వామ్మో.. రూ.50,000 పైకి వెండి.. బంగారం ధర మాత్రం..

91

బంగారం ఆభరణాల పట్ల భారతీయులకు ఉన్నంత మోజు, ప్రేమ మరెక్కడా కనిపించదు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు.. అనాదిగా వస్తూనే ఉంది. మార్కెట్ లో ఏ కొత్త డిజైన్లు వచ్చినా కొనడానికి రెడీ అవుతారు. నిత్యం ప్ర‌ముఖ న‌గ‌రాల్లో క్వింటాళ్ల‌ కొద్దీ బంగారం వ్యాపారం జ‌రుగుతూ ఉంటుంది. అయితే సామాన్యులు బంగారం కొనేట‌ప్పుడు వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌ల‌ను తెలుసుకోవ‌డం ముఖ్యం. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు కొంచెం స్థిరంగా ఉన్నాయి. అయితే వెండి మాత్రం భారీగా పెరిగింది. మరి ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా.

Image result for gold

వెండి ధర చుక్కలు చూపిస్తోంది. ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. వెండి మంగళవారం ఏకంగా రూ.1,700 పరుగులు పెట్టింది. దీంతో కొనుగోలుదారులకు చుక్కలు కనిపించాయి. వెండి ధర భారీగా పెరిగితే.. పసిడి ధర మాత్రం నిలకడగా కొనసాగింది. కస్టమర్లకు ఇది కొంత ఊరట కలిగించే అంశం. హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధర స్థిరంగా కొనసాగుతోంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40,260 వద్ద నిలకడగానే ఉంది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.36,910 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో పాజిటివ్ ట్రెండ్ ఉన్నా కూడా దేశీయంగా డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,700 పెరుగుదలతో రూ.50,200కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పుంజుకోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదలతో 1,533.35 డాలర్లకు చేరింది. అదే సమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.80 శాతం పెరుగుదలతో 18.49 డాలర్లకు ఎగసింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.38,910కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.37,710కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర భారీగా పెరిగింది. రూ.1,700 పెరుగుదలతో రూ.50,200కు పరుగులు పెట్టింది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల ధర 36,842 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 38,652 ఉంది. విశాఖ ప‌ట్నం 22 క్యారెట్ల ధర 36,827 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 38,657 ఉంది. బెంగళూరు 22 క్యారెట్ల ధర 35,928 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,728 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర 36,877 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 38,657 గా కొనసాగుతున్నాయి.. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. ఇవేనండి ఈరోజు మార్కెట్ లో ఉన్న బంగారం ధరలు. మరి ఈరోజు ఉన్న బంగారం దరల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.