తులం బంగారం 74 వేలు ఆల్ టైం రికార్డ్ భారీగా పెరిగిన బంగారం ధర

88

తాజాగా కేంద్ర బడ్జెట్ లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకం 2.5 శాతం పెంపు పసిడి ప్రేమికులకు పెద్ద షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. ఆరోజు నుంచి నేటి వరకూ బంగారం మార్కెట్లో అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మన దేశంలో ప్రతీ శుభకార్యం, పర్వదినాలకు బంగారంతో విడదీయరాని బంధం ఉంది. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే బంగారం కొనేందుకు మన దేశంలో ధన త్రయోదశి, అక్షయ తృతీయ పేరుతో ఏకంగా రెండు పర్వదినాలే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా చుక్కలను తాకడంతో అన్ని వర్గాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. దీంతో పెరిగిన బంగారం ధరలతో ఈ వర్గం ప్రజలు మరింత ఎక్కువగా కలత చెందుతున్నారు. సాధారణంగా ఆషాఢ మాసంలో బంగారం ధరలు తగ్గుతాయి.

Image result for gold

గత సంవత్సరం ఆషాఢంలో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.31800గా ఉంది. అయితే ఈ ఏడాది ఆషాఢం ప్రారంభంలోనే బంగారం ధర రూ. 36000లకు చేరింది. ఈ లెక్కన శ్రావణ మాసంలో బంగారం ధర రూ.39 వేలు ఉంటుంది అని వ్యాపారులు చెప్పారు కాని ఆ అంచనాలు మించి మరీ ధరలు పెరిగిపొయాయి. ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.38,470 రూపాయలుగా ఉంది మరో వారంలో బంగారం పది గ్రాములు 40 వేల మార్క్ చేరవచ్చు అని తెలుస్తోంది. అయితే మన దేశంలో పరిస్గితి ఇలా ఉంది, కాని మన దాయాదీ దేశం పాకిస్ధాన్ లో బంగారం ధర వింటే కళ్లుజిగేల్ మంటాయి, అవును కనివిని ఎరుగని రీతిలో అక్కడ బంగారం ధర పెరిగింది.ముఖ‍్యంగా పాకిస్తాన్‌లో పెషావర్ లో పుత్తడి ధర వింటే గుండె గుభేలే అవుతుంది. అవును.. ఇండియాతో పోలిస్తే.. పాకిస్తాన్‌లో బంగారం ధర రెండింతలు ఎక్కువ పలుకుతోంది. ,ఆగస్ట్ 12న పాకిస్తాన్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.74,588గా ఉంది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్ అంటారు (11.66 గ్రాములుగా లెక్కిస్తారు) బంగారం రూ.87,000 గా ఉంది. పాకిస్తాన్‌లోని ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతోంది.

Image result for gold

24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 21 క్యారెట్లు, 18 క్యారెట్లు, 10 తులాల బంగారం ధరలు ఆయా నగరాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కరాచిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,588 ఉండగా, 24 క్యారెట్ల తుల బార్ రూ.87,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,373గా ఉంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, సియాల్‌కోట్ నగరాల్లో 24 క్యారెట్లు, 24 క్యారెట్లు తుల బార్స్, 22 క్యారెట్ల బంగారం వరుసగా.. రూ.74,588, రూ.87,000, రూ.68,373గా ఉన్నాయి. ఇలా మన దేశంలో కంటే పాకిస్ధాన్ లో రెండింతలు బంగారం ధరలు పెరగడంతో వారు కూడా ఆర్నమెంట్స్ చేయించుకునేందుకు భయపడుతున్నారు, మన దేశంలో వారు మాత్రం పాకిస్ధాన్ రేటు చూసి షాక్ అవుతున్నారు బంగారం మన దేశంలో కొనుక్కుంటే చాలా బెటర్ అని సలహ కూడా ఇస్తున్నారు.ఫెడ్‌ వడ్డీరేటు, అమెరికా చైనా ట్రేడ్‌వార్‌ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. మరిపాకిస్ధాన్ లో గోల్డ్ రేట్ చూశారుగా దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.

ఈ క్రింద వీడియో చూడండి