వాహ‌నం న‌డుపుతున్న తండ్రికి హార్ట్ ఎటాక్‌.. స్టీరింగ్‌తో వాహ‌నాన్ని కంట్రోల్ చేసిన బాలుడు..!

124

మ‌నిషి జీవితం అంటే అంతే.. మనం ఎప్ప‌టి వ‌ర‌కు జీవించి ఉంటామో మ‌నకు తెలియ‌దు. అస‌లు త‌దుప‌రి క్ష‌ణంలో మ‌న‌కు ఏం జ‌రుగుతుందో కూడా మ‌న‌కు తెలియ‌దు. మ‌న ప్రాణాలనేవి ఎప్పుడు పోతాయో మ‌నం ఊహించ‌డం క‌ష్టం. ఇక మ‌నం ఎంత‌గానో ప్రేమించే వారు ప్రాణాల‌ను కోల్పోతుంటే, ఆ స‌మ‌యంలో మనం ప‌క్క‌నే ఉంటే మ‌న‌కు ఎంత బాధ క‌లుగుతుందో దాన్ని మాటల్లో వ‌ర్ణించ‌లేం. స‌రిగ్గా అలాంటి స్థితే ఓ బాలుడికి ఎదురైంది. త‌న తండ్రి ఓ వైపు ప్రాణాల‌ను కోల్పోతున్నా, ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఉండిపోయాడు. అయిన‌ప్ప‌టికీ మ‌రో ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హరించాడు. దీంతో త‌న సొంత ప్రాణాల‌నే కాదు.. ర‌హ‌దారిపై వెళ్లే వారి ప్రాణాల‌ను కూడా కాపాడాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందో తెలుసుకుందామా.

Image result for bus driver in india

క‌ర్ణాట‌క‌లోని తూమ‌కూరుకు చెందిన శివ‌కుమార్ వృత్తి రీత్యా డ్రైవ‌ర్‌. డ్రైవర్ పని చేస్తూనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 1వ తేదీన ఓ ప‌రిశ్ర‌మ‌లో త‌యారైన ప్రెష‌ర్ కుక్క‌ర్ల‌ను త‌న వాహ‌నంలో ఎక్కించుకుని హులియారు అనే ప్రాంతంలో ఉన్న ఓ షాపుకు డెలివ‌రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో శివ‌కుమార్ త‌న కుమారున్ని కూడా త‌న వాహ‌నంలో ఎక్కించుకుని స‌రుకు డెలివ‌రీ చేసేందుకు వెళ్తున్నాడు. కుటుంబంతో కలిసి వెళ్తునందుకు శివకుమార్ చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే సుమారుగా 97 కిలోమీట‌ర్ల పాటు ప్రయాణించిన అనంత‌రం శివ‌కుమార్‌కు మార్గ‌మ‌ధ్య‌లో స‌డెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. అయితే సడెన్ గా రావడంతో వాహ‌నం న‌డుపుతూనే ప‌క్క‌కు ఒరిగాడు. స్ట్రోక్ గట్టిగా రావడంతో అత‌ను స్పాట్ లోనే చ‌నిపోయాడు. దీంతో ప‌క్క‌నే కూర్చున్న శివ‌కుమార్ కుమారుడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. తన తండ్రి అలా ఒరిగిపోవడం చూసి షాక్ అయ్యాడు. త‌న తండ్రి చ‌నిపోయాడ‌ని అతనికి అర్థం అయ్యింది.

ఈ క్రింద వీడియో చూడండి

కానీ మ‌రో వైపు వాహ‌నం ర‌న్నింగ్‌లో ఉంది. స్టీరింగ్ తండ్రి చేతిలో ఉంది. అది అదుపు త‌ప్పితే ప‌క్క‌నే ఉన్న వాహ‌న‌దారుల‌పైకి దూసుకెళ్లేది. వాళ్ళు చనిపోతారు. ఒకవేళ వాహనం రోడ్డు సైడ్ లో ఉన్న ఏదైనా చెట్టుకు గుద్దితే వాహనంలో ఉన్న వాళ్ళు చనిపోతారు. కానీ చాక‌చ‌క్యంగా అత‌ను స్టీరింగ్ ప‌ట్టుకుని వాహ‌నాన్ని కంట్రోల్ చేశాడు. దాన్ని సేఫ్టీగా ప‌క్క‌కు ఆపాడు. దీంతో అత‌ను చూపిన చొర‌వ‌కు అత‌న్ని అంద‌రూ అభినందించారు. వాహనం ఆపిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు శివకుమార్ శవం వద్ద కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్నవాళ్లందరి చేత కంటతడి పెట్టించింది. ఓవైపు తండ్రి చ‌నిపోయినా మ‌రోవైపు ఇత‌రుల‌కు ప్ర‌మాదం క‌ల‌గ‌కుండా స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించినందుకు గాను ఆ బాలున్ని అంద‌రూ ప్ర‌శంసించారు. ఏది ఏమైనా.. ఇలాంటి స్థితి ఎవ‌రికీ రాకూడ‌దు క‌దా..!మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.