రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్ వరకు: ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ప్రస్థానం

42

చంద్రయాన్-2… ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్న విషయం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్‌ సమాచార వ్యవస్థలో లోపం తలెత్తడంతో గతి తప్పింది. అప్పటివరకు మిషన్ విజయంపై ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్న సైంటిస్టులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఇక ల్యాండర్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపారు. మోడీ తిరిగి ఢిల్లీకి వెళుతుండగా ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. కంటతడి పెట్టిన శివన్‌ను ప్రధాని మోడీ ఓదార్చారు. ఈ సీన్ అక్కడి వారితో పాటు వీడియోలో వీక్షించిన వారిని సైతం కదిలించింది. ఈ ప్రతిష్టాత్మక మిషన్‌ను ముందుండి నడిపించిన డాక్టర్ శివన్ గురించే ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటోంది. అయితే డాక్టర్ శివన్ ఎవరు.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే విషయాలు చాలా మందికి తెలీదు.. ఈ వీడియోలో ఆయన గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..

 వ్యవసాయం చేస్తూ చదువు సాగించిన ఇస్రో చీఫ్

డాక్టర్ శివన్… ఇస్రో చైర్మన్.. ఎప్పుడు ముఖంపై చిరునవ్వుతో కనిపిస్తాడు. ఇస్రో బాహుబలి మిషన్‌ ను ముందుండి నడిపిన డాక్టర్ శివన్ ఒక సాధారణ రైతు బిడ్డ. తన తండ్రితో పాటు పొలాల్లో వ్యవసాయం చేశారు. చిన్నతనంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తన తండ్రి పొలంలో నాట్లు వేశారు. పంటకు నీరుపోశారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ఉన్న సరక్కల్‌ విలాయ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు కైలాసవడివూ శివన్. ఇక అతని బాల్యంలో చాలా కష్టాలే ఎదుర్కొన్నారు. బడికి వెళ్లాల్సిన వయస్సులో వ్యవసాయం చేశారు. వ్యవసాయం చేస్తూనే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమిళం మీడియంలో ప్రాథమిక ఉన్నత విద్యను పూర్తిచేశారు. అనంతరం నాగర్‌ కోయిల్‌లోని సెయింట్ హిందు కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో మద్రాస్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం 1982లో ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2006లో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ బాంబే నుంచి ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

 కాలేజీ రోజులు వరకు ధోవతినే ధరించేవారు

అతని కుటుంబంలోనే తొలి గ్రాడ్యుయేట్ డాక్టర్ శివన్. శివన్‌కు ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అయితే పేదరికం వెంటాడటంతో వీరెవరూ పెద్దగా చదువకోలేకపోయారు. కాలేజీలో చదువుతుండగానే తన తండ్రికి పొలంలో సహాయపడేవాడినని చెప్తూ ఉంటారు డాక్టర్ శివన్. అందుకే తన ఇంటికి దగ్గరలోని కాలేజీలోనే తనను చేర్పించినట్లు శివన్ గుర్తు చేసుకుంటూ ఉంటారు.. ఎప్పుడైతే బీఎస్సీ మ్యాథ్స్‌లో 100శాతం మార్కులతో పాసయ్యాడో, అప్పుడు తన తండ్రి శివన్‌ను పై చదువులు చదివించాలని డిసైడ్ అయ్యారట. చిన్నతనంలో కాళ్ళకు వేసుకోడానికి చెప్పులు కూడా ఉండేవి కాదు. కాలేజీ రోజుల వరకు ఒక ధోవతితోనే తిరిగిగాడు. మద్రాస్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి అడుగుపెట్టగానే తొలిసారిగా ట్రవజర్ ధరించచాడంట. ఇక 1982లో ఇస్రోలో చేరాడు. అప్పటినుంచి జరిగిన ప్రతి రాకెట్ ప్రోగ్రామ్‌లో భాగస్వామి అయ్యాడు. ఇది తన అదృష్టంగా భావిస్తాడు శివన్. ఇస్రో ఛైర్మెన్‌గా 2018 జనవరిలో శివన్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నారు. అక్కడే రాకెట్ల తయారీ జరుగుతుంది. రాకెట్‌ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే క్రయోజినిక్ ఇంజిన్, పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, లాంచ్‌ వెహికల్‌ను తిరిగి వినియోగించేలా డిజైన్ చేయడంలాంటి వెనక శివన్ హస్తం ఉంది. 2017 ఫిబ్రవరి 15న నింగిలోకి ఒకేసారి దూసుకెళ్లిన 104 ఉపగ్రహాల మిషన్‌లో కీలకంగా వ్యవహరించారు డాక్టర్ శివన్. ఈ ప్రయోగం చేసి ఇస్రో ప్రపంచ రికార్డులకెక్కింది.

ఈ క్రింద వీడియో చూడండి

రాకెట్ మ్యాన్‌గా పిలువబడే డాక్టర్ శివన్‌కు తమిళంలోని పాత పాటలు వినడమంటే చాలా ఇష్టం.. ఈ పాటలు వింటూ తన పొలంలో పనిచేసేవారట. ఇక 1969లో విడుదలైన రాజేష్ ఖన్నా నటించిన సినిమా ఆరాధన శివన్ కు ఎంతో ఇష్టమైన సినిమా. ఇక ప్రకృతిని కూడా చాలా ఇష్టపడుతారు శివన్. తాను విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో తిరువనంతపురంలోని తన ఇంట్లో ఒక గులాబీ తోటను పెంచారు. అందులో అన్ని రకాల గులాబీ మొక్కలు ఉండేవి. బెంగళూరుకు వచ్చాక చాలా బిజీ అయిపోవడంతో వాటిని పెంచేందుకు సమయం దొరకడం లేదని అప్పుడప్పుడు బాధపడుతుంటారు. ఇక శివం తన కెరీర్ లో ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నాడు. 1999 లో శ్రీ హరి ఓం ఆశ్రమం ప్రిరిట్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ రీసెర్చ్ అవార్డు, 2007 లో ఇస్రో మెరిట్ అవార్డు, 2011 లో డాక్టర్ బిరెన్ రాయ్ స్పేస్ సైన్స్ అవార్డు, 2018 లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి బెస్ట్ అల్యూమినాస్ అవార్డు, 2019 లో తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం అవార్డు ఇచ్చి సత్కరించింది.

ఎన్నో ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరించిన శివన్

ఇక ఇప్పుడు ఇస్రో చైర్మన్ గా చంద్రయాన్ 2 కు పనిచేశారు. చంద్రయాన్-2 టేకాఫ్ తొలుత జూలై 15న ప్లాన్ చేయడం జరిగింది. అయితే అనుకోకుండా సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే రంగంలోకి దిగిన డాక్టర్ శివన్ ఆ సమస్యను 24 గంటల్లోనే కనుగొని పరిష్కరించారు. ఆ తర్వాత జూలై 22న తనతో పాటు తన టీమ్ మొత్తం విజయవంతంగా చంద్రయాన్-2ను నింగిలోకి పంపింది. ఈ ఘట్టాన్ని ప్రధాని నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌లో ప్రస్తావిస్తూ డాక్టర్ శివన్‌ను అభినందించారు. కేవలం ఏడురోజుల సమయంలోనే తిరిగి చంద్రయాన్‌-2ను నింగిలోకి పంపారని అభినందించారు. ఎంతో సక్సెస్ ఫుల్ గా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇంకొక రెండు నిమిషాల్లో చంద్రయాన్ 2 సక్సెస్ అవుతుంది అనుకున్న సమయంలో సిగ్నల్స్ ప్రాబులమ్ వలన చంద్రయాన్ 2 విఫలం అయ్యింది. చంద్రయాన్ 2 విఫలం అయినా కానీ డాక్టర్ శివన్ టీమ్ చేసిన కృషిని మాత్రం భారతావని ఎప్పటికి మర్చిపోదు.