పివి సింధు రియల్ స్టోరీ…

74

పివి సింధు..ఇప్పుడు దేశం మొత్తం మారుమోగిపోతున్న పేరు. 42 ఏళ్ల భారత్ కలను నిజం చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ లో బంగారు పథకాన్ని సాదించాలి అని కలలు కన్న వారందరి కలను నిజం చేసింది. చరిత్ర స్పృష్టించింది. ఇదొక్కటే కాదు ఇంతకముందు కూడా ఎన్నో విజయాలను సాధించి దేశం గర్వించేలా చేసింది. ఒక తెలుగు అమ్మాయి బ్యాట్మింటన్ లో ఇంత స్థాయికి ఎలా చేరుకుంది. ఆమె విజయం వెనుక ఎవరు ఉన్నారు. ఎన్ని కష్టాలు పడింది. ఆమె లైఫ్ స్టోరీ మీద ఒక చిన్న స్టోరీ మీకోసం..

Image result for pv sindhu

బాల్యం, చదువు….
సింధు జూలై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదు లో జన్మించింది. సింధు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాలీబాల్ ప్లేయర్స్. సింధు పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. ఆమె తండ్రి రమణ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జన్మించారు. ఉద్యోగ రీత్యా గుంటూరుకు తరలి వెళ్ళారు. రమణ తన వాలీబాల్ కెరీర్ కోసం, రైల్వేలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ. సింధు చదువంతా హైదరాబాద్ లోనే సాగింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ఆటగాళ్ళైనా సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. అప్పటికి గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పోటీలలో గెలిచి వార్తలలో నిలిచాడు.. సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది.

Image result for pv sindhu

కెరీర్..
2009 లో కొలంబోలో జరిగిన సబ్ జూనియర్ ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు కాంస్య పతాకం సాధించింది. ఇదే ఆమె విజయానికి తొలిమెట్టు. తర్వాత 2010 లో మెక్సికోలో జరిగిన జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించింది. అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ఆగస్టు 18, 2016 న రియో ఒలంపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి ఒలంపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. సైనా నెహ్వాల్ 2012 ఒలంపిక్స్ లో కాంస్యపతకం సాధించిన తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు.

Image result for pv sindhu

2013 లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడి సంచలనం క్రియేట్ చేసింది. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న చైనా క్రీడాకారిణిని ఓడించి కార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆగస్టు 8, 2013 న జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ యిహాన్‌ వాంగ్‌ను సింధు ఓడించింది. 55 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించింది. జపాన్ కు చెందిన కవోరి ఇమబెపు తో ఆగస్టు 7, 2013 జరిగిన రెండో రౌండ్‌లో సింధు విజయం సాధించింది. పతకాల కోసం భారత్ తల్లడిల్లుతున్న సమయంలో పి.వి.సింధు భారత్‌కు రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఈ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఎంలో కెనడాకు చెందిన మిషెల్లీ లీనును, హంగరీకి చెందిన లారా సరోసీనిని, చైనీస్ కు చెందిన తాయ్ జూ యింగ్ పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తర్వాత సెమిస్ లో జపనీస్ నోజోమి ఒకుహారాను ఎదుర్కొంది. తర్వాత ఫైనల్ లో స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది.

Image result for pv sindhu

2016 రియో ఒలంపిక్స్ లో క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ ఇహాన్‌ను 2-0 తో ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 2016, ఆగస్టు 18వ తేదీ జరిగిన సెమీ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహరాతో వీరోచితంగా పోరాడి 2-0 తో ఆమె పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. 2016, ఆగస్టు 19వ తేదీన జరిగిన ఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ తో వీరోచితంగా పోరాడి పరాజయం పాలయింది. ఈ ఒలింపిక్స్‌లో మహిళల సింగల్స్ బ్యాడ్‌మింటన్‌లో ద్వితీయ స్థానం పొంది ఈ క్రీడలలో భారత్‌ కు తొలి, ఏకైక రజత పతకాన్ని సంపాదించిపెట్టింది. ఇక 2018 కామన్వెల్త్ క్రీడల్లో సింధు, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం, మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో రజత పతకం సాధించారు. 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో సింధు వరుసగా రెండవ రజత పతకాన్ని సాధించింది. మొత్తంగా నాల్గవది. డిసెంబర్ 2018 న, చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన సీజన్-ఎండింగ్ బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర స్పృష్టించింది. ఇక 2019 లో కూడా పలు విజయాలు సాధించింది. అయితే అన్నిటికన్నా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ను అందుకోవడం గొప్ప విషయం. 42 ఏళ్ల తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ లో బంగారు పథకాన్ని సాధించింది. గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెలుచుకుంది. అయితే అన్నిసార్లు సిల్వర్ మెడల్స్ ను సాధించిన 2019 చాంపియన్‌షిప్‌ లో మాత్రం స్వర్ణం సాధించి దేశం గర్వించే విధంగా చేసింది. ఈమె విజయంలో కోచ్ గోపిచంద్ ముఖ్య పాత్రను పోషించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ క్రింద వీడియో చూడండి

అవార్డ్స్..
24 సెప్టెంబర్ 2013 న అర్జున అవార్డును ప్రదానం చేశారు. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. 29 ఆగస్టు 2016 న భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు.

ఇలా వరుసగా విజయాలు సాధిస్తూ, దేశ అత్యున్నత పురస్కారాలు అందుకుంటూ బాట్మింటర్ హిస్టరీలో తనకంటూ ఒక ముద్రను వేసుకుంటుంది సింధు. ఈమె ఇలాగే మరిన్ని విజయాలు సాధించి దేశ ప్రతిష్టతలను ఇంకా పెంచాలని మనసారా కోరుకుందాం.