మీ పిల్లలకు ఈ ట్యాబ్లెట్స్ వేస్తున్నారా ఒకసారి ఎంత ప్రమాదమో తెలుసుకోండి

72

చిన్నారులకు కొంత వయస్సుకు వచ్చేవరకు తల్లిదండ్రుల సంరక్షణ తప్పనిసరి. వాతావరణంలో మార్పులు, ఇతర పరిస్థితుల్లో చంటి పిల్లలు అస్వస్థతకు గురవుతుంటారు. ఇలాంటి సమయాల్లో తల్లిండ్రులు వైద్యుల సలహాలు లేకుండా సొంత చికిత్సలు చేయడం మానుకోవాలి. ఇది బిడ్డలకు ప్రమాదకరం . పురిటిబిడ్డ నుంచి రెండేళ్లు వచ్చే వరకు చిన్నపిల్లల వైద్యుల పర్యవేక్షణలోనే వైద్యం కొనసాగించాలి. నగర, పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నా, నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అందు బాట్లో పీహెచ్‌సీలు, ప్రభుత్వాస్పత్రులు ఉన్నా అక్కడ శిశు వైద్యనిపుణులు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మందులు కూడా అందుబాటులో ఉండవు. తగిన అవగాహన లేని తల్లిదండ్రులు స్థానికంగా మెడికల్ షాపుల్లో పెద్ద వారికి దొరికే మందు బిళ్లలను కొని చిన్నారుల చేత మింగిస్తున్నారు. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ముఖ్యంగా లావుపాటి మందు బిళ్లలు పిల్లల గొంతులో అడ్డుపడి శ్వాసకు ఆటంకం కలిగిస్తాయి. తద్వారా ప్రాణాలను హరించే ప్రమాదం పొంచివుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు మాత్రలు వేయడం సరికాదని, వారికి మందులను టానిక్‌ల రూపంలోనే ఇవ్వాలని శిశు వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

తల్లిదండ్రులు పిల్లలకు మందులు వేసే ముందు ఈ జాగ్రత్తలు పాటించాలి
చిన్నారులకు రెండేళ్లు వచ్చేవరకు ఎలాంటి మందు బిళ్లలు, గుళికలు వేయకూడదు. వారికి జలుబు, జ్వరం వచ్చినా.. మందుబిళ్లల బదులు టానిక్‌ల రూపంలో తగిన మందులు అందుబాట్లో ఉంటాయి. శిశు వైద్యనిపుణులు రాసిన సిరప్‌లు మాత్రమే పిల్లలకు పట్టాలి. ఇవి లిక్విడ్ రూపంలో ఉంటాయి. అందువల్ల మింగడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.జ్వరం, దగ్గు, జలుబుకు వాడే టానిక్‌లను ఇంట్లో అందుబాట్లో ఉంచుకోవాలి. జలుబు, జ్వరం వస్తే వెంటనే డాక్టర్లు సూచించిన మోతాదు మేరకు సిరప్‌ను చిన్నారులతో తాగించాలి. అలా చేయడం ద్వారా జబ్బు నయ మయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.పురిటి బిడ్డలకు ద్రావణాల కన్నా చుక్కల మందులను (డాప్స్‌) ఉపయోగించాలి. నవజాత శిశువులకు ఇవి ఎంతో మేలు.
ఏడాది దాటి మూడేళ్లలోపు చిన్నారులకు సిరప్‌లను ఇవ్వాలి. ఒకవేళ మందు సిరప్‌ రూపంలో అందుబాట్లో లేకుంటే మందు బిళ్లలను నీటిలో కరిగించి ఇవ్వాలి. ఈ మందులు నీళ్లల్లో సులువుగా కరిగిపోతాయి.పెద్దలు వాడే ట్యాబ్లెట్స్ చిన్నారులకు అందుబాట్లో లేకుండా చూడాలి. వాటిని పిల్లల కంటపడకుండా అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిపక్షంలో పిల్లలు తెలియకుండా వాటిని మింగేయవచ్చు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్త లు వహించాలి.

Image result for children medicine

చిన్నారులతో మాత్రలు మింగిస్తే ఒక్కొసారి అవి గొంతులో అడ్డంగా ఉండిపోతాయి. వారి ఆహార వాహిక ద్వారం చిన్నదిగా ఉంటుంది. దాంతో ఆ మాత్రలు గొంతులో అడ్డుపడి చిన్నారుల శ్వాసక్రియకు ఆటంకం కలిగి స్తాయి. ఇలా జరిగితే చిన్నారుల శరీరం నీలి రంగులోకి మారుతుంది. ఇది ప్రాణాపాయ పరిస్థితిగా, వైద్యపరమైన అత్యవసరస్థితిగా గుర్తించాలి. ఇలాంటి సమయంలో సమీపం లో అందుబాట్లో ఉన్న పిడియాట్రిక్‌ సర్జన్‌/ సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటిరాలజిస్ట్‌ల దగ్గరకు చిన్నారులను తీసుకువెళ్లాలి. పరిస్థితి తీవ్రతను బట్టి ముందు ప్రథమ చికిత్స చేస్తారు. చిన్నారిని బోర్లా పడుకోబెట్టి వీపుపై తట్టాలి. దీంతో గొంతులో ఇరుక్కున్న మాత్ర బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికీ గొంతులో నుంచి బయటకు రాకుంటే కొన్ని సున్నితమైన ప్రత్యేక వైద్యపరికరాల సాయంతో వైద్యనిపుణులు వాటిని తొలగిస్తారు. అందుకే చిన్న పిల్లలకు అన్నీ అందేలా కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, ఏదిపడితే అది వారి చేతికి ఇవ్వకూడదు. చూశారుగా చిన్న పిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.