పాక్ మరణశాసనం మ్యాప్ లో ఉంటుందా

64

ఎప్పుడూ అల్లర్లు ఉగ్రదాడులతో ఉండే దేశం, శాంతికి దూరంగా ఉండే ప్రాంతం అంటే పాకిస్దాన్ పేరు చెబుతారు ఎవరైనా ..అసలు పాకిస్థాన్ అంటే పవిత్ర ప్రదేశమని పేరు. మరి అంతటి శుద్ధమైన పేరు పెట్టుకున్న దేశంగా ఏర్పడినా, 72 ఏళ్ళల్లో ఎపుడూ కూడా అలా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఎంతసేపు భారత్ మీద ఏడుపు, విషం కక్కడానికే పాక్ పుట్టిందనిపిస్తుంది. కోరి మరీ విభజన చేసుకున్నాక తమ గొడవేదో తాము పడకుండా భారత్ ని విచ్చిన్నం చేయాల‌నుకోవడమే పాక్ వినాశనానికి అసలైన కారణం. పాక్ ఇపుడు చాలా ప్రమాద‌పు అంచుల్లో ఉంది. ఎన్నడూ లేనంతగా సమస్యల వలయంలో ఇరుక్కుని విలవిలలాడుతోంది. అసలు తమ ప్రాంతం కాని దానికోసం పాకులాడుతోంది, పైగా ఆర్దికంగా రక్షణ పరంగా ఎంతో బలమైన దేశం భారత్, కాని భారత్ తో యుద్దానికి సిద్దం అనేలా రెచ్చగొడుతోంది పాకిస్ధాన్. కశ్మీరుపై ఎన్ని దెబ్బలు తిన్నా తమ వైఖరి మార్చుకోవడం లేదు, అంతేకాదు కాలికి బలపం కట్టుకొని ఇమ్రాన్ ఖాన్ తిరుగుతున్నారు.. మరోపక్క కశ్మీరు విషయంలో ప్రపంచం అంతా కూడా భారత్ కు సపోర్ట్ చేస్తోంది, ఓ పక్క వైరి దేశంగా ఉన్న చైనా కూడా భారత్ కు సపోర్ట్ చేస్తోంది.ఈ విషమ పరిస్దితుల్లో ఇప్పుడు పాకిస్ధాన్ ఏకాకి అయిపోయింది.

ఈ క్రింద వీడియో చూడండి

పాకిస్థాన్ని ఓ దేశంగా ఇంతవరకూ ప్రపంచం గుర్తించిందా అన్న దాన్ని బట్టే ఆ విభజన ఎంత దారుణమో, ఆ వాదన మరెంత నకిలీదో అర్ధమవుతుంది. పాక్ మత రాజ్యంగా ఆవిర్భవించింది. 1947 ఆగస్ట్ 14న అంటే భారత్ కంటే ఒక రోజు ముందుగానే పాక్ జెండా రెపరెపలాడింది. ద్విజాతి సిద్ధాంతాన్ని బలంగా నమ్మి దాన్ని పట్టుకుని చివరకు అఖండ భారత్ ని రెండు ముక్కలు చేసేంతవరకూ నిద్రపోనివాడు మహమ్మద్ ఆలీ జిన్నా.ఇంత చేసినా జిన్నా పాక్ ని ఏలింది అచ్చంగా పద్దెనిమిది నెలలు మాత్రమే. ఆయన ప్రాణాంతకమైన వ్యాధిలో కన్నుమూశాక పాక్ అనుకున్న గాడి తప్పేసింది. ఆ తరువాత నుంచి ఇంతవరకూ పాక్ ఒక దేశంగా తనను తాను తీర్చి దిద్దుకోకుండా భారత్ పైనే పడి ఏడ్వడం వల్ల పూర్తిగా నష్టపోయింది.. ప్రపంచ దేశాలు కూడా భారత్ మీద కోపంతోనో, మరో దానికో తమ అవసరాల కోసం పాక్ ని చేరదీశాయే తప్ప ఒక దేశంగా గుర్తించి గౌరవించింది ఎపుడూ లేదు.

Image result for modi and imran khan

ఇపుడు ఆ విషయం పాక్ కి స్పష్టంగా తెలుస్తోంది. కాశ్మీర్ ని రెండు ముక్కలుగా విభజించి 370 ఆర్టికల్ ని భారత్ తొలగించిన విషయంలో పాక్ కి అండగా ఒక్క దేశం కూడా నిలవకపోవడం పాక్ దీన స్థితికి అద్దం పడుతోంది. చైనా, అమెరికా, అరబ్ దేశాలు అన్నీ కూడా మౌనం దాల్చడం పాక్ అతి పెద్ద ఫెయిల్యూర్. ఇక పాక్ కి ఐక్య రాజ్య సమితి కూడా షాక్ ఇచ్చేసింది. ఈ నేపధ్యంలోనే పాక్ మరింత వెర్రి ఆవేశం పడిపోయి తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటోంది.

Image result for modi and imran khan

భారత్ తో వాణిజ్య సంబంధాలు, దౌత్య సంబంధాలు తెంచుకుంటోంది. భారత్ సినిమాలు పాక్ లో ఆడనీయమంటూ పిల్ల చేష్టలు పోతోంది. సంజౌతా రైలు ని ఆపేసింది. ఇంకా ఏం చేయాలో అవి చేస్తామంటోంది. కానీ ఇక్కడో విషయం గమనించాలి. పాక్ అలిగితే నష్టపోయేది ఎవరు. కచ్చితంగా ఆ దేశమే. అసలే ఆకలి, అప్పులు, దారిద్రంతో మగ్గుతున్న పాక్ తన చావుని తాను ఇలా కోరి తెచ్చుకుంటే అది డేంజర్ సిగ్నలే. పైగా ఆవేశానికి పోయి మరింత దీనస్ధితికి చేరుతోంది పాకిస్ధాన్. ఒకసారి భారత్ పాక్ వ్యాపారాలు చూస్తే, భారత్‌ నుంచి కారుచౌకగా దిగుమతి చేసుకుంటున్న నిత్యావసరాలు ఆగిపోయాయి. దాంతో పాకిస్థాన్‌ సామాన్య ప్రజలు భగ్గుమన్న ధరలతో అల్లాడిపోతున్నారు. పది రూపాయలకు దొరికే టమాటాలు రూ.300 అయ్యాయి. అఫ్ఘానిస్థాన్‌ నుంచి టమాటాలను పాక్‌ దిగుమతి చేసుకుంటున్నా అవి ఏమూలకు సరిపోవడం లేదు. ఆలుగడ్డలు పది రూపాయల నుంచి 30 రూపాయలకు పెరిగాయి. ఉల్లిపాయలు, పంచదార, కాఫీ, టీ, తృణ ధాన్యాలు, సోయాబీన్‌, చెప్పులు, ఆర్గానిక్‌ కెమికల్స్‌, న్యూక్లియర్‌ రియాక్టర్స్‌, బాయిలర్లు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ఇనుము, స్టీలు వస్తువులు, కాపర్‌ తదితరాలను భారత్‌ నుంచి పాకిస్థాన్‌ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు వీటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇలా పాక్ వైఖరితో తన మ్యాప్ ని తానే చెరుపుకుంటోంది అని అంటున్నారు విశ్లేషకులు.