ప్రేమ కోసం మన తెలుగోడి ప్లాన్.. సౌదీలోని కోటీశ్వరుడి కూతురు హైదరాబాద్ వచ్చేసింది..

105

ప్రేమ… ఈ పదం గురించి వినని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ప్రేమలో పడతారు. కొందరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తే కొందరి ప్రేమ ఏమో మధ్యలోనే ఆగిపోతుంది.ప్రేమ సఫలం అయితే ఎలాంటి డోకా ఉండదు కానీ విఫలం అయితేనే వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. ప్రేమ కోసం హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమకు ధనిక బీద అనే తేడాలు ఉండవు. అలాంటి ప్రేమికులను మనం ఎంతో మందిని చూశాం. ఇప్పుడు మరొక ప్రేమ జంట ప్రేమకు ఉన్న గొప్పతనాన్ని తెలియజేశాయి. ఒక విదేశీ యువతీ ప్రేమ కోసం సౌదీ నుంచి తెలంగాణకు వచ్చింది. రూల్స్ ప్రకారం పాస్ పోర్ట్ తో వస్తే తన వివరాలు తెలుస్తాయని అక్రమంగా భారత్ కి ప్రవేశించింది. పడరాని కష్టాలు పడుతూ ప్రియుడిని చేరుకుంది. మరి వీళ్ళ ప్రేమకథ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఈ క్రింద వీడియో చూడండి

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన షేక్ అజీముద్దీన్ అనే 23 ఏళ్ల యువకుడు బతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం సౌదీకి వలస వెళ్లాడు. అక్కడ ఓ వ్యాపారవేత్త దగ్గర డ్రైవర్ గా చేరాడు. కోన్నాళ్లకు యజమాని కుమార్తె రజా అల్ హర్బీకి ఇతడిపై ప్రేమ పుట్టింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. కానీ సౌదీలోని మ్యారేజ్ రూల్స్ ప్రకారం అక్కడ వివాహం చేసుకోవడం కుదరలేదు. దీంతో అజీముద్దీన్ 2018 జనవరిలో ఇండియాకి తిరిగి వచ్చాడు. అయినప్పటికీ అతడిపై ప్రేమను చంపుకోలేకపోయింది ఆ యువతి. సోషల్ మీడియా ద్వారా చాటింగ్, వీడియో కాల్స్, ఫోన్ మాట్లాడటం ఆపలేదు. ఈ క్రమంలో అజీముద్దీన్ పై పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ సౌదీ అమ్మాయి, ఎలాగైనా ప్రియుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఇండియాకు రావాలనకుంది. సౌదీలోని తన ఇంటి నుంచి అదే అడ్రస్ తో వీసాకు అప్లై చేస్తే విచారణలో ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందని భయపడింది. దీంతో తన ప్రేమ విషయం బయటపడితే ఇండియాకు రావడం వీలుకాదని భావించిన ఆ యువతి మే నెలలో టూర్ కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి నేపాల్ కు చేరుకుంది. అక్కడి నుండి అక్రమంగా సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించింది. రోడ్డు, రైలు మార్గంలో హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి నిజామాబాద్ లో ఉంటున్న ప్రియుడు అజీముద్దీన్ ను కలుసుకుంది.

Image result for saudi girl

మే నెలలోనే వివాహం చేసుకున్న ఈ ప్రేమజంట కాపురం పెట్టారు. కూతురు కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టాడు యువతి తండ్రి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా యువతి తెలంగాణలో ఉన్నట్లు గుర్తించారు. ముంబైలోని సౌదీ ఎంబసీసి ఆశ్రయించిన యువతీ తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. తన కూతురినీ ఇండియా డ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపారు. దీంతో CCS పోలీసులు స్పెషల్ టీమ్స్ తో రంగంలోకి దిగి నిజామాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. విచారణలో తన ఇష్ట పూర్వకంగానే వచ్చానని యువతి చెప్పింది. అజీముద్దీన్ ఇండియాకు వచ్చిన ఐదు నెలల తర్వాత ఆమె రావడంతో కిడ్నాప్ కాదని తెలిపారు పోలీసులు. ఎంబసీ అధికారుల సమక్షంలో ఆ యువతి తిరిగి సౌదీ వెళ్తానంటేనే తండ్రికి అప్పగిస్తామని చెప్పారు పోలీసులు. ఇక్కడే ఉంటానంటే నివసించడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలా.. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు. మొత్తానికి ప్రేమకు సరిహద్దులు లేవు అని ఈ యువతి నిరూపించింది.