మహిళల గ్రామాలు ఇక్కడ అమ్మాయిలు ఏం చేస్తారో తెలిస్తే షాక్

69

మహిళలు మాత్రమే నివసించేందుకు ప్రత్యేకించి కొన్ని ఊళ్లే వెలిశాయి. ప్రపంచదేశాల్లో పలు చోట్ల అటువంటి గ్రామాలున్నాయి. పురుషాధిక్యాన్ని తట్టుకోలేక కొందరు, భర్తను కోల్పోయిన వారు, సమాజానికి దూరంగా ఉండాలనుకునేవారు, బహుభార్యత్వాన్ని భరించలేని వారు.. ఇలాంటి వారంతా ప్రత్యేకంగా అక్కడ ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు.

ప్రపంచదేశాల్లో మహిళలు పురుషులతో సంబంధం లేకుండా జీవించే గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రామాలు ఏర్పాటు కావడానికి వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. కెన్యాలోని సంబురు కౌంటీ నగరానికి సమీపంలో ఉమోజా అనే ఊరు ఉంది. ఈ గ్రామంలో మహిళలు మాత్రమే జీవిస్తుంటారు. ఇలా వారంతా పురుష సమాజంతో సంబంధం లేకుండా ఉండడానికి అనేక కారణాలున్నాయి. పితృస్వామ్య సమాజానికి దూరంగా ఉండాలనుకునేవాళ్లు, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు,బహుభార్యత్వంతో విసిగిపోయిన 15 మంది మహిళలు 1990లో మొదటగా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. మూడు బృందాలతో మొదలయిన సంఖ్య ప్రస్తుతం 247కి చేరుకుంది. అత్యాచారానికి గురైన రెబెక్‌ లో లోసేలి అనే మహిళ ఉమోజా గ్రామానికి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తోంది.

ఇక్కడి వారందరి బాగోగులు ఆమె చూసుకుంటోంది. వెదురు, మట్టితో నిర్మించిన గుడిసెల్లో వీరు జీవిస్తారు. పురుషులెవరూ ఆ గ్రామంలోకి ప్రవేశించకుండా ప్రత్యేకంగా కొందరు మహిళలు కాపలా కాస్తుంటారు. సంబురు కౌంటీ సమీపంలోని అటవీ ప్రాంతంలో లభించే పండ్లు, పూలు, తేనె వంటివి అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. మరికొందరు పూసలతో ఆభరణాలు తయారుచేసి అమ్ముతూ పొట్టపోసుకుంటారు. ఈ గ్రామంలో నివసించే వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు మహిళా దాతలు ఆర్థిక సాయం అందిస్తారు. ఎటువంటి పని చేయలేని వృద్ధులకు, చిన్నారులకు సరిపడే నిత్యావసరాలకు ఆయా దాతలు అందించిన మొత్తాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ నివసించేవారిలో సోలోగమి పద్ధతిలో వివాహాలు చేసుకుంటారు. సోలోగమి అంటే తనను తాను మనువాడడం అని అర్థం. ఈ విధానం ద్వారా మహిళలు పెండ్లిళ్లు చేసుకుని పురుష సమాజంపై నిరసన వ్యక్తం చేస్తుంటారు. వారిలో బాగా చదువుకున్న వారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తుంటారు. తల్లితోపాటు ఉండే అబ్బాయిలకు 18 ఏండ్లు నిండగానే వారిని ఈ ఏరియా నుంచి బయటకు పంపుతారు.

Related image

నోయివా డుకొర్డియోర
బ్రెజిల్‌లో నోయివా డుకొర్డియోర మరో ఊరు ఉంది. అనాథ మహిళలు, వితంతువులు, పెండ్లి కాని యువతులు ఇక్కడ నివసిస్తుంటారు. పసిపిల్లల నుంచి 35 ఏండ్ల వయసు వారున్నారు. మొత్తం కలిపి 600 మంది వరకూ ఉంటారు. వారి నియమ నిబంధనలకు లోబడి ఉన్నవారినే ఇక్కడ ఉండేందుకు అనుమతిస్తారు. వారాంతంలో పురుషులకు ప్రవేశం కల్పిస్తారు. తల్లితోపాటే కొడుకులూ ఉండొచ్చు. కాకపోతే కొన్ని నియమ నిబంధనలుంటాయి.

అల్‌ సమాహా
వితంతువులు, విడాకులు పొందిన మహిళలందరి కోసం ఈజిప్టు ప్రభుత్వం అల్‌ సమాహా అనే ఊరిని నిర్మించింది. పిల్లలు, మహిళలు మొత్ంత కలిపి 300 మంది ఉంటారు. ఎటువంటి ఆసరా లేని స్త్రీలకోసం ఇక్కడి సర్కారు ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగానే వారు నివసించేందుకు ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ సంస్థల సహకారంతో అన్ని విధాలా అర్హులైన వారికి ఇల్లు, 6 ఎకరాల భూమిని ప్రభుత్వమే కేటాయిస్తుంది. నిత్యావసర వస్తువులను కూడా సర్కారే అందిస్తుంది. ఇక్కడ నివసించే వారిలో ఎవరైనా పెండ్లి చేసుకుంటే ప్రభుత్వం అందించే పథకానికి వారు అనర్హులుగా ప్రకటిస్తారు. అప్పుడు వారు ఈ ఊరును వదిలి వెళ్లాల్సి ఉంటుంది.

Related image

కిహ్ను
యూరప్‌లోని బాల్టిక్‌ నది సమీపంలో కిహ్ను అనే దీవి ఉన్నది. ఇది చాలా అందంగా ఉంటుంది. ఆ దీవిని మహళందరూ కలిసికట్టుగా అభివృద్ధి పథంలో నడిపించి ఐక్యరాజ్యసమితి ప్రశంసలు సైతం పొందారు. సంస్కృతి, సంప్రదాయాలతో అలరారుతున్న మాటల కందని వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి కిహ్ను దీవిని కొనియాడింది. ఇక్కడి వారంతా చేపలను వేటాడుతూ జీవనం సాగిస్తుంటారు.

జిన్వార్‌
యుద్ధంలో ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోతుంటారు. అటువంటి వారిపై ఆధారపడిన భార్యలు, వారి తల్లులు, పిల్లలను పునరావాసం కల్పించేందుకు మహిళా సంఘాలు శ్రీకారం చుట్టాయి. అందుకోసం ఏకంగా గ్రామాన్నే నిర్మించారు. అరబిక్‌ దేశమైన సిరియాలోని ‘జిన్వార్‌’ అనే ఊరిలో మహిళలకు ఇండ్లు నిర్మించారు. ఆ గ్రామంలోకి పురుషులు ప్రవేశించకుండా ఓ గేటు ఉంటుంది. ఆ గేటు దగ్గర తుపాకీతో మహిళలు పహారా కాస్తుంటారు. 30 కుటుంబాలు నివసించే ఈ ఊళ్లో పిల్లలు చదువుకోవడానికి పాఠశాల, జిన్వార్‌ అకాడమి, మ్యూజియంతోపాటు ఆసుపత్రి కూడా అందుబాటులో ఉంది. చేపల పెంపకం, వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతుంటారు. ఇక్కడ మహిళలందరూ కలిసి భోజనం చేస్తారు. ఎవరికి ఏ బాధ వచ్చినా పరిష్కరించడానికి ఓ నాయకురాలు ఉంటుంది. ఆమె అందరి బాగోగులూ చూసుకుంటుంది. మరి చూశారుగా మహిళల కోసం వెలసిన గ్రామాలు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.