మాట మారుస్తున్న ట్రంప్… కాశ్మీర్‌పై మళ్లీ యూటర్ప్ భారత్ సీరియస్

42

కశ్మీర్ విషయంలో పాకిస్ధాన్ రంకెలు వేస్తూనే ఉంది ఎలాంటి అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలి అని చూస్తోంది పాకిస్దాన్, కాని వారికి అవకాశం ఇవ్వడం లేదు భారత్, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి వరకూ వెళ్లినా కూడా దీనిపై పాక్ మాట నెగ్గలేదు పలు దేశాలు కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుకోవాలి అని సలహ ఇచ్చాయి. కాశ్మీర్ అంశంపై భారత్‌, పాకిస్తాన్‌ల నడుమ మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాశ్మీర్ అంశం ప్రమాదకరంగా, సంక్లిష్టంగా తయారైందని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని, సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం సహా ఏవిధంగానైనా తోడ్పడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పారు. ఈ వారాంతంలో ఫ్రాన్స్‌లో తాను మోడీని కలుస్తానని పేర్కొన్నారు.

Image result for trump

కాశ్మీర్ జఠిలమైన సమస్య. అక్కడ హిందువులు, ముస్లింలు ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య అంతా సజావుగా సాగుతోందని మాత్రం నేను చెప్పను. దశాబ్దాల నుంచి ఈ వివాదం నడుస్తోంది” అని ట్రంప్ అన్నారు…ఆ రెండు దేశాల మధ్య చాలా పెద్ద సమస్యలున్నాయి. పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం లేదా మరో విధంగానైనా నా వల్లైనంత కృషి చేస్తా. ఇమ్రాన్ ఖాన్, మోడీలతో నాకు మంచి సంబంధాలున్నాయి. వాళ్లిద్దరూ ఇప్పుడైతే స్నేహితులుగా లేరు. ఇమ్రాన్‌ను ఈ మధ్యే కలిశాను. మోడీని ఈ వారాంతంలో ఫ్రాన్స్‌లో కలుస్తా” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Image result for modi

అయితే, కాశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను భారత్ తిరస్కరిస్తూ వస్తోంది. కాశ్మీర్ అంశం ద్వైపాక్షికమని, దీనిపై మూడో పక్షం జోక్యం అనవసరమని అంటోంది. ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని, మధ్యవర్తిత్వం వహించాలని పదేపదే కోరుతూ వస్తున్నారు… ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌ను కలిసినప్పుడు కాశ్మీర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ప్రతిపాదించారు. మోడీ కూడా తనను మధ్యవర్తిత్వం గురించి అడిగారని చెప్పారు. అయితే, భారత్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలు అవాస్తవమని తేల్చిచెప్పింది. ఆర్టికల్ 370 సవరణ తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఇమ్రాన్, మోదీలతో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ క్రింద వీడియో చూడండి

సంయమనం పాటించాలని ఇద్దరు నేతలకూ ఆయన సూచించారు. భారత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడటం తగ్గించుకోవాలని పాకిస్తాన్‌కు ట్రంప్ హితవు చెప్పారు. సోమవారం ట్రంప్‌, మోదీల మధ్య దాదాపు అరగంటపాటు ఫోన్ సంభాషణ జరిగింది.మరోవైపు కాశ్మీర్ వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు పాకిస్తాన్ వెల్లడించింది. కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయమే దీనికి కారణమని పాకిస్తాన్ తెలిపింది. ఇప్పటికే భారత్‌లో వాణిజ్య, రవాణా సంబంధాలను తెంచుకున్న పాక్, తమ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది. అయితే అమెరికా పెద్ద అన్న తీరుపై కాస్త గుర్రుగా ఉన్నారట మోడీ మరి చూడాలి వీరిద్దరి భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.