొత్తగా ఆర్మీలో చేరిన జవాన్లు ఈమందిరానికి వచ్చి నమస్కరించి విధుల్లో చేరడం ఆనవాయితీ. హర్భజన్ సింగ్ కు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ.

Image result for బాబా హర్భజన్ సింగ్

సెప్టెంబర్ నెలలో రెండు నెలల సెలవులపై తన సొంతూరు పుంకా గావులోని తన ఇంటికి వచ్చేవారు.అప్పుడు ఊరు ఊరంత ఆయనకు స్వాగతం పలకడానికి రైల్వే స్టేషన్ కు తరలి వచ్చేవారు సైనికులుకూడా అక్కడికి వచ్చి ఘనస్వాగతం పలికే వారు, ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు…. ఎటా సెప్టెంబర్ 15 న రైల్లో సీటును రిజర్వు చేస్తారు దానిపై హర్భజన్ ఫోటో, వస్తువులు ఉంచుతారు.
సొంత గ్రామానికి రైలు రాగానే జవాన్లు, జనం ఆయన ఫోటోకి స్వాగతం పలుకుతారు. చనిపోయి కూడా ఆత్మ విధులు నిర్వర్తిస్తుందని భావించి హర్భజన్ సింగ్ కు ఇచ్చే అత్యంత అరుదైన గౌరవం ఇదే.. చూశారుగా హర్భజన్ సింగ్ స్టోరీ, మరి ప్రపంచంలో ఏ జవానుకు రాని పేరు ఆయనకు వచ్చింది, ఈ వీడియోపై అలాగే ఆయన పై ఉన్న విశ్వాసం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల రూపంలో తెలియచేయండి.