మీ గర్ల్ ఫ్రెండ్ పుట్టిన రోజు నాడు చేయాల్సిన 7 పనులు

66

పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.. తల్లిదండ్రులకు ఓరకమైన సంతోషం, అయితే పుట్టిన రోజు చేసుకునే వారు స్నేహితులతో తమ డేని సెలబ్రేట్ చేసుకుంటారు.. రిలేషన్ లో ఉన్నవారు అయితే తమ పుట్టిన రోజు కంటే వారి పార్టనర్ పుట్టిన రోజున ఎంతో ఆనందంగా ఉంటారు.. ఆ డే అంతా తమతో ఉండాలని లాంగ్ రైడ్ కు వెళ్లాలి అని ఇలా అనేక కోరికలు ఉంటాయి, కొందరు కోరుకున్న వెంటనే జరిగితే ,మరికొందరికి కాస్త సమయం పడుతుంది .. అయితే పుట్టిన రోజు విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా విషయాలు పట్టించుకుంటారట. ముఖ్యంగా అబ్బాయి పుట్టిన రోజు అయితే కచ్చితంగా అమ్మాయి విష్ చేస్తుంది. రాత్రి ఎంత లేట్ అయినా అబ్బాయికి డిఫరెంట్ గా విషెస్ పంపిస్తుంది. ఇక అమ్మాయి పుట్టిన రోజునాడు సాధారణంగా విషెస్ చెబితే ఏ అమ్మాయికి నచ్చదు. ఈ ప్రపంచంలో ఏ భర్త ఏ లవర్ చెప్పని విధంగా తనకు బర్త్ డే విషెస్ చెప్పాలి అని అనుకుంటారు అమ్మాయిలు.. అంతేకాదు డిఫరెంట్ గా థింక్ చేసే అబ్బాయిలనే వారు ఇష్టపడతారు. మరి అలాంటిది అమ్మాయి పుట్టిన రోజుని ఎలా విష్ చేస్తే ఆమె ఇంప్రెస్ అవుతుందో చాలా మందికి తెలియక తికమక పడతారు.. అనవసరంగా లవ్ తో తిట్లు తింటారు. అయితే మీ గర్ల్ ఫ్రెండ్ తో పుట్టిన రోజు నాడు ఎలాంటి పనులు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం..

Image result for lovers

పుట్టినరోజులలో చాలా విషయాలు మనకు ప్రత్యేకమైనవి. మనకు ముఖ్యమైన వారి పుట్టిన రోజుని కూడా మనం ఎంతో ప్రేమిస్తాం. అయితే రిలేషన్ లో ఉన్న సమయంలో కచ్చితంగా అమ్మాయి పుట్టిన రోజు అయితే మీరు ఫ్లవర్ తో పాటు, కేకు ఓ గిఫ్ట్ తీసుకుని రాత్రి సమయంలోనే ఆమె చేత కేకు కట్ చేయించాలి. ఉదయం విష్ చేద్దామంటే మీ అంత బద్దకస్తులు మరొకరు లేరు అని ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది. అందుకే కచ్చితంగా 12 తర్వాత మీరు విష్ చేయాల్సిందే.ఫోన్లో సందేశాలు విషెస్ ని మెసేజ్ రూపంలో పంపకండి. కేవలం మీరు దూరంగా ఉన్నా ఆమెకు నేరుగా ఫోన్ చేసి మాట్టాడి విష్ చేయండి.

Image result for lovers

ఎప్పుడూ సీరియస్ గా ఉండే మనస్తత్వం మీది అయితే, సంవత్సరంలో ఒకరోజు అయినా మీరు ప్రేమగా ఆమెని చూడాలి అని అనుకుంటుంది… ఆమె పుట్టిన రోజున మాత్రం సీరియస్ గా ఉండకండి. ఆమెతో నవ్వుతూ ఉండండి. ఇక ఆమె పుట్టిన రోజున కచ్చితంగా ఆమె స్నేహితులకు ట్రీట్ ఇవ్వండి. మీ గురించి ఆమె ఏం ఫీల్ అవుతుందో అంతా స్నేహితుల ముందు చెబుతుంది.ఇక చాలా మంది మీకు నచ్చిన డ్రెస్ మీరు వేసుకుని ఆమె బర్త్ డే వేడుకకు వెళతారు..కాని ఇది అమ్మాయిలకు నచ్చదు, మీరు కచ్చితంగా ఆమెకు నచ్చిన డ్రెస్ మాత్రమే వేసుకుని వెళ్లండి.మీకు ఆమె పుట్టిన రోజున వేసుకున్న డ్రెస్ నచ్చకపోయినా, ఆ డ్రెస్ కలర్ బాగోలేదు అని చెప్పకండి.. ఆమె చాలా బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత మరోసారి ఇలాంటి కలర్ వద్దు అని చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి

ఆమెకు బాగా నచ్చినవిధంగా ఆమెతో ఉండండి, ఆరోజు ఆమె ఎక్కడికి తీసుకువెళ్లమంటే అక్కడకు వెళ్లండి. పార్క్ సినిమా రెస్టారెంట్ ఇలా ఆమె అభిరుచిని మీరు గౌరవించండి.ఇక ఆమెకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆరోజు ఖర్చుని ఎప్పుడూ లెక్కవేయకండి. ఆమె ఇలా ఖర్చు లెక్కవేస్తే చాలా బాధపడుతుంది.మీరు ఆమెతో జీవితాన్ని ఎలా చూస్తున్నారో ఆమెకు వివరించండి. భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ముఖ్యమైన రోజు అని మీరు మర్చిపోకండిఇలా ఆమెని ఇంప్రెస్ చేయవచ్చు, అంతేకాదు పుట్టిన రోజునాడు ఆమెకు మరింత దగ్గర అవ్వచ్చు. సో ఇలాంటి టిప్స్ ఫాలో అయి మీ పార్టనర్ తో రిలేషన్ మరింత బాగా ఏర్పరచుకోండి.. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల రూపంలో తెలియచేయండి.