తన రియల్ లవ్ స్టొరీ చెప్పి షో లోనే ఏడ్చేసిన సుధీర్ |

521

జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెర‌పై అల‌రించి వెండితెర‌పై కూడా కామెడీని పండిస్తున్న క‌మెడియ‌న్లు చాలా మంది ఉన్నారు.. ముఖ్యంగా వారిలో ఎవ‌రికి రాని అంత క్రేజ్ సుధీర్ కు వచ్చింది అని చెప్పాలి.. సుధీర్ ర‌ష్మి మ‌ధ్య ఉన్న సంబంధంపై ఇప్ప‌టికే అనేక రూమ‌ర్లు వ‌స్తున్నాయి.. ఇటు బుల్లితెర‌లో ఏ షోలో చూసినా వీరి మ‌ధ్య మ‌రింత గాసిప్ లకు కార‌ణం అయింది.. అయితే దీనినే వారు కూడా క్యాష్ చేసుకున్నారు.. ఈ మ‌సాలాతోనే షోల‌ను అల‌రిస్తున్నారు.. వీరి ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంది అనే విష‌యం అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఇక వీరు ఇద్ద‌రూ నిజంగా ప్రేమించుకుంటున్నారా, పెళ్లి చేసుకుంటారా అంటే ఎవ‌రూ స‌రైన స‌మాధానం మాత్రం చెప్పరు.. కాని ఇటీవ‌ల ఓ షోలో క‌మెడియ‌న్ సుధీర్ త‌న ప్రేమ గురించి తెలియ‌చేశాడు.

త‌న‌కు చిన్న‌త‌నంలో ఓ ప్రేమ ఉంద‌ని, ఐద‌వ త‌ర‌గ‌తి నుంచి త‌న‌ని ప్రేమించాన‌ని చెప్పాడు సుధీర్…యాంక‌ర్ సుమ చేస్తున్న ఓ షో లో సుధీర్ త‌న చిన్న‌నాటి ప్రేమ గురించి తెలియ‌చేశాడు… ఈషోకు అడ‌విశేషు, మంచు ల‌క్ష్మి, ప్రియ‌మ‌ణి, సుదీర్ వ‌చ్చారు తాజాగా విడుద‌లైన ఈ ప్రోమోలో సుధీర్ త‌న చిన్ననాటి ప్రేమ గురించి మొద‌టి క్ర‌ష్ గురించి తెలియ‌చేశాడు. తాను స్కూల్ లో చ‌దువుకునే రోజుల్లో ఐద‌వ త‌ర‌గ‌తిలో ఆమెని ప్రేమించాను ఆమె నా ప్రేమ‌ను తొమ్మిదోత‌ర‌గ‌తిలో ఒకే చేసింది బాగానే ఉండేవాళ్లం. నా చ‌దువు అయిపోయిన త‌ర్వాత నేను హైద‌ర‌బాద్ వ‌చ్చాను లైఫ్ లో సెటిల్ అయిన త‌ర్వాత పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయికి చెప్పాను అని సుధీర్ క‌న్నీరు తెచ్చుకుంటూ చెప్పాడు..

కాని అనుకోకుండా ఓ రోజు నా స్నేహితుడు ఫోన్ చేసి ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింద‌ని చెప్పాడు.. ఆ అమ్మాయి ల‌వ్ మ్యారేజ్ చేసుకుంది అని చెప్ప‌డంతో సుధీర్ ఎంతో బాధ‌ప‌డ్డాడు.. ఓరోజు త‌న‌కి ఫోన్ చేస్తే నేను సంతోషంగా ఉన్నాను న‌న్ను డిస్ట్రర్బ్ చేయ‌ద్దు అని ఆ అమ్మాయి చెప్పింది అని చెప్పాడు సుధీర్.. మొత్తానికి సుధీర్ ప్రేమ ఫెయిల్ అవ్వ‌డంతో ఇప్పుడు నిజంగా సిన్సియ‌ర్ గా ర‌ష్మిని ప్రేమిస్తున్నాడు అని అంటున్నారు. కాని ర‌ష్మి నుంచి మాత్రం ఎటువంటి స్పంద‌న లేదు అని చెబుతున్నారు.. నిజంగా ప్రేమ‌లో ఫెయిల్ అయినా సుధీర్ మాత్రం జీవితంలో గెలుపొందాడు.. బుల్లితెర‌లో ల‌క్ష‌లాది మందిని అల‌రిస్తున్నాడు. తెలుగుప్ర‌జ‌లు అంద‌రికి తెలిసిన క‌మెడియ‌న్ గా పేరు తెచ్చుకున్నాడు… చూశారుగా సుధీర్ ల‌వ్ పై మీరు ఏమినుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.