బంగారం జిగేల్.. మరి వెండి?

70

బంగారం అంటే ప్రతి ఒక్కరికి మోజే. ఆడవాళ్లకు అయితే మరి ఎక్కువగానే ఉంటుంది. అందుకే చేతిలో డబ్బు ఉంటె చాలు బంగారం కొనాలనుకుంటారు. ఉన్నత వర్గాల వారు తమ హోదాకు తగినట్లుగా వజ్రాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతుంటే ఎగువ, దిగువ మధ్యతరగతి వారు మాత్రం బంగారానికే ఓటేస్తున్నారు. గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారంఈరోజు కూడా భారీగా పెరిగింది.. మరి ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ఎలా ఉందొ తెలుసుకుందామా.

Image result for gold

పసిడి మళ్లీ పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.39,370కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.36,080కు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నిలకడగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌లో పురోగతి లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.26 శాతం తగ్గుదలతో 1,519.75 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.58 శాతం క్షీణతతో 17.02 డాలర్లకు తగ్గింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ.38,400 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగానే ఉంది. రూ.37,200 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి స్థిరంగా రూ.47,850 వద్ద ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల ధర 36,102 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,912 ఉంది. విశాఖ ప‌ట్నం 22 క్యారెట్ల ధర 36,087 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,947 ఉంది. బెంగళూరు 22 క్యారెట్ల ధర 35,345 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,165 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర 36,122 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 37,922 గా కొనసాగుతున్నాయి.. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. చూశారుగా వివిధ నగరాలలో బంగారం రేట్ ఎలా ఉందొ.