జాతీయ జెండాను చింపిన పాకీలు.. ధైర్యంగా అడ్డుకున్న భారత విలేకరి!

56

‘ఏ దేశమేగినా.. ఎందు కాలిడిగానా, పొగడరా నీ తల్లి భూమి భారతిని..’ అని పిలుపునిచ్చాడు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. అందుకే మన భారతీయులు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా మన భారతగడ్డ మీద ప్రేమను మాత్రం చంపుకోరు. ఇప్పుడు ఒక మహిళా విలేకరి అచ్చం అలాంటి పనే చేసింది. అల్లరి మూకల చేతుల్లో అవమానానికి గురవుతున్న‘భారతి’ని వారి చెర నుంచి విడిపించి దేశ గౌరవాన్ని కాపాడింది. లండన్‌లో పంద్రాగస్టున జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Image result for indian flag

ఆర్టికన్ 370 రద్దు, కశ్మీర్ విభజన విషయంలో భారత్ పాక్ మధ్య ఎలాంటి రచ్చ జరుగుతుందో మనకు తెలుసు. ఏకంగా దేశ ప్రధానుల మధ్యనే ఈ విషయం గురించి చర్చ జరుగుతుంది. అలాంటప్పుడు ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో చుడండి. అందుకే భారత్ మీద తమ కోపాన్ని ప్రదర్శించారు పాకిస్తానీయులు. వాళ్లకు తోడుగా కొందరు కాశ్మీర్ వాళ్ళు కూడా తమ కోపాన్ని ప్రదర్శించారు. ఆర్టికన్ 370 రద్దును నిరసిస్తూ లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ముందు కొంతమంది కశ్మీరీలతో పాటు పాకిస్తానీలు నిరసన తెలిపారు. పాకిస్తాన్ జెండాలు తీసి ప్రదర్శించారు. భారతీయ జెండాలను అవమానించారు. కొందరు కత్తులు కూడా తీసుకొచ్చారు. భారత్‌కు, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంపులోని ఓ పాకిస్తానీ.. కశ్మీరీల చేతుల్లోంచి భారత జాతి పతాకాన్ని లాక్కుని పాక్ అల్లరిమూక చేతికి అందించాడు. వారు దాన్ని కాళ్ల కింద వేసి తొక్కేయడం, చించేయడం ప్రారంభించారు.

ఈ క్రింద వీడియో చూడండి

నిరసనను కవర్ చేయడానికి వెళ్లిన ఏఎన్ఐ వార్తా సంస్థకు చెందిన భారతీయ విలేకరి పూనమ్ జోషి దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూసి కలత చెందారు. పరుగుపరుగునా వెళ్లి అల్లరి మూక చేతుల్లోంచి భారతీయ పతాకాన్ని చప్పున గుంజుకున్నారు. ఈ దృశ్యం అక్కడి వీడియోల్లో రికార్డయింది. పూనమ్ జోషి సాహసాన్ని భారతీయులు ప్రశంసిస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘వారు జెండాను చించేశారు. నేను పోలీసులకు అవతల ఉన్నాను . వెంటనే పరిగెత్తి వారు చించేసిన జెండాను తీసుకున్నాను. ఒకరి చేతిలోంచి మరో ముక్క లాక్కున్నాను.. ’ అని తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆమె చేసిన పనికి భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.