టాప్ యాంకర్ కు షాక్! భర్త రెండో పెళ్లి..

666

టాలీవుడ్ లో పెళ్లిళ్ల సంద‌డి మొద‌లైంది.. తాజాగా ప‌లువురు సెల‌బ్రెటీలు పెళ్లీ పీట‌లు ఎక్కుతున్నారు.. ఇప్ప‌టికే క‌ల‌ర్ స్వాతి వివాహం గురించి కూడా వార్త‌లు వ‌చ్చాయి… ఇక మ‌రో ఇద్ద‌రు క‌మెడియ‌న్లు కూడా పెళ్లికిసిద్ద‌మ‌య్యారు. టాలీవుడ్ క‌మెడియ‌న్ త‌న షోల‌తో బుల్లితెర‌లో కొన్నిసంవ‌త్స‌రాల పాటు అల‌రించిన జోగినాయుడు, రెండోవ వివాహం చేసుకున్నాడు.. ఇంత‌కీ జోగి నాయుడు ఎవ‌రు అనుకుంటున్నారా ప్ర‌ముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్ లో డిఫ‌రెంట్ గెట‌ప్ తో అద‌ర‌గొట్టారు జోగి బ్ర‌ద‌ర్స్, తాజాగా ఆయ‌న రెండోవ వివాహం చేసుకున్నారు.

కొన్నేళ్ల క్రితం తన మాజీ భార్య నటి, యాంకర్ అయిన ఝాన్సీ నుంచి జోగినాయుడు విడిపోయిన సంగతి తెలిసిందే. ఝాన్సీ నటిగాను, యాంకర్ గా టాలీవుడ్ లో రాణిస్తోంది. ఇక జోగినాయుడు పలు చిత్రాల్లో కమెడియన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు…. కుటుంబంలో విభేదాలు వ్యక్తిగత జీవితంలో విభేదాలు తలెత్తడంతో ఝాన్సీ, జోగినాయుడు 2014 లో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కుమార్తె జాన్సీ వద్దనే ఉంది. విభేదాలు ముదరకుండా ఎవరి జీవితం వారు గడపాలని అప్పట్లో విడిపోయినట్లు జోగినాయుడు ఓ సంధర్భంలో వివరించాడు.

జోగినాయుడు సుకుమార్ చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తుంటాడు. కార్తికేయ, స్వామిరారా ఇలా పలు చిత్రాలలో జోగినాయుడు క్యారెక్టర్ రోల్స్ చేసిన‌ సంగతి తెలిసిందే. ఇటీవల రంగస్థలం చిత్రంలో కూడా జోగినాయుడు జగపతి బాబుకు సేవలు చేసే వ్యక్తిగా నటించాడు…ఝాన్సీ నుంచి విడిపోయిన తరువాత ఒంటరిగా ఉంటున్న జోగినాయుడు తాజాగా రెండవ వివాహం చేసుకున్నాడు. విశాఖ లోని తన స్వగ్రామం చెర్లోపాళేనికి చెందిన యువతిని జోగినాయుడు రెండవ వివాహం చేసుకున్నాడు.ఇక ఝాన్సీ అటు యాంకర్ గా, నటిగా టాలీవుడ్ లో బిజీగా గడుపుతోంది. నెల్లూరు, తెలంగాణ ఎలాంటి యాసలో అయినా డైలాగులు చెబుతూ ఆకట్టుకోవడం ఝాన్సీ ప్రత్యేకత. బుల్లితెరపై, సినిమా వేడుకలో యాంకర్ గా రాణిస్తోంది.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.