బస్సులో 60 మంది ప్రయాణికులు సడెన్ గా డ్రైవర్ కి గుండె పోటు తర్వాత ఏం జరిగిందంటే

71

ఎవరు ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, జీవితంలో వర్షం రాకడ మనిషి ప్రాణం పోకడ కూడా అంతే ఎవరూ చెప్పలేము.. అయితే జీవరాశి నుంచి మనిషి వరకూ అందరిని భయపెట్టేది మాత్రం చావు అనే చెప్పాలి… ప్రాణం పై తీపి అందరికి ఉంటుంది. అలాంటి చావు అనేది కళ్లముందు కనిపిస్తే కచ్చితంగా మనిషికి తన కుటుంబం, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెల్లు గుర్తువస్తారు.. కాని ఆ సమయంలో కూడా పక్కవారి కోసం ఆలోచిస్తే, నిజంగా ఆ మనిషిని ఏమని పిలవాలి. దేవుడు అని చెప్పాలి, ఎందుకంటే పక్కవారి గురించి ఆలోచించే మానవత్వం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి. తాజాగా జరిగిన ఘటన గురించి వింటే కన్నీరే వస్తుంది.

Image result for ap bus drivers

ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అంటారు.. ఎందుకంటే ప్రేవేట్ ట్రావెల్స్ కు వేగం ఆగదు, కాని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఆర్టీసీ మాత్రం వేగంగా వెళ్లదు.. సమయానికి మాత్రమే బస్సులు గమ్యానికి చేరుకుంటాయి, అలాంటి బస్సులు నడిపే డ్రైవర్లు చాలా సీనియర్లు ఉంటారు.. ఇక రాత్రిపూట బస్సు నడిపేవారు అయితే డ్రైవింగ్ లో చాకచక్యం తెలిసిన వారు మాత్రమే ఉంటారు. తాజాగా ఇలాంటి ఓ ఆర్టీసీ డ్రైవర్ అరవై మంది ప్రాణాలను కాపాడాడు. కల్యాణదుర్గం నుంచి గోవిందరాజులు రోజూ ఆర్టీసీ బస్సు నడుపుతాడు. అతను అంటే ఆర్టీసీలో అందరికి ఇష్టం. డ్రైవర్ గా ఆ డిపోలో ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు, ఒక్క రిమార్క్ కూడా అతనిపై లేదు. పైగా ఆరోగ్యవంతుడు ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. సాటి మనిషికి సాయం అందిస్తాడు. ప్రతీ ఒక్కరిని గౌరవంగా చూస్తాడు. రోజూలాగానే కల్యాణ దుర్గం నుంచి అనంతపురం బస్సు నడుపుతున్నాడు.

Related image

కొండలు గుట్టలు దాటి బస్సు వెళుతోంది. కండెక్టర్ కూడా టిక్కెట్లు కొడుతూ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా గోవిందరాజులు కళ్లు బైర్లు కమ్మాయి. ఒంటి నిండా చెమటలు, గుండెల్లో మంట ఆందోళన, అతన్ని చుట్టుముట్టాయి. పక్కన లోయ కనిపిస్తోంది. ఆ సమయంలో ఆదమరిస్తే మాత్రం బస్సుతో సహ అందరూ లోయలో పడిపోతారు, కాని అతను గుండె నొప్పి వస్తున్నా బస్సు స్టీరింగ్ ని అమాంతం పక్కకు తిప్పి అంత స్పీడులోని బస్సుని ఆపేశాడు, ఒక్కసారిగా బస్సు ఇలా ఆగింది ఏమిటి అని ప్రయాణికులు చూసే సమయానికి, గోవిందరాజులు గుండె నొప్పితో స్టీరింగ్ పై పడిపోయాడు.

ఈ క్రింద వీడియో చూడండి

కండెక్టర్ వెంటనే అంబులెన్స్ కు డిపోకు సమాచారం అందించాడు, వారు వచ్చి చూసేసరికి స్టీరింగ్ పై ఉన్న గోవిందరాజులు మరణించి చాలా సేపు అయింది అని చెప్పారు, దీంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది, ఆ బస్సులో ప్రయాణికులు సైతం కన్నీరు మున్నీరు అయ్యారు. తమ ప్రాణాలు కాపాడిన దేవుడు అని అందరూ అన్నారు, కాస్త ఆదమరిచి ఆయన బస్సు స్టీరింగ్ ఇలా తిప్పి ఉంటే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. గోవిందరాజులు చేసిన పనికి ఆయన లేకపోయినా డిపార్ట్ మెంట్ ఆయనని నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఇలాంటి ఉద్యోగులు కచ్చితంగా ఉండాలి, మరి మనల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చే డ్రైవర్ అన్నలు అందరికి ధన్యవాదాలు తెలుపుదాం. చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ల రూపంలో తెలియచేయండి.