లారీ డ్రైవర్లు లుంగీ ధరిస్తే రూ.2000 జరిమానా

44

వాహనదారులకు ఫైన్లు బెంబెళెత్తిస్తున్నాయి, సిగ్నల్ దాటినా హెల్మెట్ లేకపోయినా 10 వేలు సమర్పించుకుంటున్నారు..కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వ‌చ్చిన కొత్త ట్రాన్స్‌ఫోర్ట్ చ‌ట్టం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌మైన ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న సంగ‌తి తెలిసిందే… కోట్ల రూపాయల చలాన్లు కేవలం వార రోజుల్లో వచ్చాయి. బెంగళూరు నగరంలో ఏకంగా 75 లక్షల రూపాయల చలాన్లు వేశారు, ఇక డిల్లీలో కూడా ఇదే రేజంలో పోలీసులు చలాన్లు వేస్తున్నారు.కేంద్రం నుంచి ఇంకా సరైన సమాచారం రాకపోయినా ఈ చ‌ట్టం అమ‌ల్లో ఉన్న రాష్ట్రాల్లో భారీ ఫైన్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జ‌రిమానాలు విధిస్తుంటారు. అయితే ఉత్తర ప్రదేశ్‌లో లుంగీ ధరించి లారీ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా తప్పదంటోంది. ఈ క్ర‌మంలోనే లారీ డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ వేస్తే రూ.2000 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు.

లారీ డ్రైవర్లు... లుంగీ, బనియన్‌తో డ్రైవింగ్ చేస్తే 2000 రూపాయల జరిమానా ...

ఇకపై ఈ డ్రెస్ కోడ్ పాటించని లారీ డ్రైవర్లకు జరిమానాలు తప్పవని సర్కార్ హెచ్చరించింది. వాణిజ్య వాహనాలు, లారీలు నడిపే డ్రైవర్లు ఫుల్ సైజు ప్యాంటు షర్టు యూనిఫాంతో పాటు షూ తప్పనిసరిగా ధరించాలని కొత్త మోటారు వాహనాల చట్టం నిర్దేశించింది. అలాగే నిబంధనలు ప్ర‌కారం అన్ని పాఠశాల వాహనాల డ్రైవర్లు కూడా ఈ రూల్ పాటించాల్సి ఉంద‌ని తెలిపారు. డ్రెస్ కోడ్ డ్రైవర్లు ఉల్లంఘిస్తే 1989 మోటారు వాహనాల చట్టం ప్రకారం 500 రూపాయల జరిమానం ప్ర‌వేశ‌పెట్టింది. ప్రస్తుత కొత్త చట్టం 2019 ఎంవీ యాక్ట్ ప్రకారం డ్రైవర్లు లుంగీ ధరించి డ్రైవింగ్ చేస్తే రూ. 2000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. కొత్త మోటారువాహనాల చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో వాణిజ్య వాహనాలు నడిపే డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని సర్కారు ఆదేశించింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఒకవేళ రవాణశాఖ అధికారులు ఎక్క‌డైనా చెకింగ్ చేసే స‌మ‌యంలో లారీ డ్రైవ‌ర్లు ఇలా డ్ర‌స్ కోడ్ లేకుండా క‌నిపిస్తే క‌చ్చితంగా వారికి ఫైన్లు త‌ప్ప‌వు.. అంతేకాదు నేష‌న‌ల్ ప‌ర్మిట్ వాహ‌నాలు న‌డిపే స‌మ‌యంలో డ్రైవ‌ర్లు ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతం వెళుతూ ఉంటారు, ఈ స‌మ‌యంలో కూడా క‌చ్చితంగా యూపీ స‌రిహ‌ద్దుల్లోకి వెళ్లేస‌రికి యూనిఫామ్ ధ‌రించాల్సిందే, అయితే కొందరు డ్రైవ‌ర్లు మాత్రం దీనిని పాటించ‌డం క‌ష్టం అని చెబుతున్నారు, కాని రవాణాశాఖ మాత్రం ఈ నిబంధ‌న‌లు మార్చేది లేదు అంటోంది.అంతేకాదు బండిపై ఇద్ద‌రు వెళ్లినా క‌చ్చితంగా ఇద్ద‌రూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అనే రూల్ యూపీలో తీసుకురానున్నారు, ఇకపై బండిమీద ఇద్ద‌రికి హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేస్తున్నారు. దీంతో ర‌వాణాశాఖ మాత్రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని చెబుతోంది, కేవ‌లం ఖ‌జానా నింప‌డానికి చేస్తున్న ప‌నికాదు అని, ప్ర‌జల ప్రాణాలు కాపాడేందుకు అలాగే ప్ర‌మాదాలు నివారించేందుకు తీసుకున్న నిర్ణ‌యం అని అంటున్నారు. మ‌రి యూపీలో నిర్ణ‌యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.