సెప్టెంబరు 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ తప్పక తెలుసుకోండి

85

రోడ్డుపై ఇప్పటి వరకూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారా ? లేదా? అసలు మీ బండిపై ఎంత చలాన్లు ఉన్నాయి అనేది చూసుకుంటున్నారా, మీ ఇంటికి నేరుగా పోస్టల్ లో ఆ చలాన్లు కూడా వస్తాయి. ఒకవేళ మీరు డబ్బులు కట్టకపోతే బైక్ పోలీసులు తీసుకువెళతారు. అయితే ఇన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా చాలా మంది ఇంకా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. తాజాగా రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రస్తుతం వసూలుచేస్తున్న జరిమానాను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు సెప్టెంబరు 1 నుంచి అమలులోకి రానున్నాయి.. మోటారు వాహన నిబంధనల సవరణ చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. దీంతో రవాణా నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. వీటిని దశలవారీగా అమలు చేయాలని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ, రహదారి భద్రతా నిధి, ప్రైవేటు క్యాబ్‌ వ్యవస్థల స్థిరీకరణ, రవాణా వ్యవస్థలో సంస్కరణలు తదితర అంశాలను దశలవారీగా అమలులోకి తీసుకురానున్నారు.

Image result for traffic police

ఓవర్‌ లోడ్‌‌తో నడిచే సరకు రవాణా వాహనాలు, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వాహనాలకు భారీగా ఫైన్ పడనుంది. సరకు రవాణా వాహనాలు అధిక బరువుతో పట్టుపడితే ప్రస్తుతం రూ.2 వేలు ఫైన్ విధిస్తుండగా, అదనపు బరువు కింద టన్నుకు రూ.1,000 అదనంగా వసూలు చేసేవారు. తాజాగా ఆ మొత్తాన్ని రూ.20,000 పెంచారు. అలాగే అదనపు బరువు కింద ప్రతి టన్నుకు రూ.2,000 నిర్ణయించారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుంటే ఫైన్ కింద ఒక్కొక్కరికి రూ.1,000 వసూలు చేయనున్నారు. బైక్‌పై అధిక బరువును వినియోగిస్తే రూ.2 వేలు ఫైన్‌తోపాటు 3 నెలలపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తారు. గతంలో రూ.100 జరిమానా విధించేవారు.

Related image

అలాగే హెల్మెట్ ధరించకపోతే ప్రస్తుతం రూ.100 జరిమానా విధిస్తుండగా, దీనిని రూ.1,000 పెంచడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలలు రద్దువుతుంది. మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.2,000 నుంచి రూ.10,000కు, సీటుబెల్టు పెట్టుకోకపోతే రూ.1,000, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5,000, లైసెన్స్ రద్దుచేసినా వాహనం నడిపి పట్టుబడితే రూ.10,000, వేగంగా నడిపితే రూ.1,000 నుంచి రూ.2,000, ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10,000 ఫైన్ పడనుంది.

ఈ క్రింద వీడియో చూడండి

కేంద్ర న్యాయ శాఖ నుంచి ఆమోదం లభించిందని, ఈ అంశాలపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కొత్త నిబంధనలను సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 63 విభాగాలకు కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపిందని అన్నారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే సిద్ధం చేశామని అన్నారు. మోటార్ వాహనాల సవరణ చట్టం 2019 వల్ల దేశంలో భద్రత, అవినీతిరహిత రోడ్డు రవాణ వ్యవస్థకు వీలు కలుగుతుందని గడ్కరీ తెలియచేశారు. అలాగే రోడ్డు ప్రమాదాలు నివారణతోపాటు బాధితుల సంఖ్య కూడా తగ్గుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు, సమర్థవంతమైన బహుళ రవాణా వ్యవస్థకు సహకరిస్తుందని గడ్కరీ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించిన 786 ప్రమాద ప్రాంతాల్లో రూ.12,000 కోట్లతో నివారణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. చూశారుగా కొత్త ఫైన్లు ఎంత దారుణంగా ఉన్నాయో, ఇవన్నీ మన కోసమే అనేది గుర్తించండి మరి ఇకనైనా జాగ్రత్తలు పాటించండి.