ప్రకాశం బారేజ్ నుంచి బయటకు తీసిన బోట్ గురించి దిమ్మతిరిగే నిజాలు,ఓనర్ ఎవరో తెలుసా?

1946

రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు చేసుకోవడం పనిగా మారిపోయింది.. ప్రజలకు కూడా బోరింగ్ వచ్చేసింది వీరి విమర్శలతో.. అధికారంలో ఉంటే వారిని ప్రతిపక్ష పార్టీ వదలదు విమర్శలు ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, గతంలో టీడీపీని వైసీపీ ఆటాడుకుంది..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతోంది. కాని వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు తెలుగుదేశం నేతలు. ఆరు నెలల సమయం ఇస్తాము అన్న చంద్రబాబు సైన్యం ఆరో రోజులు కూడా సమయం ఇవ్వడం లేదు. ఇటీవల వరదలు వచ్చి కరకట్ట దగ్గరనివాసాలు అన్నీ మునిగాయి, అందులో మాజీ సీఎం చంద్రబాబు నివాసం కూడా ఉంది. అయితే ఎగువ నుంచి వస్తున్న వరదని బయటకు వదలకుండా కావాలనే బ్యారేజ్ గేట్లు మూసివేశారు అని టీడీపీ ఆరోపించింది,… వరద రాకుండా మానేజ్ చేశారు అని వరదలపై ట్వీట్లు కూడా పెట్టారు. చివరకు వరదల్లో ఈ రాజకీయం పెను వార్తగా మారింది. ఏకంగా పడవని అడ్డు పెట్టి గేటు నుంచి నీరు రాకుండా నిలువరించారు అనేది పెద్ద విమర్శ. దేశ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది.

Related image

చివరకు ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న పడవను బయటకు తీసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గత ఐదు రోజులుగా శ్రమించిన నిపుణుల బృందం ఆదివారం మధ్యాహ్నం పడవను గేటు నుంచి తొలగించింది.. బోటుకు రంధ్రాలు చేసి రోప్ సాయంతో బయటకు తీశారు. బోటు ఆపరేషన్ కోసం కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నుంచి వచ్చిన నిపుణుల బృందాలను రప్పించారు. కృష్ణానది వరద సమయంలో ప్రకాశం బ్యారేజీ గేటు దగ్గర బోటు చిక్కుకోగా, వరద తగ్గిన తర్వాత అన్ని గేట్లను మూసివేసినా ఇది అడ్డంగా ఉండటంతో సదరు గేటు మూసివేత సాధ్యంకాలేదు. తత్ఫలితంగా పెద్ద మొత్తంలో నీరు వృథాగా దిగువకు పోయింది. గత కొన్ని రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీంతో గేటు మూసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో అధికార పార్టీపై ప్రతిపక్షం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. జలవనరుల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్వయంగా బోటు తొలగించే పనులని శనివారం పర్యవేక్షించారు. బోటును తొలగించేందుకు అరవై మంది సిబ్బంది అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. ఈ పనుల కోసం బ్యారేజ్ మీద వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఈ క్రింద వీడియో చూడండి

శనివారం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆపరేషన్ జరగుతుండగా ప్రమాదవశాత్తూ వరద నీటిలో పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. బోటును తీసే ప్రక్రియను చూస్తుండగా.. అతడు కాలుజారి వరద నీటిలో కొట్టుకుపోయాడు. కాసేపు ఈత కొట్టేందుకు ప్రయత్నించినా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు. మత్స్యకారులు అతడ్ని ఒడ్డుకు చేర్చి కాపాడే ప్రయత్నం చేసినా ప్రాణాలు దక్కలేదు. దీంతో ఈ రోజు కూడా ప్రయత్నాలు జరిగాయి. దీనికోసం కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నిపుణుల బృందాలు ఇందులో పాల్గొన్నాయి. పడవకు రంద్రాలు చేసి ఇనుపతాడు సాయంతో, బోటుని ఎట్టకేలకు బయటకు లాగారు. అయితే ఆ బోటు చూసిన ప్రజలు మాత్రం, ఆశ్చర్యపోయారు. అది ఎదో చిన్న బోటు కాదు, ఇసుక తరలించే బోటు. దాదపుగా 30 లారీల వరకు లోడ్ చెయ్యగలదు. ఇది విజయవాడ సమీప గ్రామాలకి చెందిన ఒక ఇసుక వ్యాపారిది అని కొందరు గుర్తు పట్టారు. పైగా ఇది టీడీపీ నేతకు చెందిన ముఖ్య అనుచరుడి పడవ అని చెబుతున్నారు.

Image result for ప్రకాశం బారేజ్

కాకపొతే దాని పూర్తి వివరాలు,అసలైన వాస్తవాలు ఇంకా ఎవరికీ తెలీదు. ఏది ఏమైనా ఇంత పెద్ద బోటు అడ్డం పడినా, ప్రకాశం బ్యారేజీకి ఎక్కడా డ్యామేజ్ కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ, మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇసుక తవ్వకాలు ఆగిపోయి, నాలుగు నెలలు అవుతుంది. ఈ బోటు నదిలో ఎందుకు ఉంది ? ప్రవాహం ఆపి, నీళ్ళు వెనక్కు తన్నటానికి ప్రభుత్వం కుట్ర పన్నిందా అని లోకేష్ కూడా ఆరోపించారు. అయితే వైసీపీ మాత్రం చిన్న బోటు, ప్రవాహం ఆపుతుందా అని హేళన చేసింది. అయితే, వారం రోజుల నుంచి ఆ బోటు తియ్యటానికి ప్రభుత్వం పడుతున్న కష్టాలు, ఈ రోజు బోటు బయటకు తీసిన తరువాత, అది ఇంత పెద్దదా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి మీరు చెప్పండి 30 లారీల ఇసుక పట్టే ఇంత పెద్ద పడవని, ప్రభుత్వం అక్కడ పెట్టించింది అని మీరు నమ్ముతున్నారా., దీనివెనుక ఏ కుట్ర లేదు అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్న కామెంట్ల రూపంలో తెలియచేయండి.