ట్రాఫిక్ పోలీసులు చేసిన పనికి.. ఖంగుతిన్న వాహనదారుడు !

79

శ్రీకాకుళం నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. ఓవైపు పెద్దపెద్ద వస్త్ర దుకాణాల సందడి, మరోవైపు ఫుట్‌పాత్‌ వ్యాపారుల హడావుడితో ప్రధాన వీధులన్నీ నిత్యం రద్దీగా కనిపిస్తున్నాయి. వాహనాల పార్కింగ్‌ కోసం డివైడర్‌ మధ్యలో స్థలాన్ని కేటాయించినా చాలని దుస్థితి నెలకొంది. అయితే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన శ్రీకాకుళం నగర పోలీసులు.. హెచ్చరికలు జారీచేయకుండానే ఫైన్ వసూలు చేయడం చర్చనీయాంశమవుతోంది. కొందరు పోలీసులు తమ టార్గెట్లు పూర్తి చేసుకోవడానికి చాటుమాటున వాహనాల ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ తప్పేమిటో తెలియకుండానే ‘ఈ చలానా’ రూపంలో జరిమానాలను చెల్లించాల్సి వస్తోంది.

Image result for traffic police

ప్రస్తుత ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం ఆగస్టు ఒకటో తేదీ నుంచి నగరంలో కూడా హెల్మెట్‌ పెట్టుకోవాలని అధికారులు ఆదేశించారు. అయితే ఈ దిశగా ఎక్కడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. ట్రాఫిక్‌ పోలీసులు వారికి నచ్చిన రీతిలో వాహనదారులపై బలవంతంగా జరిమానాలు రుద్దుతున్నారు. దీని కోసం చాటుమాటుగా, షాపుల పక్కన, వెహికల్స్ వెనుక నుంచి ఫొటోలు తీస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నగరంలోని పాత బస్టాండ్‌ జంక్షన్‌ వద్ద ఓ సెల్‌షాపు వద్ద పోలీసులు కనపడకుండా నిల్చొని ఫొటోలు తీస్తున్నారు. ఇదే సమయంలో వాహనదారులకు అసలు ఇక్కడ చెకింగ్‌ అవుతుందన్న విషయం తెలియడం లేదు. అసలు హెల్మెట్‌ కోసం పోలీసులు ఒకసారి పత్రిక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కనీసం సిగ్నల్స్‌ వద్ద మైకులో కూడా ప్రచారం చేయడం లేదు. పైగా షాపుల వద్ద నిల్చుని, వెనుక నుంచి చెప్పకుండా ఫొటోలు తీసి ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారు. ‘ఈ చలానా’ రూపంలో అపరాధ రుసుం చెల్లించాలని సమాచారం అందినప్పుడు వాహనదారులు అవాక్కవుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

శ్రీకాకుళంలో గుజరాతీపేటకు చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై ఈనెల 14న ఉదయం 9.45 గంటలకు పాతబస్టాండ్‌ మీదుగా అరసవల్లి వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి పేరున అదే రోజు మధ్యాహ్నం 1.41 గంటలకు పేరులేని రోడ్డు, ఎల్‌బీఎస్‌ కాలనీ, శ్రీకాకుళం అని పేర్కొని ట్రాఫిక్‌ పోలీసులు ‘ఈ-చలానా’ వేశారు. ఆ విషయం అతనికి తెలీదు. తర్వాత దీని గురించి తెలిసి పోలీసులను సంప్రదించాడు. ‘మీ-సేవ’లో చలానా కట్టాలని వారు ఆదేశించగా.. అసలు తన తప్పేంటో తెలుసుకోవాలని ఆ వ్యక్తి ‘మీ-సేవ’లో చలానా వివరాలను చూసుకున్నాడు. తన వాహనానికి వెనుక నుంచి తీసిన ఫొటో, టైమ్, ఏరియా తప్పుగా నమోదు చేసి ఈ చలానా వేసినట్టు గుర్తించాడు..ఈ విషయంపై కోర్ట్ కు వెళ్తానని చెప్పాడు. పోలీసులు షాపుల మూల నుంచి ఫొటోలు తీస్తున్న విషయం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని తెలిపాడు. తమకు ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేసేందుకే కొందరు ట్రాఫిక్‌ ఎస్‌ఐలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఉన్నతాధికారుల మెప్పు కోసం ప్రజలకు ఈ-చలానాలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు వారికి తెలియకుండా వెనుక నుంచి ఫొటో తీసి ఈ-ఫైన్‌ వేస్తున్నారు. హెల్మెట్‌ పెట్టుకోలేదని వాహనదారులకు తెలియకుండా పోలీసులకు నచ్చినట్లు ఫైన్ వేస్తున్నారు. ఇలా పోలీసులు చెయ్యడం గురించి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యక్తి కోర్ట్ కు వెళ్తున్నాడు. చూడాలి మరి కోర్ట్ ఈ పోలీసులకు ఎలాంటి శిక్ష వేస్తుందో..