దక్షిణ భారత్ లోకి చొరబడ్డ టెర్రరిస్టులు… ఐదు మృతదేహాలు, అనుమానిత బోట్లు గుర్తింపు

85

పొరుగు దేశ‌మైన‌ పాకిస్థాన్ త‌న ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌ను ఆపివేయ‌డం లేదు. ఆర్టికల్‌ 370 రద్దుతో మండిపోతున్న పాక్ భార‌త‌దేశంలో ఉద్రిక్త వాతావరణాన్ని నెల‌కొల్పేందుకు ఇంకా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తోంది. ఇందుకోసం ప్ర‌త్యేక దారుల‌ను అన్వేషిస్తోంది. దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇటీవల సైన్యం తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ పని జరగలేదని ఇప్పుడు పాకిస్తాన్ తన నీచమైన బుద్ధుని మరోసారి వేరే దగ్గర చూపించింది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉగ్రవాద దాడికి పాక్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. ఇది అపోహ అనుమానం కాదని పక్కా ఇన్ఫర్మేషన్ అని చీఫ్ ఆర్మీ ఆఫీసర్లు కూడా చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు ఉగ్రవాదులు నీటి మార్గం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తూ వారి దగ్గర అలాంటి రిపోర్టులు ఉన్నట్లు తెలిపారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో తీరప్రాంతాలన్నింటిలో హై అలర్ట్ ప్రకటించారు. నేవీ విభాగం మొత్తం బాగా అలర్ట్ గా ఉండి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇదే సమయంలో ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన కీలక సమాచారంతో గుజరాత్‌లో వణుకు మొదలైంది. గుజరాత్ సర్ క్రీక్ తీర ప్రాంతంలోకి ఉగ్రవాదులు బోట్ల సహాయంతో చొరబడినట్లుగా గుర్తించారు. దక్షిణ భారతదేశంలో ప్రమాదాలు ఉన్నాయని తీర ప్రాంత ఇంటిలిజెన్స్ వర్గాలు సూచించడంతో స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. కొద్ది రోజుల ముందే సముద్ర తీరాల గుండా ట్రైన్డ్ టెర్రరిస్టులు భారత్ లోకి చొరబడ్డారనే వార్తలు వచ్చిన సమయంలోనే మరోసారి గుజరాత్ తీర ప్రాంతంలోకి ఉగ్రవాదులు చొరబడడం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంది. తీవ్రవాదులు ఏదో ఒక దక్షిణ రాష్ట్రంలోకి పడ్డారని తాము అనుమానిస్తున్నట్లు తెలిపారు. అది తెలంగాణా కావచ్చు, ఆంధ్ర కావచ్చు లేదా తమిళనాడు, కర్నాటక కూడా కావచ్చు. తీవ్రవాదులు భారతదేశంలోకి వచ్చారా లేదా అన్న విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకొని ప్రకటిస్తామని కూడా అధికారులు తెలిపారు. అలాగే ఆ బోట్లకి సమీపంలో 5 మృతదేహాలను కూడా గుర్తించినట్లు తెలిపారు. ఆ మృతదేహాలు ఎవరివి అన్న విషయాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉందని బహుశా తీవ్రవాదులు ఐదుగురిని చంపి లోనికి చొరబడ్డారు అని అనుమానిస్తున్నట్లు వారు తెలిపారు.

Image result for టెర్రరిస్టులు

ఇకపోతే ప్రజలు ఏమి భయాందోళనలకు గురి కావద్దని వారు దాడి చేయబోయేలోపు పట్టుకునేందుకు తగిన ప్రణాళికలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు చీఫ్ మేజర్. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ తీర ప్రాంతాల్లోని ప్రజలు మరియు దక్షిణ భారత దేశంలోని ప్రధాన నగరాల్లోని సిటిజన్లు భయాన్ని వీడి తమకు తగిన సహకారం ఇవ్వాలని కోరారు. ఆఫీసర్లు హెచ్చరికలు జారీ చేసిన అనంతరం కేరళలోని ఆర్మీ అధికారులు అలర్ట్ చేశారు. తీర ప్రాంతంలో ప్రత్యేకమైన భద్రతలు తీసుకోవాలని సూచించారు. గుంపులుగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ వంటి ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబిర్ సింగ్ పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ గ్రూప్ మరోసారి దాడి చేయడానికి చూస్తున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండ‌గా, పాకిస్థాన్ లో ఆగస్టు 19,20 తేదీల్లో జైషే మహ్మద్ కమాండర్ల సమావేశంలో ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ తోపాటు అతని సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్ఘర్ లు సమావేశమై దాడులకు వ్యూహరచన చేసినట్టు భార‌త‌వ‌ర్గాల‌కు సమాచారం అందింది. ఈ నేప‌థ్యంలో లిపా లోయ నుంచి యూరి, తంగధర్ సెక్టార్ల మీదుగా ఆఫ్ఘాన్ మిలిటెంట్లు కశ్మీర్ లోకి చొరబడి దేశంలోని కశ్మీర్ లోయతో పాటు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రల్లో దాడులకు ప్లాన్‌ చేసినట్టు ఐబీ హెచ్చరించింది. మరి భారత్ లోకి ప్రవేశించిన ఈ ఉగ్రవాదుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.