వామ్మో కొత్త ట్రాఫిక్ రూల్స్..! నిబంధనలు ఉల్లంఘించిన టూవీలర్‌కు రూ. 23000 జరిమానా ….!

463

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మోటారు వాహన చట్ట సవరణపై డిల్లి ప్రభుత్వం అప్పుడే కొత్త జరిమానాలను విధించింది. సెప్టెంబర్ ఒకటి నుండి కొత్త వాహన చట్టం అమల్లోకి రావడంతో ఆదివారం ఒక్కరోజే సుమారు 4000మంది వాహానదారులకు కొత్త చట్టం ప్రకారం జరిమానాలు వేసి, చాలన్లను పంపినట్టు డిల్లీ ట్రాఫిక్ అధికారులు తెలిపారు. అయితే కొత్త వాహన సవరణ చట్టం అమలు ,ఆయా రాష్ట్రాల ఇష్టానికి వదిలిపెట్టిన నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్ ,మధ్యప్రదేశ్, రాష్ట్రాలు దీని అమలుకు నిరాకరించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాలు నూతన జరిమానలపై సమీక్ష జరుపుతున్నాయి. రహదారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రమాదాలు, మరణాల నియంత్ర కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటారువాహానాల చట్ట సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఆ సవరణ బిల్లు సెప్టెంబర్ ఒకటి నుండి అమలులోకి వచ్చింది. ఇందుకోసం కేంద్రం నోటిఫికేషన్ కూడ విడుదల చేసింది.ఇందులో భాగంగానే ట్రాఫిక్ నిబంధనలు, వాహానాల చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై భారిగానే జరిమానాలు విధించింది. అయితే ఈ చట్టం అమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మీద అధారపడి ఉంటుంది.

Image result for traffic police

ఇక కేంద్ర తీసుకువచ్చిన చట్టంలో భారీ ఎత్తున జరిమానాలు తీసుకువచ్చింది. ముఖ్యంగా లైసెన్స్ లేకుంటే 50000 , హెల్మెంటే లేకుండా నడిపితే 2000 ,సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనం నడిపితే 1000 రుపాయాల జరిమానా కాగా మద్యం సేవించి పట్టుపడినా, అత్యవసర వాహానాలకు దారి ఇవ్వకున్నా పదివేల రుపాయాల జరిమాన విధించనున్నారు. మరోవైపు అతివేగం తో పట్టుపడిన వాహానాలకు కూడ రూ 2000 జరిమాన విధించనున్నారు. అయితే దీని బారిన ఎవరెవరు పడతారో అని అందరు ఎదురుచూశారు. ఇప్పుడు ఒక బాధితుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

ఈ క్రింద వీడియో చూడండి

సోమవారం ఓ ఢిల్లీ బేస్‌డ్ టూవీలర్ వాహనదారుడికి పలు నిబంధనల క్రింద జరిమానాలు విధించింది. గురుగ్రామ్ జిల్లా కోర్టు ఎదురుగా ఓ స్కూటితో వస్తున్న వ్యక్తిని చెక్ చేసిన పోలీసులు ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ,పోల్యూషన్, డ్రైవింగ్ విత్ ఆవుల్ హెల్మెంట్ తోపాటు ధర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ లేక పోవడం గమనించారు. ఈ నేపథ్యంలోనే పోల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా నడిపినందుకు రూ.10,000 , రిజిస్ట్రేషన్ లేకపోవడంతో రూ.5000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినందుకు రూ.5000, హెల్మెంట్ లేనందుకు రూ.2000 , ధర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేనందుకు రూ.1000 ఇలా మొత్తం అయిదు నిబంధనల క్రింద మొత్తం 23000 రుపాయాలను జరిమానను విధించారు. ఆ మొత్తం చూసి స్కూటీ యజమాని కళ్లు బైర్లుగమ్మాయి. బహుశా ఆ స్కూటీని అమ్మినా అంత మొత్తం రాదేమో. మరి ఈ స్కూటీ వ్యక్తికీ 23000 ఫైన్ విధించడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.