నూతన్ నాయుడుని ఘోరంగా అవమానించిన రోల్ రైడా

516

బిగ్ బాస్ టాస్క్ ల‌తో హౌస్ లో మ‌రింత మ‌జా క‌నిపిస్తోంది.బుల్లి తెర బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2లో రసవత్తరమైన పోరు మొదలైంది. అనే చెప్పాలి…ఇప్పటికే 67 ఎపిసోడ్‌లు పూర్తి కావడంతో టైటిల్ పోరులో నిలిచి గెలిచేందుకు కంటెస్టెంట్ మధ్య నువ్వా నేనా అంటూ హోరా హోరీ పోరు మొదలైంది. ఇక ఆసక్తికర పరిణామాలతో రెండు రోజులుగా లగ్జరీ బడ్జెట్‌, కెప్టెన్ ఎంపికలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య ‘కాల్ సెంటర్’ టాస్క్ రసవత్తరంగా సాగింది.. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు కాల్ సెంటర్ ఉద్యోగులుగా.. పబ్లిక్ కాలర్స్‌గా విడిపోయి గేమ్‌లో గెలిచేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.


కాల్ సెంటర్ ఉద్యోగిగా ఉన్న రోల్ రైడాతో నూతన్ నాయుడు ఫోన్ చేసి విసిగించే ప్రయత్నం చేశారు.. అయితే ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. రోల్ రైడా యాస పట్ల నూతన్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సీరియస్‌గా స్పందించారు రోల్ రైడా. గల్లీ నుండి వచ్చి గల్లీకి మాత్రమే పరిమితం కావాలని అనుకుంటున్నావా అని నూతన్ నాయుడు అనడంతో.. గల్లీ వాళ్లు బిగ్ బాస్‌కి రాకూడదా? వెంటనే గల్లీ వాళ్లకు క్షమాపన చెప్పాలన్నారు రోల్ రైడా. అయితే నీకు గల్లీ వాళ్లపై గౌరవం ఉంటే ఫోన్ పెట్టాయాలని నూతన్ నాయుడు అనడంతో ఆవేశంగా ఫోన్ పెట్టేశాడు రోల్ రైడా. దీంతో గల్లీ వాళ్లపై గౌరవంతో ఫోన్ పెట్టేసిన రైడాకి నా సలామ్ అని నూతన్ నాయుడు ఫోన్ పెట్టేశారు.

అయితే రోల్ రైడా ఫోన్ పెట్టింది తన ఫోన్‌ మీద కాదు.. పక్కన ఉన్న తనీష్ ఫోన్‌పై తన రిసీవర్ పెట్టి నూతన్ నాయుడ్ని బోల్తా కొట్టించి పాయింట్ సాధించాడు. దీంతో ఖంగు తిన్నారు నూతన్ నాయుడు. రెండో కాలర్‌గా దీప్తి నల్లమోతు.. కాలర్ ఉద్యోగిగా ఉన్న సునయనకు కాల్ చేసింది. అయితే ఇద్దరి మధ్య చాలాసేపు సంభాషణలు నడిచాయి. అయితే కౌశల్‌ టీం సభ్యులు కాల్ సెంటర్ ఉద్యోగులుగా పబ్లిక్ కాల్స్‌ను మర్యాదగా డీల్ చేశారు. కాని తనీష్ టీం సభ్యులు పబ్లిక్ కాలర్స్‌తో మాట్లాడుతూ మర్యాదను పక్కనపెట్టేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ముఖ్యంగా సునయన, రోల్ రైడాలు మేం ఇలాగే మాట్లాడతాం అంటూ డిన్నర్, లంచ్‌లను కాల్స్ మాట్లాడుతూనే కానిచ్చేశారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు కౌశల్. కనీసం కాల్ సెంటర్ ఉగ్యోగం చేసే వాళ్ల కైనా రెస్పెక్ట్ ఇవ్వాలని భోజనం చేస్తూ కాల్ సెంటర్ ఉద్యోగులు పబ్లిక్‌తో మాట్లాడతారా? అంటూ క్వశ్చ‌న్ చేశారు. ఇక ‘కాల్ సెంటర్’ టాస్క్‌లో తనీష్ టీం 7 పాయింట్లు సాధించగా.. కౌశల్ టీం 10 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఈ సదర్భంగా విజేతగా నిలిచిన కౌశల్‌ టీంను అభినందించారు బిగ్ బాస్.


దీప్తి సునయన లిప్ స్టిక్ రాస్తే.. రాయించుకుంటావ్.. నేను రాస్తుంటే తప్పించుకుంటున్నావ్. ఒకరికి ఫేవర్‌గా మరొకరికి దూరంగా ఉండటం ఏంటంటూ సామ్రాట్ షర్ట్‌కి లిప్ స్టిక్ పూసింది గీతా మాధురి. సామ్రాట్‌తో నేను బాగా క్లోజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అంటూ గీతా మాధురి.. శ్యామలతో అనడం ఆమె ఏం పర్లేదు ఫ్రెండ్స్‌తో క్లోజ్‌గా ఉండొచ్చు అంటూ గొప్ప సలహా ఇచ్చింది.

ఇక స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో స్పెషల్ స్కిట్స్‌తో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశారు కంటెస్టెంట్స్. సునయన, రోల్ రైడా, గీతా మాధురి, శ్యామల, సామ్రాట్‌లు వేసిన ‘భరత మాత స్కిట్ ఆకట్టుకుంది… ఇక కెప్తెన్సీ టాస్క్ లో భాగంగా త‌నీష్ కౌశ‌ల్ నేడు ఎటువంటి యుద్దం చేయ‌బోతారో చూడాలి.