ప్రపంచంలో వింత కిడ్నీలో రాళ్లు అని వెళ్లి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది

43

వినడానికి, , నమ్మశక్యంగా లేని వార్త అనే చెప్పాలి.. ఇప్పుడు ఇదే వార్త ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇంతకి అసలు విషయం ఏమిటి అని అనుకుంటున్నారా అదే చెప్పుకుందాం.దక్షిణ డకోటాలో ఈ నెల 10న జరిగింది. .. గిల్ట్జ్‌ అనే34 సంవత్సరాల మహిళ గత కొంతకాలంగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధపడంది. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ గిల్ట్జ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె ఎనిమిదిన్నర నెలల గర్భవతి అని తేల్చారు. అంతేకాక ఆమె కడుపులో కవలలు ముగ్గురు పిల్లలు పెరుగుతున్నట్లు గుర్తించారు. అయితే గిల్ట్జ్‌ బాధపడుతుంది కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చిన నొప్పితో కాదని, ప్రసవ వేదనతో అని తెలియచేశారు. ఆమె సంతోషంగా వార్త వింది, తర్వాత 4 నిమిషాలలోనే గిల్ట్జ్‌ ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. చిన్నారులంతా 1.8కిలోగ్రాముల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ఎటువంటి ఆపరేషన్లు లేకుండా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరిగే సంఘటన. డెలివరీ సమయానికి గిల్ట్జ్‌ 34 వారాల గర్భంతో ఉన్నారు. కానీ దాని గురించి ఆమెకు ఏమాత్రం అవగాహన లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. వైద్యుడిని అయినప్పటికి సాధరణ జనాల మాదిరిగానే నేను కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఓ మహిళకు తాను గర్భవతిని అని తెలియకపోవడం.. నిజంగా వింతే. ఎందుకంటే గర్భవతి అయ్యాక నెలసరి ఆగిపోతుంది.. బిడ్డ పెరుగుతున్న కొద్ది ఉదర భాగం ముందుకు వస్తుంది. అంతేకాక ఆరు, ఏడో నెల నుంచి కడుపులో బిడ్డ కదలిక తెలుస్తుంది. కానీ గిల్ట్జ్‌ విషయంలో ఇవేవి జరగకపోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇప్పటికి నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కిడ్నీలో రాళ్లు అంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ ఏకంగా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం అనుకుంటా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ వార్త తెలిసిన జనాలు కూడా సదరు వైద్యులు వ్యక్తం చేసిన అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు. గిల్ట్జ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ప్రస్తుతం ఓ అమ్మాయికి, ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చింది. మొత్తం వారి ఇంట్లో ఇఫ్పుడు ఐదుగురు పిల్లలు ఉన్నారు, ఆమె భర్త కూడా ఈ విషయం తెలిసి చాలా ఆనందించాడు, కాని ఇన్ని రోజులు అయినా ఆమె గర్భవతి అని తను కూడా గుర్తించకపోవడాన్ని మాత్రం డాక్టర్లకు ఆశ్చర్యం కలిగించింది. సో చూశారుగా దీని గురించి మెడికల్ జర్నల్స్ కూడా ఈ వారం చాలా వచ్చాయి, అసలు ఇది ఓ మిరాకిల్ అని చెబుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు అంతేకాదు దీనికి కేస్ స్టడీగా కూడా చూడాలి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. చూశారుగా దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి