చంద్రుడి పై చంద్రయాన్ మనం ఫెయిల్ అయ్యాం చైనా ఎలా సక్సస్ అయింది సీక్రెట్ ఇదే

526

యావత్ భారతదేశ ప్రజలు అందరూ చంద్రయాన్ పై ఎన్నో ఆశలుపెట్టుకున్నారు అయితే అది ఫెయిల్ అవడంతో చివరికి శాస్త్ర్రవేత్తల అందరి వెనుక మేము ఉన్నాం అని భరోసా ఇచ్చారు దేశ ప్రజలు.చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి మెట్టుపై ఆగిపోయిన విషయం పై ప్రపంచం అంతా సైంటిస్టులకు నూతన ఉత్తేజం కలిగించింది..ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్ విక్రమ్ చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా సాంకేతిక లోపం తలెత్తి సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ చెందారు. వారు సాధించిన విజయం తక్కువేం కాదని, భవిష్యత్తులో మంచి విజయాలను అందుకుంటారని భరోసా ఇచ్చింది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను దగ్గరకు తీసుకుని ఓదార్చిన తీరుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే చైనా చంద్రుడిపై 12 సంవత్సరాలుగా శోధన చేస్తోంది దాని సక్సెస్ వెనుక రీజన్ కూడా తాజాగా బయటపడింది.

Image result for చంద్రుడి పై చంద్రయాన్

చంద్రుడి ఉపరితలాన్ని దాదాపు పన్నెండేళ్లుగా శోధిస్తున్న చైనా అంత ఈజీగా చంద్రుడిని తాకలేదు… తన నాలుగో ప్రయత్నంలో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను విజయవంతంగా సాధించగలిగింది. భారత్‌ మాదిరే చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ఎన్నుకున్నప్పటికీ చైనా… కాస్త ముందుచూపుతో దక్షిణాది అంచున ఉన్న ఎయిట్కెన్‌ బేసిన్‌లోని ఓ సురక్షిత ప్రదేశాన్ని తన ల్యాండింగ్‌ సైట్‌గా ఎంపిక చేసుకుంది. 2500 కిలోమీటర్ల వెడల్పు, 13 కిలోమీటర్ల లోతు ఉన్న ఎయిట్కెన్‌ బేసిన్‌ను సౌర వ్యవస్థలోనే అది పెద్ద బిల్వంగా చెబుతారు. ఇది అతి ప్రాచీనమైనది. దీని గురించి విస్తృతమైన సమాచారం శాస్త్ర లోకంలో ఉంది. ఇక్కడ ప్రతికూలతలు తక్కువ. భారత్‌ అలా కాకుండా ఈ బేసిన్‌కు దూరంగా దక్షిణ ధ్రువ మధ్యప్రాంతంలో స్థలాన్ని దిగాల్సిన ప్రాంతంగా నిర్ణయించుకుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా లేదు. ఉపరితలంపై ఏమున్నాయో తెలియదు. నిరుడు డిసెంబరు 15న చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు వెళ్లిన చైనా నౌక చాంగ్‌-4ను కూడా రోబోటిక్‌ ఆపరేషన్‌తోనే నడిపారు. అది చంద్రుడి ఉపరితలంపై ఈ ఏడాది జనవరి 3న దిగింది. నిజానికి దీన్ని కూడా భూమిపై ఉన్న కమాండ్‌ సెంటర్‌ నేరుగా కంట్రోల్‌ చేయలేని పరిస్థితి. ఇక్కడ కూడా కమ్యూనికేషన్‌ సవాల్‌ ఉంది.

ఈ క్రింద వీడియో చూడండి

ఆఖరి దశలో చాంగ్‌ ల్యాండర్‌ తనంత తానుగా పరిస్థితులను సమన్వయం చేసుకొనేట్లు ప్రోగ్రాం రాసి పంపారు. తదనుగుణంగా ల్యాండర్‌ 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి రాకెట్‌ బూస్టర్‌ ద్వారా ఎత్తు తగ్గించుకుంటూ నెమ్మదిగా కిందికి వచ్చింది. చంద్రుడి ఉపరితలానికి ఓ వంద మీటర్ల ఎత్తులో ఉన్నపుడు కాసేపు అది గాల్లోనే తిరుగాడుతూ అనువైన ప్రదేశం కోసం అన్వేషించింది. బండరాళ్లు, నీటిపాయలు లేని చదునైన స్థలాన్ని అన్వేషించుకుని, చివరకు వాన్‌ కర్మాన్‌ అనే చోట నెమ్మదిగా ఏ ఇబ్బందులూ లేకుండా ల్యాండ్‌ అయింది. ఎయిట్కెన్‌ బేసిన్‌లోనే ఉన్న ఓ చిన్న బిలం ఈ వాన్‌ కర్మాన్‌! చంద్రుడిపై దిగిన రోవర్‌ కూడా తన సిగ్నల్స్‌ను క్వెకియో అనే మరో ఉపగ్రహానికి పంపి దాని ద్వారా భూమికి రిలే చేసేది. ఈ మొత్తం క్రమంలో అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక సవాళ్లను అధిగమించినట్లు ఆనాడు చైనా వెల్లడించింది. అయితే మన దేశం కూడా తమ ప్రయోగాలు ఇంకా చేస్తాము అని చెబుతోంది… దీనిలో సక్సెస్ అవుతాము అని చెబుతున్నారు ఇస్రో సైంటిస్టులు.. మన శాస్త్రవేత్తలకు మనం కూడా అండగా ఉందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.