భారత్‌లోకి ఐఎస్ఐ ఏజెంట్లు.. దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్

33

జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడంపై రగిలిపోతున్న పాకిస్తాన్ …భారత దేశంలో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) ఏజెంట్ తో పాటు నలుగురు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారు. భారత్‌లోకి ఐఎస్ఐ ఏజెంట్లు చొరబడ్డారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించాయి. దేశంలో విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయని అందువల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

Image result for ఐఎస్‌ఐ ఏజెంట్‌

అఫ్గానిస్థాన్‌ పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ సహా నలుగురు తీవ్రవాదులు గుజరాత్‌ తీరం నుంచి భారత్‌లోకి ప్రవేశించారని దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నెల మొదటి వారంలోనే వారు దేశంలోకి చొరబడినట్లు తమకు కీలక సమాచారం అందిందని కేంద్ర నిఘావర్గాలు వెల్లడించాయి. ఆ నలుగురూ ఏసమయంలోనైనా విధ్వంసక చర్యలకు తెగబడే అవకాశముందని నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌ ప్రకటించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రపై ఆ దుండగులు దృష్టి పెట్టినట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. దీంతో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దులతోపాటు ఇతర ప్రాంతాల్లోని హోటళ్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా ఎస్పీ కల్యాణ్ మల్ మీనా అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ మేరకు గుజరాత్‌ యాంటీటెర్రరిస్ట్‌( ఏటీఎస్‌) బృందానికి సమాచారమందించింది. దుండగులకు సంబంధించిన ఊహా చిత్రాలను కూడా గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులకు ఐబీ అందించింది. నిజానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజునే దాడులకు అవకాశమున్నా దేశమంతా అప్రమత్తంగా ఉండటంతో దుండగులు ఎలాంటి చర్యలకు పాల్పడలేదని ఐబీ భావిస్తోంది. దీంతో ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండటంవల్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘావర్గాలు అన్ని రాష్ట్రాలకు సమాచారమిచ్చాయి. హోటళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సహా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని కోరాయి. కీలకమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అనుమానితులను ప్రశ్నించాలని, వాహనాలను తనిఖీ చేయాలని కేంద్రం సూచించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని, అటువంటి వారిపై నిఘా పెట్టాలని సూచించారు. అలాగే, దేశంలోని ముఖ్య నగరాల్లో కూడా భద్రతను అప్రమత్తం చేశారు.కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి. మరి పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు భారత్ లోకి ప్రవేశించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.