పూజారి ఇంట్లో డబ్బుల మూటలు కౌంటింగ్ మిషన్లు తెచ్చిన పోలీసులు

489

మనం సంపాదించిన ప్రతీ రూపాయి మనకు తినే అద్రష్టం ఉండాలి అంటారు పెద్దలు, అందుకే ప్రతీ ఒక్కరూ సంపాదించడం గొప్ప కాదు దానిని అనుభవించడం గొప్ప అనేది తెలుసుకోవాలి, కాని ఎవరు ఎంత సంపాదించినా తరాలకు తరాలు తిన్నా తరగని సంపద సంపాదించాలి అని అనుకుంటారు.. మన తర్వాత మన కుటుంబం బాగా స్ధిరపడాలి అని కోరిక ఉంటుంది, కాని కొందరు మాత్రం, వారు కూడా తినకుండా మనవళ్లకు కొడుకులకు కూతుళ్లకు సంపాదించి అందిస్తారు. మరికొందరు మాత్రం వారు సంపాదించింది వారికి మాత్రమే అనుభవించే హక్కు ఉందని భావిస్తారు, ఇటీవల కూడబెట్టిన డబ్బుని ఇంటిలో మూటలుగా దాచుకుని కాళ్లుచాపుతున్న ముసలివారిని చాలా మందిని చూశాం ..తాజాగా అలాగే కళ్లుమూసారు ఓ పురొహితుడు, పంతులుగారు మరణించారు అని తెలియగానే ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు .ఇంటిలో దొరికిన డబ్బు మూటలు చూసి జనంతో సహ పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం.

Image result for పూజారి ఇంట్లో డబ్బుల మూటలు

గత 30 ఏళ్లుగా పౌరోహిత్యం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నో ఓ పేద బ్రాహ్మణుడు దగ్గర .లక్షల డబ్బు ఉంది.. కాని ఆయన చనిపోయిన తర్వాత బయటపడింది. పౌరోహిత్యం ద్వారా ఈయన ఇంత సొమ్మును కూడబెట్టారా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆసక్తికర ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో వెలుగుచూసింది. తునిలోని ముక్తిలింగయ్యగారి వీధిలోని పాడుబడిన భవనంలో అప్పల సుబ్రహ్మణ్యం అనే పురోహితుడు నివసిస్తున్నాడు. ఆయన వయసు 70 సంవత్సరాలు.. అయితే, ఆయన అనారోగ్యంతో మంగళవారం మృతిచెందాడు. ఆయన పిల్లలు, బంధువులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు వారికి సమాచారం అందజేశారు. బుధవారం సుబ్రమణ్యానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Image result for పూజారి ఇంట్లో డబ్బుల మూటలు

సుబ్రహ్మణ్యం చాలాకాలంగా నివాసం ఉన్న ఆ భవనాన్ని పరిశీలించగా అక్కడ అనేక మూటలు కనిపించాయి. ఏముందోనని వారు విప్పిచూడగా వాటిలో భారీగా నగదు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ మూటలను విప్పి లెక్కింపు ప్రారంభించగా ఎంతకూ పూర్తికాలేదు. దీంతో కౌంటింగ్‌ మిషన్‌ను తెప్పించి లెక్కింపు మొదలుపెట్టారు. బుధవారం రాత్రి 10 గంటల వరకు రూ.7లక్షలు తేలింది. మరిన్ని మూటల్లోని నగదు లెక్కించాల్సి ఉంది. సుమారు 20 లక్షల వరకూ నగదు ఉంటుంది అని భావిస్తున్నారు అక్కడ వారు.

ఈ క్రింద వీడియో చూడండి

వారం రోజుల కిందట ఓ బిచ్చగాడి వద్ద రూ.1.86 కోట్లకుపైగా డబ్బు గుర్తించిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తమిళనాడులోని అరవన్నామలై ప్రాంతంలో గత గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భిక్షకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, అతని దగ్గర ఉన్న సంచిని పరిశీలించగా అందులో పెద్దమొత్తంలో నగదు చూసి అవాక్కయ్యారు. ఆ డబ్బును లెక్కించగా మొత్తం రూ. 1,86,43,364 నగదుగా తేలింది. అంత డబ్బున్నప్పటికీ అతను ఇంకా భిక్షాటనే ఎందుకు చేస్తున్నాడన్నది ఎవరికీ అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోయింది…తన వాళ్లకు ఇద్దామనుకున్నాడో ఏమో ఇచ్చేలోగానే ఎవరికీ చెప్పకుండా తుదిశ్వాస విడిచాడు అని ఆ పురోహితుడి గురించి స్ధానికులు చెప్పుకుంటున్నారు. కాని అతడి కుమారుడు అప్పల భీమశంకరం ఈ మొత్తాన్ని పేద బ్రాహ్మణుల సంక్షేమానికి వినియోగిస్తానని తెలిపాడు. ఇది మాత్రం ఆ పెద్దాయన ఆత్మకు శాంతిచేకూర్చే మాట అని చెప్పాల్సిందే, ఏమంటారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.