బ్రహ్మంగారి కాలజ్ఞానం షాకింగ్ నిజాలు..

65

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి క్రీ.శ 1608 లో కాశీ పట్టణంలో జన్మించారు. 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచంలో ఏమి జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారని అంటూ ఉంటారు జనాలు. ఆయన చెప్పిన ఘటనలు పొల్లుపోకుండా జరగుతూ వస్తున్నాయి. అందుకే బ్రహ్మంగారిని సాక్షాత్తు దైవస్వరూపులుగా పూజిస్తారు. మరి బ్రహ్మంగారు చెప్పిన, జరిగిన కొన్ని ఘటనల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి

 1. దేవతా విగ్రహాలను దొంగలించేరు…
  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట దేవతల విగ్రహాలను లేదా ఆభరణాలను దొంగలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడు చెప్పారు.
 2. సొమ్ముల కోసం మతాలను మార్చుకుంటారు.
  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో మతాల మార్పు గురించి చెప్పాడు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే..అలాంటప్పుడు దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు కానీ మతానికి ఒక దేవుడు ఉన్నాడు. మతం పిచ్చితో వేరే వాళ్ళను మారమని ప్రోత్సహించేవారు కొందరైతే, ధనం మీద కాంక్షతో టార్గెట్ పెట్టుకుని మతం మారమని చెప్పేవారు కొందరు. ఈ విధంగా దేశంలో విచ్చలవిడిగా మతమార్పిడులు జరుగుతున్నాయి. నామాలు రూపాలు వేరైనా దేవుడు ఒక్కడే. ఇది తెలియని కొందరు మతమార్పిడులు చేస్తున్నారు.
Image result for bharama garu
 1. ఒక సన్యాసి అన్నాహారాలు ముట్టడు..
  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఒక సన్యాసి 70 ఏళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటాడని రాసిపెట్టి ఉంది. ఇది జరిగింది. గుజరాత్ కు చెందిన అతని పేరు ప్రహ్లాజ్ఞాని. ఇతని వయసు 80 ఏళ్ళు. ఇతనికి 10 ఏళ్ళు ఉన్నప్పటినుంచి ఏమి తినకుండా జీవిస్తున్నాడు. ఇతను ఏమి తినకుండా ఎలా బతుకుతున్నాడో తెలుసుకుందాం అని కొందరు డాక్టర్స్ పరిశీలించారు. ఇతనికి ఒక ఆర్మీ హాస్పిటల్ లో ఒక రూమ్ లో పెట్టి చుట్టూ కెమెరాలు పెట్టి 24 గంటలు అతనిని పరిశీలించారు. అలా రెండు వారాలు అతనిని పరిశీలించారు. ఈ రెండువారాలు కూడా అతను ఏమి తినకుండా ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమైందో డాక్టర్స్ కు అంతుచిక్కడం లేదు.
 2. ఊరూరా ఒక శక్తి పుట్టెను.. విశ్వమంతా తల్లడిల్లిపోయేను..
  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో 1978-80 కాలంలో ప్రతి ఊరిలో ఒక శక్తి వెలసిల్లుతుందని, ఆ శక్తి నుంచి తప్పించుకోడానికి ప్రతి ఊరిలో ఇంటి తలుపుకు ఓ స్త్రీ రేపురా అని రాశారు. బెంగుళూర్, ఢిల్లీలో ఇలాంటివి జరిగాయని టీవిలో పేపర్లలో చూడటం జరిగింది. ఇది కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ముందు హెచ్చరించినదే.
Image result for brahmam gari kala gyanam
 1. మంచినీటి చందంగా స్త్రీ పురుషులు మద్యం సేవించెను..
  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రపంచ వ్యాప్తంగా స్త్రీపురుష అనే తేడా లేకుండా మద్యం మత్తులో తేలుతారని రాశాడు. ఇప్పడూ ఆడవారు మగవారు ఎలా మద్యాన్ని సేవిస్తున్నారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇది బ్రహ్మంగారు చెప్పినదే.
 2. మైనర్స్ కన్యత్వాన్ని కోల్పోతారు..
  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో మైనర్స్ అత్యాచారానికి గురవుతారని, దాని ఫలితంగా గర్భవతులు అవుతారని చెప్పబడింది. ఇప్పటివరకు మైనర్స్ మీద ఎన్నో అత్యాచారం ఘటనలు జరిగాయి. వీటిని మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.
 3. ప్రతి కులానికి సంఘాలు ఏర్పడతాయి..
  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే ప్రస్తుతం కులానికి ఒక సంఘం ఉంది. వారి చట్టాల కోసం వారు ఉద్యమాలు చేయడం, గొడవలు స్పృష్టించడం వంటివి మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. రెడ్డి సంఘం, కమ్మర సంఘం, యాదవ సంఘం, గౌడ సంఘం..ఇలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం ఉంది. ఇలా కుల సంఘాలు ఏర్పడతాయని బ్రహ్మంగారు ఎపుడో చెప్పారు.
Image result for gods
 1. కొత్తకొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు..
  ఇటీవల దైవదూతలుగా చెలామణి అవుతున్న వారు ఎక్కువయ్యారు. ధర్మాన్ని కాపాడటం పక్కన పెట్టి వీరి అన్యాయాలను, అధర్మాలకు, భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కస్వామి మీద, ఒక్కొక్క గురూజీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మహిళలను వలలో వేసుకునే వారు కొందరు అయితే మాఫియా తరహా కార్యకలాపాలకు పాల్పడేది మరికొందరు. ఇలాంటి వారు వస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు.
 2. సూర్యకాంతి ఇంట్లో వెలుగును నింపును..
  బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సూర్యకాంతి వలన రాత్రుళ్ళు కాంతి వెదజల్లును అని చెప్పబడింది. ఇప్పుడు మనం సోలార్ సిస్టమ్ వలన రాత్రిళ్ళు లైట్స్ ను వెలిగించుకుంటున్నాం. సోలార్ సిస్టమ్ వస్తదని బ్రహ్మంగారు 400 ఏళ్ల క్రితమే చెప్పారు.
 3. ఆకులూ లేని తీగలు ప్రపంచం అంటా వ్యాపించును..
  ప్రస్తుతం మనం కరెంట్ కోసం విద్యుత్ తీగలను నిర్మించుకున్నాం. ఈ కరెంట్ తీగల గురించి ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేని కాలంలో బ్రహ్మంగారు చెప్పారు.

ఇలా బ్రహ్మంగారు చెప్పినవి ఎన్నో జరిగాయి..జరుగుతున్నాయి. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినవి కొన్ని వేల సంఖ్యలో జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.