రాత్రి ఎపిసోడ్ లో రెచ్చిపోయారు ||

758

బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 68లోను బిగ్ బాస్ కాల్ సెంటర్ కొనసాగింది. ముందుగా ఖడ్గం సినిమాలోని సత్యం పలికే హరిశ్చంద్రులం అనే సాంగ్ ప్లే చేశారు., ఇంటి సభ్యులు అందరు గార్డెన్ ఏరియాలోకి వచ్చి పాటకి స్టెప్పులేశారు. ఆ తర్వాత ఒకరికొకరు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బిగ్ బాస్ కాల్ సెంటర్ టాస్క్‌లో భాగంగా నూతన్ నాయుడు .. రోల్ రైడాకి కాల్ చేసి విసిగించే ప్రయత్నం చేశాడు. రోల్ భాష గురించి నూతన్ అభ్యంతరం వ్యక్తం చేయగా, నాకు ఇలానే మాట్లాడటం వచ్చు, ఇలానే మాట్లాడుతానని రోల్ అన్నాడు.. నువ్వు గల్లీ వాళ్లకోసమే ఆడుతున్నావా అంటూ ప్రశ్నిస్తాడు నూతన్. దీనికి ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చలు జరగగా, నీకు గల్లీ వాళ్లపై గౌరవం ఉంటే ఫోన్ పెట్టేయాలని నూతన్ చెబుతాడు. సరే అంటూ రోల్ ఫోన్ పెట్టేస్తాడు.

రోల్ రైడా ఫోన్ రిసీవర్ పెట్టింది తనీష్ ఫోన్ పైన. ఈ విషయాన్ని పబ్లిక్ కాలర్స్ టీంకి చెప్పి తెగ ఆనందపడిపోతారు కాల్ సెంటర్ సభ్యులు. ఇక తర్వాత దీప్తి.. కాల్ సెంటర్ సభ్యులరాలైన దీప్తి సునయనకి కాల్ చేస్తుంది. ఇద్దరు తీరికగా ముచ్చట్లు పెట్టుకుండగా, పబ్లిక్ కాలర్ కి చెందిన మిగతా ఇంటి సభ్యులు రోల్ రైడా చేసిన మోసంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం గీతా మాధురి చేస్తుంది. ఇక కాల్ మాట్లాడుతూ తినడంపై కౌశల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. . స్నాక్స్ లాంటివి తినొచ్చు కాని ప్లేట్స్ ముందు పెట్టుకొని తినడం ఎంత అగ్లీగా ఉంటుందని కౌశల్ వారిస్తాడు. దీనిపై అందరు అతని అభిప్రాయాన్ని ఏకిభవిస్తారు.

బిగ్ బాస్ కాల్ సెంటర్ టాస్క్ పూర్తి కావడంతో బిగ్ బాస్.. కౌశల్ అండ్ టీం కి 11 పాయింట్స్, తనీష్ అండ్ టీంకి 7 పాయింట్స్ వచ్చాయని ప్రకటించారు. దీంతో కౌశల్ టీం సంతోషం వ్యక్తం చేసింది. ఆ తర్వాత బట్టలు పెట్టుకోవడానికి గణేష్‌కి ప్లేస్ ఎందుకు ఇవ్వలేదనే విషయంలో కొద్ది సేపు చర్చ జరిగింది. ఇక గీతా మాధురీ, సామ్రాట్ల చూపుల యుద్ధం తర్వాత, హగ్గుల యద్ధం నడిచింది. తాను బయట ఎవరెవరవకి ఎలా హగ్ ఇస్తుందనే విషయాన్ని సామ్రాట్‌తో చేసి చూపించింది గీతా. ఇక సామ్రాట్‌తో నేను బాగా క్లోజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అంటూ గీతా మాధురి శ్యామలతో చెప్పగా .. ఆమె ఏం పర్లేదు ఫ్రెండ్స్‌తో క్లోజ్‌గా ఉండొచ్చు అంటూ గొప్ప సలహా ఇచ్చింది శ్యామలా.

ఇక 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో స్పెషల్ స్కిట్స్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు కంటెస్టెంట్స్. శ్యామల, గణేష్‌లు యాంకరింగ్ చేయగా మిగతావారు పార్టిసిపెంట్స్ గా మారారు. ఆడవాళ్లని చదువుకోనివ్వకపోవడం, పుట్టిన పిల్ల ఆడపిల్ల అని తెలిసి చంపేయడం, తాగి అత్యాచారం చేసి వారిని పై లోకానికి పంపివ్వడం లాంటి స్కిట్స్ అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులని భావోద్వేగానికి గురి చేశారు. చివరిగా ఇంటి సభ్యులు అందరు ‘భరత మాత’కి మొక్కుతూ పాటకి తగ్గట్టుగా హావ భావాలు ప్రదర్శించారు . ఈ రోజు ఎపిసోడ్లో ఈ వారం కెప్టెన్ పోటీదారులుగా ఉన్న రోల్ రైడా, కౌశల్‌ల మధ్య హోరా హోరీ పోరు నడవనుంది. వీరిద్దరిలో ఎవరు కెప్టెన్‌గా ఎంపికయ్యారనేది ఇక నేటి షోలో తేలనుంది.